కాలప్రవాహం - అనాది - అనంతం. ఆ ప్రవాహంలో కొట్టుకొనిపోయే మనకి - ఆది - అంతం వున్నాయి. కాని కాలప్రవాహానికి అవి లేవు. ప్రవాహంలో వివశులమై కొట్టుకొనిపోయేమనం - మొసళ్ళు, తిమింగిలాలు మొదలైన వాటికీ చిక్కుకొనే ప్రమాదం ఉంది. యే మానునో పట్టుకొని యేద్వీపానికొ తీరానికో పడవ/ఓడ లోనికి చేరే ప్రమోద అవకాశమూ వున్నది. ప్రమాదమును తప్పించి ప్రమోదమును కలిగించవలసినదిగా మనం - అదృశ్యమైన 'శక్తి'ని కోరుతాము - ప్రార్ధిస్తాము. ఆ 'శక్తి'యే జీవన ప్రవాహాన్ని - అందులో చిక్కుఉన్న - మనల్నీ - సృష్టించినట్లు నమ్ముతాము. ఆ శక్తి తిరుగులేనిది - మనల్ని రక్షించగలదని భావిస్తాము.
ఆ 'శక్తి'ని దైవంగా భావిస్తాము. స్త్రీ రూపంగా భావిస్తే దేవి అని, పురుష రూపంలో భావిస్తే శివుడు/విష్ణువు అని - మన సాంప్రదాయాన్ని - నమ్ముకొని అనుసరించి - సేవిస్తాము. స్తోత్రాలను, చదువుతాము. ఆ స్తోత్రాలు పురాణాలు మొదలైనవానిలోనివి అయితే ప్రామణికములు అని శ్రద్ధ చూపుతాము. వానిని అనుసంధానం చేస్తాము. పారాయణ చేస్తాము.
ఇలాంటి సోత్రములను - పురాణములు తంత్రములు మొదలైన వాని నుండి గ్రహించి బ్రహ్మశ్రీ యం.జి.సుబ్బరాయశాస్త్రిగారు - 5,6 భాగాలుగా (వివధ దేవతలకు సంబంధించి) ప్రకటించినట్లుగా పెద్దలమాట. వారి 'బృహత్' స్తోత్ర రత్నాలు యిప్పుడు లభించడంలేదు. కానీ తరువాత శ్రీ యం.జి.సుబ్బరాయశాస్త్రివారిని అనుసరించి దేవి, శివ, విష్ణు స్తోత్రాలుగా చాలా మంది పెద్దలు ప్రకటించి నారు.
అట్టి ప్రామాణిక ప్రతిని - ఆధారముగా - ప్రమాణముగా గ్రహించి - మేము యధాతధంగా దేవిస్తోత్రరత్నాకరము - మా అభిమాన పాఠకులకు అందిస్తున్నాము.
ఈ గ్రంధములో 150కీ పైగా స్తోత్రములున్నవి. వీనిలో సోత్రములు, స్తుతులు, స్తవముల, అష్టకములు, నవరత్నమాలికలు, స్తుతి దశకములు, అష్టోత్తర శతనామస్తోత్రములు, సహస్త్రనమ స్తోత్రములు, హృదయములు, కవచములు మున్నగునవి ఉన్నాయి.
అన్నపూర్ణ, ఇంద్రాక్షి, కామాక్షి, కాళీ, వారహీ, కుమారీ, గంగా, గిరిజా, ఛిన్నమస్తా, తారా, తులసీ, త్రిపురభైరవీ, భువనేశ్వరి, మహాలక్ష్మి, సరస్వతీ మున్నగు వివిధ దేవతల ప్రామాణిక సోత్రములున్నాయి.
ప్రాచీనస్తుతులలోని అమ్బ, కన్డుకము మొదలైన పదములలోని పరసవర్ణ, పదములను, అంబ, కందుకము, యిలా పాఠకులకు సులభమైన ఉచ్చారణకు వీలుగా మార్చబడినవి. అందరికీ అర్ధమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని అందించడం జరిగింది
కాలప్రవాహం - అనాది - అనంతం. ఆ ప్రవాహంలో కొట్టుకొనిపోయే మనకి - ఆది - అంతం వున్నాయి. కాని కాలప్రవాహానికి అవి లేవు. ప్రవాహంలో వివశులమై కొట్టుకొనిపోయేమనం - మొసళ్ళు, తిమింగిలాలు మొదలైన వాటికీ చిక్కుకొనే ప్రమాదం ఉంది. యే మానునో పట్టుకొని యేద్వీపానికొ తీరానికో పడవ/ఓడ లోనికి చేరే ప్రమోద అవకాశమూ వున్నది. ప్రమాదమును తప్పించి ప్రమోదమును కలిగించవలసినదిగా మనం - అదృశ్యమైన 'శక్తి'ని కోరుతాము - ప్రార్ధిస్తాము. ఆ 'శక్తి'యే జీవన ప్రవాహాన్ని - అందులో చిక్కుఉన్న - మనల్నీ - సృష్టించినట్లు నమ్ముతాము. ఆ శక్తి తిరుగులేనిది - మనల్ని రక్షించగలదని భావిస్తాము. ఆ 'శక్తి'ని దైవంగా భావిస్తాము. స్త్రీ రూపంగా భావిస్తే దేవి అని, పురుష రూపంలో భావిస్తే శివుడు/విష్ణువు అని - మన సాంప్రదాయాన్ని - నమ్ముకొని అనుసరించి - సేవిస్తాము. స్తోత్రాలను, చదువుతాము. ఆ స్తోత్రాలు పురాణాలు మొదలైనవానిలోనివి అయితే ప్రామణికములు అని శ్రద్ధ చూపుతాము. వానిని అనుసంధానం చేస్తాము. పారాయణ చేస్తాము. ఇలాంటి సోత్రములను - పురాణములు తంత్రములు మొదలైన వాని నుండి గ్రహించి బ్రహ్మశ్రీ యం.జి.సుబ్బరాయశాస్త్రిగారు - 5,6 భాగాలుగా (వివధ దేవతలకు సంబంధించి) ప్రకటించినట్లుగా పెద్దలమాట. వారి 'బృహత్' స్తోత్ర రత్నాలు యిప్పుడు లభించడంలేదు. కానీ తరువాత శ్రీ యం.జి.సుబ్బరాయశాస్త్రివారిని అనుసరించి దేవి, శివ, విష్ణు స్తోత్రాలుగా చాలా మంది పెద్దలు ప్రకటించి నారు. అట్టి ప్రామాణిక ప్రతిని - ఆధారముగా - ప్రమాణముగా గ్రహించి - మేము యధాతధంగా దేవిస్తోత్రరత్నాకరము - మా అభిమాన పాఠకులకు అందిస్తున్నాము. ఈ గ్రంధములో 150కీ పైగా స్తోత్రములున్నవి. వీనిలో సోత్రములు, స్తుతులు, స్తవముల, అష్టకములు, నవరత్నమాలికలు, స్తుతి దశకములు, అష్టోత్తర శతనామస్తోత్రములు, సహస్త్రనమ స్తోత్రములు, హృదయములు, కవచములు మున్నగునవి ఉన్నాయి. అన్నపూర్ణ, ఇంద్రాక్షి, కామాక్షి, కాళీ, వారహీ, కుమారీ, గంగా, గిరిజా, ఛిన్నమస్తా, తారా, తులసీ, త్రిపురభైరవీ, భువనేశ్వరి, మహాలక్ష్మి, సరస్వతీ మున్నగు వివిధ దేవతల ప్రామాణిక సోత్రములున్నాయి. ప్రాచీనస్తుతులలోని అమ్బ, కన్డుకము మొదలైన పదములలోని పరసవర్ణ, పదములను, అంబ, కందుకము, యిలా పాఠకులకు సులభమైన ఉచ్చారణకు వీలుగా మార్చబడినవి. అందరికీ అర్ధమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని అందించడం జరిగింది
© 2017,www.logili.com All Rights Reserved.