ఖదీర్‌బాబు కథల్ని చదవడానికి కష్టపడక్కర్లేదు. చదవడం మొదలుపెడితే చాలు కథే మిమ్మల్ని కడకంటా లాక్కుపోతుంది. ఇక్కడ పది కథలున్నాయి. పది కథల్లోనూ రచయిత పది రకాలుగా కనిపిస్తాడు. సైకో ఎనలిస్టుగా, సైకో థెరపిస్టుగా, రియలిస్టు పెయింటర్‌గా, ఇంప్రషనిస్టుగా, కాఫీ టేబుల్ దగ్గర కథ చెప్పే స్నేహితునిగా, పాఠకుల చేతికి చిక్కి విలవిల్లాడే బాధిత రచయితగా, మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అన్వేషిగా - ఇలా రకరకాలుగా కనిపిస్తాడు.మూస కథలు రాయడం ఖదీర్‌బాబుకి రాదు. ఈ కథల్లో మీకు ఏమైనా దొరకచ్చుగాని డల్ మూమెంట్స్ మాత్రం మచ్చుకైనా దొరకవు. తినబోతూ రుచి అడగటమెందుకు, నా మాటలు వదిలేసి పక్కనున్న కథాస్రవంతిలో ఈదులాడండి.
- ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్
ఓ హెన్రీ, మంటోలాంటి వాళ్ళు ఏ విషయాన్నయినా కథగా రాయవచ్చునంటారు. తన సీనియర్లకన్నా అడుగు ముందుకేసి, 'ఒకటేం, పది కథలు రాస్తాన'న్నాడు ఖదీర్. నాకర్థమైనంతవరకూ యివి ఫేబుల్స్. అంటే నీతి కథలు. పంచతంత్రమైనా, ఈసప్ కథలైనా మానవ స్వభావాలను, మంచి చెడులను allegoricalగా చెప్పినవే. విలువలన్నీ వయ్యక్తికమూ, సాపేక్షమూ అనుకుంటున్న ఈ రోజులకు యివి మోడ్రన్ ఫేబుల్స్. క్లుప్తతను మూల లక్షణంగా పాటించిన ఫేబుల్స్.'బియాండ్ కాఫీ' లోకి ప్రవేశించడానికి వారగా తలుపు తీయటమే నా పని. అంతేగాని ముందుమాటలతో పాటకుల ముందరికాళ్ళకు బంధం వెయ్యటం మాత్రం కాదు.
- ముక్తవరం పార్థసారథి
ఖదీర్‌బాబు కథల్ని చదవడానికి కష్టపడక్కర్లేదు. చదవడం మొదలుపెడితే చాలు కథే మిమ్మల్ని కడకంటా లాక్కుపోతుంది. ఇక్కడ పది కథలున్నాయి. పది కథల్లోనూ రచయిత పది రకాలుగా కనిపిస్తాడు. సైకో ఎనలిస్టుగా, సైకో థెరపిస్టుగా, రియలిస్టు పెయింటర్‌గా, ఇంప్రషనిస్టుగా, కాఫీ టేబుల్ దగ్గర కథ చెప్పే స్నేహితునిగా, పాఠకుల చేతికి చిక్కి విలవిల్లాడే బాధిత రచయితగా, మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అన్వేషిగా - ఇలా రకరకాలుగా కనిపిస్తాడు.మూస కథలు రాయడం ఖదీర్‌బాబుకి రాదు. ఈ కథల్లో మీకు ఏమైనా దొరకచ్చుగాని డల్ మూమెంట్స్ మాత్రం మచ్చుకైనా దొరకవు. తినబోతూ రుచి అడగటమెందుకు, నా మాటలు వదిలేసి పక్కనున్న కథాస్రవంతిలో ఈదులాడండి. - ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ ఓ హెన్రీ, మంటోలాంటి వాళ్ళు ఏ విషయాన్నయినా కథగా రాయవచ్చునంటారు. తన సీనియర్లకన్నా అడుగు ముందుకేసి, 'ఒకటేం, పది కథలు రాస్తాన'న్నాడు ఖదీర్. నాకర్థమైనంతవరకూ యివి ఫేబుల్స్. అంటే నీతి కథలు. పంచతంత్రమైనా, ఈసప్ కథలైనా మానవ స్వభావాలను, మంచి చెడులను allegoricalగా చెప్పినవే. విలువలన్నీ వయ్యక్తికమూ, సాపేక్షమూ అనుకుంటున్న ఈ రోజులకు యివి మోడ్రన్ ఫేబుల్స్. క్లుప్తతను మూల లక్షణంగా పాటించిన ఫేబుల్స్.'బియాండ్ కాఫీ' లోకి ప్రవేశించడానికి వారగా తలుపు తీయటమే నా పని. అంతేగాని ముందుమాటలతో పాటకుల ముందరికాళ్ళకు బంధం వెయ్యటం మాత్రం కాదు. - ముక్తవరం పార్థసారథి© 2017,www.logili.com All Rights Reserved.