జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు విభాగం అత్యంత ప్రధానమయినది. ప్రాచీన కాలం నుండి మానవుడు సుఖప్రదంగా జీవించడానికి వాస్తుశాస్త్రం ఎంతో ఉపయుక్తంగా ఉంది. కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రాచీన ఋషులు రూపొందించిన సూత్రాలు ఆధునికుల చేత కుదింపబడటమో వక్రీకరింపబడటమో జరుగుతోంది. కేవలం తమ అనుభవాల ఆధారంగా నూతనంగా కొందరు ప్రచారం చేస్తున్న అంశాలు వివాదాలను సృష్టిస్తున్నాయి.
ఈ పుస్తకరచనలో చాల వాస్తు గ్రంధాలను పరిశీలించడం జరిగింది. ఇట్టి గ్రంధకర్తలను ప్రచురణ కర్తలకు హృదయ పూర్వక ధన్యవాదములు. శ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి వంటి ఉన్నత విద్యావేత్తలు అందరికి అర్ధమయ్యే విధంగా సరళ గ్రంధాల అవసరం ఏర్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డా. సి.వి. బి. సుబ్రహ్మణ్యం, శ్రీ గోరస వీరచంద్రాచారి గార్ల ఆధ్వర్యంలో వాస్తు శాస్త్ర పరిశోధనలు జరిగి పెద్ద గ్రంధాలు వెలువడ్డాయి. విస్తృతమైన చర్చ ఈ గ్రంధాలలో కనిపిస్తుంది. గృహ నిర్మాణ విధానాలలో ఈ కాలానికి అవసరమయ్యే సమాచారం సంక్షిప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకే అవసరమైన సమాచారంతో ఈ చిన్న పుస్తకాన్ని రూపొందించడం జరిగింది.
- భీమాసాంబశివరావు
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు విభాగం అత్యంత ప్రధానమయినది. ప్రాచీన కాలం నుండి మానవుడు సుఖప్రదంగా జీవించడానికి వాస్తుశాస్త్రం ఎంతో ఉపయుక్తంగా ఉంది. కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రాచీన ఋషులు రూపొందించిన సూత్రాలు ఆధునికుల చేత కుదింపబడటమో వక్రీకరింపబడటమో జరుగుతోంది. కేవలం తమ అనుభవాల ఆధారంగా నూతనంగా కొందరు ప్రచారం చేస్తున్న అంశాలు వివాదాలను సృష్టిస్తున్నాయి. ఈ పుస్తకరచనలో చాల వాస్తు గ్రంధాలను పరిశీలించడం జరిగింది. ఇట్టి గ్రంధకర్తలను ప్రచురణ కర్తలకు హృదయ పూర్వక ధన్యవాదములు. శ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి వంటి ఉన్నత విద్యావేత్తలు అందరికి అర్ధమయ్యే విధంగా సరళ గ్రంధాల అవసరం ఏర్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డా. సి.వి. బి. సుబ్రహ్మణ్యం, శ్రీ గోరస వీరచంద్రాచారి గార్ల ఆధ్వర్యంలో వాస్తు శాస్త్ర పరిశోధనలు జరిగి పెద్ద గ్రంధాలు వెలువడ్డాయి. విస్తృతమైన చర్చ ఈ గ్రంధాలలో కనిపిస్తుంది. గృహ నిర్మాణ విధానాలలో ఈ కాలానికి అవసరమయ్యే సమాచారం సంక్షిప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకే అవసరమైన సమాచారంతో ఈ చిన్న పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. - భీమాసాంబశివరావు© 2017,www.logili.com All Rights Reserved.