కులం అంటే భారతదేశ ప్రజల ప్రత్యేక మానసిక రాజ్యాంగం. ప్రపంచంలో ఎవరికీ లేని, ఎవరికీ అర్థంకాని మానసిక రాజ్యాంగం. భారతదేశంలో అమాయక పిల్లలు తల్లిగర్భం నుండి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది మొదలు, భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాకుండా వర్ణ లేదా కులవ్యవస్థకు సంబంధించిన ధర్మం, నీతిని పాటిస్తారు. తల్లిదండ్రుల నుండి పండుగల నుండి, ఆచారాల నుండి, కులపరమైన ఆహారం తింటూ, తన చుట్టూఉన్న సమాజం నుండి, కుల పద్ధతులు నేర్చుకొని కుల నీతిని, వర్ణ ధర్మాన్ని గౌరవించి ఆచరిస్తారు. ప్రతీ పిల్లవాడికి, పిల్లకి తన కులం స్పృహ ఉంటుంది. తన కులం కంటే ఏ కులం గొప్పదో, ఏ కులం తక్కువదో, ఏది అగ్రకులమో, వారి గుణం పుట్టుకతో ఎలా ఉంటుందో, ఎవరు శూద్రులో, ఎవరు అంటరానివారో, 2000 సంవత్సరాల క్రితం మనుస్మృతిలో చెప్పిన ప్రకారం, అచ్చుగుద్దినట్లు అవగాహన ఉంటుంది.
ఈ పుస్తకం కులవ్యవస్థ మూలాల ఆధారాల కోసం - శూద్రులు చదివితే నాలుకలు కోసి, వింటే చేవులల్లో సీసం పోసిన వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, పురాణాల మూలాలను శోదిస్తుంది. ఈ పుస్తకంలో ఋగ్వేదంలోని కొన్ని ముఖ్య శ్లోకాలను, గాయత్రీ మంత్రాన్ని సంస్కృతంలో తెలుగు తర్జుమాతో పాటు నా వివరణని పొందుపరచడమైనది.
- సత్య బత్తుల
కులం అంటే భారతదేశ ప్రజల ప్రత్యేక మానసిక రాజ్యాంగం. ప్రపంచంలో ఎవరికీ లేని, ఎవరికీ అర్థంకాని మానసిక రాజ్యాంగం. భారతదేశంలో అమాయక పిల్లలు తల్లిగర్భం నుండి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది మొదలు, భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాకుండా వర్ణ లేదా కులవ్యవస్థకు సంబంధించిన ధర్మం, నీతిని పాటిస్తారు. తల్లిదండ్రుల నుండి పండుగల నుండి, ఆచారాల నుండి, కులపరమైన ఆహారం తింటూ, తన చుట్టూఉన్న సమాజం నుండి, కుల పద్ధతులు నేర్చుకొని కుల నీతిని, వర్ణ ధర్మాన్ని గౌరవించి ఆచరిస్తారు. ప్రతీ పిల్లవాడికి, పిల్లకి తన కులం స్పృహ ఉంటుంది. తన కులం కంటే ఏ కులం గొప్పదో, ఏ కులం తక్కువదో, ఏది అగ్రకులమో, వారి గుణం పుట్టుకతో ఎలా ఉంటుందో, ఎవరు శూద్రులో, ఎవరు అంటరానివారో, 2000 సంవత్సరాల క్రితం మనుస్మృతిలో చెప్పిన ప్రకారం, అచ్చుగుద్దినట్లు అవగాహన ఉంటుంది. ఈ పుస్తకం కులవ్యవస్థ మూలాల ఆధారాల కోసం - శూద్రులు చదివితే నాలుకలు కోసి, వింటే చేవులల్లో సీసం పోసిన వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, పురాణాల మూలాలను శోదిస్తుంది. ఈ పుస్తకంలో ఋగ్వేదంలోని కొన్ని ముఖ్య శ్లోకాలను, గాయత్రీ మంత్రాన్ని సంస్కృతంలో తెలుగు తర్జుమాతో పాటు నా వివరణని పొందుపరచడమైనది. - సత్య బత్తుల© 2017,www.logili.com All Rights Reserved.