అహల్య జీవితాన్ని నవలగా మలిచిన తరువాత వసుమతిగారు సుమిత్ర పాత్రను ఎంచుకున్నారు. "భూమికే గాయాలూ, మచ్చలూ, పొడుపులూ పోట్లు తప్పడం లేదు. మానవులూ వారి జీవనమూ ఏ పాటిది..." అనే మాటల్ని సుమిత్ర నోటిద్వారా పలికించటంలోనే సుమిత్ర జీవిత స్వభావ చిత్రణ మనకు కళ్ళ కడుతుంది." ఉపశమనానికే ఈ పచ్చటి వనాలూ, వర్ణాలు" అంటుంది సుమిత్ర.
"ఉత్తమ మానవీయతా విలువలకు గౌరవాన్నిచ్చే వ్యక్తీ మీరు... భోగాలు, త్యాగాలు మన అంతఃపురాల్లో మామూలే! కానీ, వ్యక్తిగా రాణించటం చాలా కష్టసాధ్యమైన విషయం. అది ఎలా సాధించారు మీరు...?" అని సుమిత్రని వల్లి అనే పాత్ర అడుగుతుంది.
"నేను చేసే ప్రతిపని, నా చేతులు, నా స్పందన అన్నీ నా ధర్మంగా అనుకుంటాను..." అంటుంది. సుమిత్ర. ఇక్కడ "నా ధర్మం" అనేదే ముఖ్యమైంది. ఒక మహిళ తాను భార్యగా, కోడలిగా, తోడుకోడలిగా, తల్లిగా, అత్తగా, యజమానురాలిగా తన ధర్మాన్ని తాను నెరవేర్చ గలిగిన వ్యక్తీ సుమిత్ర.
- చలసాని వసుమతి
అహల్య జీవితాన్ని నవలగా మలిచిన తరువాత వసుమతిగారు సుమిత్ర పాత్రను ఎంచుకున్నారు. "భూమికే గాయాలూ, మచ్చలూ, పొడుపులూ పోట్లు తప్పడం లేదు. మానవులూ వారి జీవనమూ ఏ పాటిది..." అనే మాటల్ని సుమిత్ర నోటిద్వారా పలికించటంలోనే సుమిత్ర జీవిత స్వభావ చిత్రణ మనకు కళ్ళ కడుతుంది." ఉపశమనానికే ఈ పచ్చటి వనాలూ, వర్ణాలు" అంటుంది సుమిత్ర. "ఉత్తమ మానవీయతా విలువలకు గౌరవాన్నిచ్చే వ్యక్తీ మీరు... భోగాలు, త్యాగాలు మన అంతఃపురాల్లో మామూలే! కానీ, వ్యక్తిగా రాణించటం చాలా కష్టసాధ్యమైన విషయం. అది ఎలా సాధించారు మీరు...?" అని సుమిత్రని వల్లి అనే పాత్ర అడుగుతుంది. "నేను చేసే ప్రతిపని, నా చేతులు, నా స్పందన అన్నీ నా ధర్మంగా అనుకుంటాను..." అంటుంది. సుమిత్ర. ఇక్కడ "నా ధర్మం" అనేదే ముఖ్యమైంది. ఒక మహిళ తాను భార్యగా, కోడలిగా, తోడుకోడలిగా, తల్లిగా, అత్తగా, యజమానురాలిగా తన ధర్మాన్ని తాను నెరవేర్చ గలిగిన వ్యక్తీ సుమిత్ర. - చలసాని వసుమతి© 2017,www.logili.com All Rights Reserved.