"బృందావనానికి ఇద్దరన్నదమ్ములము త్వరలో వస్తాము, అమ్మ మేము మధుర బయలుదేరినపుడు 'ఇప్పటివరకు దాసిలా పెంచాను కృష్ణా' అన్నది. చాలా బాధ కలిగినదని చెప్పు. 'నీ కీర్తికి హద్దులు లేవమ్మా' అని అన్నానని చెప్పు మా అమ్మకు"
"ముఖాముఖి చ్ప్పలేని గోపికలు భ్రమరాన్ని అడ్డుపెట్టుకుని ఉద్ధవునికి నీతి బోధ చేస్తున్నారు. తుమ్మెదా! నీచంగా మధువును గ్రోలుతున్న నీకు ఇది అశాశ్వత శరీరమని మరిచావు! పరమనీచులు, అతి సాధారణ మనిషిలా ప్రవర్తిస్తున్నావు! క్షణంలో వశపరుచుకునే అద్భుత సౌందర్యవంతుడివి! అందుకే ఈ దుర్నీతికి సాహసిస్తున్నావు"
"సర్వాత్మ, సర్వమయుడు, అత్యంత సుందరుడు, ప్రియతముడు, మురళీనాధుడు, రాజీవలోచనుడు, యశోదా తనయుడు అయినా మా కన్నయ్యకే అంకితమయ్యాము మా ప్రజా వనితలందరము! కేకలతో ఉన్న నీ ధ్యాన విధానాలు వద్దు. వద్దంటే వద్దు"
"మధురాతి మధురమైన, మా ప్రాణనాధుడు ఇప్పుడు సింహాసనాధీసుడై, మేము తలపుకు రాగానే సిగ్గుతో నవ్వుకుంటాడు! రాజభవనంలో గోవుల చిత్రాలు వుంటాయట. అప్పుడు పశ్చాత్తాపము కలిగి స్తబ్దుడై మౌనం దాలుస్తాడు మా మురళీధరుడు. ఇలా అన్నామని చెప్పు"
- చలసాని వసుమతి