"భారతదేశం మీద మీరు నిలుప వలసింది మీ తరువాత తరాన్ని అని జ్ఞాపకముంచుకోండి. మీ తరువాత తరానికి ఏమిచ్చి ఆనందం పొందుతారో ఆలోచించుకోండి. మీ భాషను సంస్కరించండి. మీ భాషలో మాట్లాడించండి. అందరినీ కలిపి సమాజాన్ని నడపడానికి ప్రయత్నించండి."
తన జీవితాన్ని, కాలాన్ని, ఆలోచనలను, విజ్ఞానాన్ని, సంపాదనను తన సర్వస్వాన్ని దేశం కోసం, ప్రజల కోసం అర్పించిన త్యాగమూర్తి వావిలాల వారు. తెలుగు భాషా సంస్కృతులకు ప్రతిరూపం.
" వివేకానందుని సర్వమత సామరస్య ప్రభోదంతో, వీరేశలింగంగారి సంస్కరణల స్పూర్తితో, మహాత్మాగాంధీ త్యాగం, నిరాడంబరత సత్య,అహింసలతో, నిర్మాణ కార్యక్రమాలతో, పండిత నెహ్రూ సోషలిజం, పంచశీల ప్రభోదంతో, డాక్టర్ అంబేద్కర్ సర్వజన సమభావనతో యువతీయువతియువకుల్లారా! కదలి ముందజ వేయండి! కార్యోన్ముఖులు కండి."
- వావిలాల గోపాలకృష్ణయ్య
తెలుగు జాతి అభ్యుదయానికి తెలుగు రాష్ట్ర సాధనకు శ్రీ వావిలాల వారి కృషిని, పడిన తపనను, చేసిన పోరాటాలను ఈ తరం వారు తెలుసుకోవలసిన అవసరమెంతైనా ఉంది. శ్రీ వావిలాల చిన్న చిన్న పుస్తకాలు, పుంఖాను పుంఖంగా వ్యాసాలు రచించి వివిధ ఉద్యమాలలో తెలుగు వారిని ప్రభావితం చేసి పాల్గొనేలా చేశారు. వీటిని రచించి రచించి దశాబ్దాలు దాటినా అవి చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలు. తెలుగు జాతికి నాటికి నేటికి కూడా దారి చూపే దీపస్థంబాలు. ఇవి తెలుగు వారి వ్యక్తిత్వ వికాసానికి అవి దోహదపడుతాయి.
"భారతదేశం మీద మీరు నిలుప వలసింది మీ తరువాత తరాన్ని అని జ్ఞాపకముంచుకోండి. మీ తరువాత తరానికి ఏమిచ్చి ఆనందం పొందుతారో ఆలోచించుకోండి. మీ భాషను సంస్కరించండి. మీ భాషలో మాట్లాడించండి. అందరినీ కలిపి సమాజాన్ని నడపడానికి ప్రయత్నించండి." తన జీవితాన్ని, కాలాన్ని, ఆలోచనలను, విజ్ఞానాన్ని, సంపాదనను తన సర్వస్వాన్ని దేశం కోసం, ప్రజల కోసం అర్పించిన త్యాగమూర్తి వావిలాల వారు. తెలుగు భాషా సంస్కృతులకు ప్రతిరూపం. " వివేకానందుని సర్వమత సామరస్య ప్రభోదంతో, వీరేశలింగంగారి సంస్కరణల స్పూర్తితో, మహాత్మాగాంధీ త్యాగం, నిరాడంబరత సత్య,అహింసలతో, నిర్మాణ కార్యక్రమాలతో, పండిత నెహ్రూ సోషలిజం, పంచశీల ప్రభోదంతో, డాక్టర్ అంబేద్కర్ సర్వజన సమభావనతో యువతీయువతియువకుల్లారా! కదలి ముందజ వేయండి! కార్యోన్ముఖులు కండి." - వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగు జాతి అభ్యుదయానికి తెలుగు రాష్ట్ర సాధనకు శ్రీ వావిలాల వారి కృషిని, పడిన తపనను, చేసిన పోరాటాలను ఈ తరం వారు తెలుసుకోవలసిన అవసరమెంతైనా ఉంది. శ్రీ వావిలాల చిన్న చిన్న పుస్తకాలు, పుంఖాను పుంఖంగా వ్యాసాలు రచించి వివిధ ఉద్యమాలలో తెలుగు వారిని ప్రభావితం చేసి పాల్గొనేలా చేశారు. వీటిని రచించి రచించి దశాబ్దాలు దాటినా అవి చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలు. తెలుగు జాతికి నాటికి నేటికి కూడా దారి చూపే దీపస్థంబాలు. ఇవి తెలుగు వారి వ్యక్తిత్వ వికాసానికి అవి దోహదపడుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.