పలవరింత
చినవీరభద్రుడు భావుకుడు. అది అతని జీవలక్షణంగా కన్పిస్తుంది. భావుకుడిలో పట్టరాని ఉద్వేగం ఉంటుంది. ఒంట్లో ఎప్పుడూ జ్వరం ఉన్నట్లుగా ఉంటుంది. ఎదురుగా కనిపించే, జరిగే సంఘటనలు తన జీవితానికి సంబంధించినవైనా మరెవరి జీవితానికి సంబంధించినవైనా మనస్సును ఆక్రమించుకొని వదలవు. వాటికి తను ప్రతిక్రియ చేయగలగవచ్చు, లేకపోవచ్చు; చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇలా జరిగితే బాగుండుననే ఆకాంక్ష పీడిస్తూ ఉంటుంది. ఈ ఉద్వేగ కారణంగానే త్వరగా అభిప్రాయాలేర్పడిపోతాయి. ఎదుటివారి మీదా, తన మీద కూడా గొప్ప అసహనమేర్పడుతుంది. ప్రతిక్రియ చేయలేనప్పుడు ఆ అసహనం దుఃఖంగా పరిణమిస్తుంది.
మనకి గ్రామాలు, నగరాలు ఉన్నాయి. గ్రామ జీవితమూ సంస్కృతి నగరం కంటే భిన్నంగా ఉంటాయి. గ్రామం దాని పరిసరాలూ నైసర్గికంగా ఉంటాయి. మరొకమాటలో చెప్పాలంటే సహజ సుందరాలవి.
ఆ గ్రామాలకు పక్కనే కొండలో, అడవులో, నదులో ఉంటే అవి మరింత రామణీయకతను తెచ్చిపెడతాయి. కుట్రలూ, కుతంత్రాలూ, స్వార్థాలు, ఈర్ష్యాసూయలూ గ్రామీణ జీవితంలో ఉండవా అంటే ఉంటాయి. కాని వాటిని ప్రేమలూ, ఆప్యాయతలూ, అమాయకత్వమూ, మానవ సహజమైన పరోపకారమూ, ఎదుటి వాడి దుఃఖం పట్ల సానుభూతి మాత్రమే కాక అందులో పాలు పంచుకోవడమూ, తన శక్తికి మించి సహాయపడడమూ వంటి లక్షణాలు కప్పివేస్తాయి.
నగరంలో ఇదంతా కనిపించదు, కనిపించినా మనల్ని కదిలించదు. మనం నివసిస్తున్న ప్రపంచాలు రెండు. ఒకటి ప్రకృతికి దగ్గరగా ఉండే గ్రామ జీవనం. మరొకటి
పలవరింత చినవీరభద్రుడు భావుకుడు. అది అతని జీవలక్షణంగా కన్పిస్తుంది. భావుకుడిలో పట్టరాని ఉద్వేగం ఉంటుంది. ఒంట్లో ఎప్పుడూ జ్వరం ఉన్నట్లుగా ఉంటుంది. ఎదురుగా కనిపించే, జరిగే సంఘటనలు తన జీవితానికి సంబంధించినవైనా మరెవరి జీవితానికి సంబంధించినవైనా మనస్సును ఆక్రమించుకొని వదలవు. వాటికి తను ప్రతిక్రియ చేయగలగవచ్చు, లేకపోవచ్చు; చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇలా జరిగితే బాగుండుననే ఆకాంక్ష పీడిస్తూ ఉంటుంది. ఈ ఉద్వేగ కారణంగానే త్వరగా అభిప్రాయాలేర్పడిపోతాయి. ఎదుటివారి మీదా, తన మీద కూడా గొప్ప అసహనమేర్పడుతుంది. ప్రతిక్రియ చేయలేనప్పుడు ఆ అసహనం దుఃఖంగా పరిణమిస్తుంది. మనకి గ్రామాలు, నగరాలు ఉన్నాయి. గ్రామ జీవితమూ సంస్కృతి నగరం కంటే భిన్నంగా ఉంటాయి. గ్రామం దాని పరిసరాలూ నైసర్గికంగా ఉంటాయి. మరొకమాటలో చెప్పాలంటే సహజ సుందరాలవి. ఆ గ్రామాలకు పక్కనే కొండలో, అడవులో, నదులో ఉంటే అవి మరింత రామణీయకతను తెచ్చిపెడతాయి. కుట్రలూ, కుతంత్రాలూ, స్వార్థాలు, ఈర్ష్యాసూయలూ గ్రామీణ జీవితంలో ఉండవా అంటే ఉంటాయి. కాని వాటిని ప్రేమలూ, ఆప్యాయతలూ, అమాయకత్వమూ, మానవ సహజమైన పరోపకారమూ, ఎదుటి వాడి దుఃఖం పట్ల సానుభూతి మాత్రమే కాక అందులో పాలు పంచుకోవడమూ, తన శక్తికి మించి సహాయపడడమూ వంటి లక్షణాలు కప్పివేస్తాయి. నగరంలో ఇదంతా కనిపించదు, కనిపించినా మనల్ని కదిలించదు. మనం నివసిస్తున్న ప్రపంచాలు రెండు. ఒకటి ప్రకృతికి దగ్గరగా ఉండే గ్రామ జీవనం. మరొకటి© 2017,www.logili.com All Rights Reserved.