మానవ విజ్ఞానం బహుముఖంగా అనంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విజ్ఞాన విస్తరణకు వాహిక భాష, ఎంత సాంకేతిక అభివృద్ధి జరిగినా, ఎన్ని యంత్రాలు వచ్చినా భాష ఉపయోగం పెరిగేదే కానీ తరిగేది కాదు. భాషాభివృద్దికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. భాష దినదిన ప్రవర్ధమానం. భాష స్వభావం గురించి భాష నిర్మాణం గురించి ఎంతో పరిశోధన జరిగింది. ప్రపంచంలో అనేక భాషలకు వ్యాకరణాలు వచ్చాయి. ఈ భాషకైన సమగ్రమైన నిర్దుష్టమైన వ్యాకరణ రచన ఒక ఆదర్శమే.
భాష కాల పరిణామంలో పొందిన అభివృద్దిని మార్పులను విశ్లేషిస్తూ నిరంతరంగా వ్యాకరణ రచన కూడా కొనసాగుతూ ఉండాలి. వ్యాకరణం కంటే కూడా క్షణక్షణ పరిణామాలకు లోనయ్యేది నిఘంటువు. మన విజ్ఞానం పెరిగే కొద్ది నిఘంటువులో కొత్త మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి. మన భాషలో ఉన్న పదజాలంతోనే చిరుమార్పులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. ప్రతి భాషలోను పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది.
మన భాషకు ఏడెనిమిది వందల సంవత్సరాల నుండి లిఖిత వ్యకరణాలున్నాయి. గత శతాబ్దం వరకు కంఠస్తం చేయడానికి అనుగుణంగా పద్యాలలో వ్యాకరణాలను రచిస్తే గత శతాబ్దం నుండి వచనంలో సూత్రం వ్యాకరణాల రచన ప్రారంభం అయింది. అయితే ఈ వ్యాకరణాలలో ఎక్కువ భాగం మన కావ్య భాషను వర్ణించేవి. వాడుక భాషను వర్ణించేవి కావు. మన భాష, దాని విశిష్టత గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-డి.చంద్రశేఖర రెడ్డి.
మానవ విజ్ఞానం బహుముఖంగా అనంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విజ్ఞాన విస్తరణకు వాహిక భాష, ఎంత సాంకేతిక అభివృద్ధి జరిగినా, ఎన్ని యంత్రాలు వచ్చినా భాష ఉపయోగం పెరిగేదే కానీ తరిగేది కాదు. భాషాభివృద్దికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. భాష దినదిన ప్రవర్ధమానం. భాష స్వభావం గురించి భాష నిర్మాణం గురించి ఎంతో పరిశోధన జరిగింది. ప్రపంచంలో అనేక భాషలకు వ్యాకరణాలు వచ్చాయి. ఈ భాషకైన సమగ్రమైన నిర్దుష్టమైన వ్యాకరణ రచన ఒక ఆదర్శమే. భాష కాల పరిణామంలో పొందిన అభివృద్దిని మార్పులను విశ్లేషిస్తూ నిరంతరంగా వ్యాకరణ రచన కూడా కొనసాగుతూ ఉండాలి. వ్యాకరణం కంటే కూడా క్షణక్షణ పరిణామాలకు లోనయ్యేది నిఘంటువు. మన విజ్ఞానం పెరిగే కొద్ది నిఘంటువులో కొత్త మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి. మన భాషలో ఉన్న పదజాలంతోనే చిరుమార్పులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. ప్రతి భాషలోను పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది. మన భాషకు ఏడెనిమిది వందల సంవత్సరాల నుండి లిఖిత వ్యకరణాలున్నాయి. గత శతాబ్దం వరకు కంఠస్తం చేయడానికి అనుగుణంగా పద్యాలలో వ్యాకరణాలను రచిస్తే గత శతాబ్దం నుండి వచనంలో సూత్రం వ్యాకరణాల రచన ప్రారంభం అయింది. అయితే ఈ వ్యాకరణాలలో ఎక్కువ భాగం మన కావ్య భాషను వర్ణించేవి. వాడుక భాషను వర్ణించేవి కావు. మన భాష, దాని విశిష్టత గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -డి.చంద్రశేఖర రెడ్డి.© 2017,www.logili.com All Rights Reserved.