ఇందులో ఓ 20 కథలు ఈ మధ్యలో రాసినవి, మూడు నాల్గు 70,75 ప్రాంతంలో రాసినవి. ఈ పాత కథలు ఇదివరకు సంపుటాలలో రానివి, వచ్చిన కాపీలు లేనివి కాబట్టి దీన్లో చేర్చాను.
అందులో 'చదరంగం' అనే కథ చదివితే 40 ఏళ్ల క్రితం రాజీకీయాలకి, ఇప్పటికి ఏ మాత్రం మార్పు రాలేదని, ఆ కుశ్చిత రాజకీయాలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తులు -పదవి కోసం ఎంతకన్నా దిగజారే అవకాశవాదులు ఈనాడు ఇంకా ఎక్కువయ్యారే తప్ప తగ్గలేదు.
అలాగే 'కుక్కబతుకు' అన్న కథలో ఏ విషయంలోనూ పెద్ద చేపలు ఎప్పుడు దొరకవు-బలయ్యేది చిన్న చేపలే. డబ్బు అన్నది మానవత్వాన్ని, అన్యాయాన్ని సహిస్తూ ఎలా పడి ఉంటుందో నిత్యం అన్ని అవినీతి కార్యక్రమాల్లో చూస్తూనే ఉన్నాము.
అలాగే దీనిలో 'గట్టు తెగింది' కథ నలభై ఏళ్ల నుంచి రెండు ప్రాంతాల మధ్య విభేదాలు, విద్వేషాలు రావణ కాష్టంలా రగులుతూనే ఉందనడానికి సాక్ష్యం.
ఏది ఏమైనా, ఇందులోని ఈ కొత్త కథలు ఈనాటి సామజిక స్థితిగతులకు ప్రతిబింబాలయితే, పాత కథలు గడిచిన చరిత్రకు సాక్ష్యాలు.
-డి.కామేశ్వరి.
ఇందులో ఓ 20 కథలు ఈ మధ్యలో రాసినవి, మూడు నాల్గు 70,75 ప్రాంతంలో రాసినవి. ఈ పాత కథలు ఇదివరకు సంపుటాలలో రానివి, వచ్చిన కాపీలు లేనివి కాబట్టి దీన్లో చేర్చాను. అందులో 'చదరంగం' అనే కథ చదివితే 40 ఏళ్ల క్రితం రాజీకీయాలకి, ఇప్పటికి ఏ మాత్రం మార్పు రాలేదని, ఆ కుశ్చిత రాజకీయాలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తులు -పదవి కోసం ఎంతకన్నా దిగజారే అవకాశవాదులు ఈనాడు ఇంకా ఎక్కువయ్యారే తప్ప తగ్గలేదు. అలాగే 'కుక్కబతుకు' అన్న కథలో ఏ విషయంలోనూ పెద్ద చేపలు ఎప్పుడు దొరకవు-బలయ్యేది చిన్న చేపలే. డబ్బు అన్నది మానవత్వాన్ని, అన్యాయాన్ని సహిస్తూ ఎలా పడి ఉంటుందో నిత్యం అన్ని అవినీతి కార్యక్రమాల్లో చూస్తూనే ఉన్నాము. అలాగే దీనిలో 'గట్టు తెగింది' కథ నలభై ఏళ్ల నుంచి రెండు ప్రాంతాల మధ్య విభేదాలు, విద్వేషాలు రావణ కాష్టంలా రగులుతూనే ఉందనడానికి సాక్ష్యం. ఏది ఏమైనా, ఇందులోని ఈ కొత్త కథలు ఈనాటి సామజిక స్థితిగతులకు ప్రతిబింబాలయితే, పాత కథలు గడిచిన చరిత్రకు సాక్ష్యాలు. -డి.కామేశ్వరి.© 2017,www.logili.com All Rights Reserved.