దృక్పధం ఒక సదవకాశం
సవ్యమైన మనోదృక్పధం కలవ్యక్తికి
లక్ష్యసాధనలో ఏ శక్తీ అడ్డుపడలేదు.
అపసవ్యమైన ఆలోచనా ధోరణితో ఉన్న వ్యక్తికి
ఈ భూమ్మీద ఏ శక్తీ సాయపడలేదు.
.... ధామస్ జెఫర్సన్
"నేను 1985లో ఒకరోజు నా గదిలో ఒక చీకటిమూలన ప్రతికూలతలో, నిరాశ లో కూరుకుపోయి ఒంటరిగా కూర్చుని ఉన్నాను. న్యాయవాదిగా నా వృత్తిలో నేను పూర్తిగా అలసిపోయాను. నా చుట్టూ ఆవరించిన నిసృహను జయించడానికి నాకు ఒక్క అవకాశము కనిపించలేదు. నాకు ఏ లక్ష్యాలు లేవు... ఏ కలలు లేవు.... నిస్సత్తువ ఆవరించింది. అప్పుడు నేను నా జీవితాన్ని ఆసాంతం మార్చివేసే ఒక అద్బుతాన్ని కనుగొన్నాను'
సానుకూల దృక్పధం ఎంత శక్తిమంతమైందో నేను కనుగొన్నాను.
ఎప్పుడైతే నేను నా దృక్పధాన్ని సానుకూలంగా మార్చుకున్నానో, నా కళ్ళముందు ఒక కొత్త ప్రపంచం సాక్షాత్కరించింది. అది నాలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. దాంతో నేను వ్యక్తిత్వ వికాస సూత్రాల్ని లోతుగా అద్యయనం చేయడం ప్రారంబించాను. నా జీవితాన్ని ఆములాగ్రం మార్చివేసిన విజయ రహస్యాల్ని ఇతరులతో కలసి పంచుకునే బృహత్తర స్వప్నాల గురించి కలలు కనడం మొదలు పెట్టాను. నా కలను సాకారం చేసుకోవాలని 1992 లో నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, వ్యక్తగా, రచయితగా ఎదిగేందుకు నేను నా న్యాయవాద వృత్తికి తిలోదకాలిచ్చాను.
జీవితాన్ని మార్చుకునేందుకు, సంతృప్తిని, విజయాన్ని సాధించే దిశగా మరింత ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు మీలో కూడా చాలినంత శక్తీ, ప్రతిభా దాగి ఉన్నాయి. మీది సానుకూల దృక్పదమో, లేదా ప్రతికూల దృక్పదమో లేదా ఈ రెంటికి మధ్యన ఊగిసలాడుతున్న మరో మనోవైఖరో కావచ్చు. కానీ మీ జీవితం మీద మీకే పూర్తి నియంత్రణను ఇచ్చి, మీలోని విశేష ప్రతిభను వెలికి తేవడంలో ఈ పుస్తకం మీకు మార్గదర్శిగా నిలుస్తుంది.
ఈ పుస్తకంలో పేర్కొన్న 12 పాఠ్యాంశాల్ని మీరు అభ్యసించి, ఆచరణలో పెట్టినట్లయింటే, మీరిక కొత్త విజయాల్ని చేజిక్కించుకుంటారు....మీలోని ప్రత్యేక ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు మీరు నడుంబిగిస్తారు.... ఇక మీరు అత్యద్బుతమైన ఫలితాల్ని చవిచూస్తారు.
మీ మనో దృక్పధాన్ని ఎలా మార్చుకోవాలో, తద్వారా మీ జీవితానికి ఎలా మెరుగులు దిద్దుకోవాలో ఈ పుస్తకం మీకు నేర్పుతుంది."
దృక్పధం ఒక సదవకాశం సవ్యమైన మనోదృక్పధం కలవ్యక్తికి లక్ష్యసాధనలో ఏ శక్తీ అడ్డుపడలేదు. అపసవ్యమైన ఆలోచనా ధోరణితో ఉన్న వ్యక్తికి ఈ భూమ్మీద ఏ శక్తీ సాయపడలేదు. .... ధామస్ జెఫర్సన్ "నేను 1985లో ఒకరోజు నా గదిలో ఒక చీకటిమూలన ప్రతికూలతలో, నిరాశ లో కూరుకుపోయి ఒంటరిగా కూర్చుని ఉన్నాను. న్యాయవాదిగా నా వృత్తిలో నేను పూర్తిగా అలసిపోయాను. నా చుట్టూ ఆవరించిన నిసృహను జయించడానికి నాకు ఒక్క అవకాశము కనిపించలేదు. నాకు ఏ లక్ష్యాలు లేవు... ఏ కలలు లేవు.... నిస్సత్తువ ఆవరించింది. అప్పుడు నేను నా జీవితాన్ని ఆసాంతం మార్చివేసే ఒక అద్బుతాన్ని కనుగొన్నాను' సానుకూల దృక్పధం ఎంత శక్తిమంతమైందో నేను కనుగొన్నాను. ఎప్పుడైతే నేను నా దృక్పధాన్ని సానుకూలంగా మార్చుకున్నానో, నా కళ్ళముందు ఒక కొత్త ప్రపంచం సాక్షాత్కరించింది. అది నాలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. దాంతో నేను వ్యక్తిత్వ వికాస సూత్రాల్ని లోతుగా అద్యయనం చేయడం ప్రారంబించాను. నా జీవితాన్ని ఆములాగ్రం మార్చివేసిన విజయ రహస్యాల్ని ఇతరులతో కలసి పంచుకునే బృహత్తర స్వప్నాల గురించి కలలు కనడం మొదలు పెట్టాను. నా కలను సాకారం చేసుకోవాలని 1992 లో నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, వ్యక్తగా, రచయితగా ఎదిగేందుకు నేను నా న్యాయవాద వృత్తికి తిలోదకాలిచ్చాను. జీవితాన్ని మార్చుకునేందుకు, సంతృప్తిని, విజయాన్ని సాధించే దిశగా మరింత ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు మీలో కూడా చాలినంత శక్తీ, ప్రతిభా దాగి ఉన్నాయి. మీది సానుకూల దృక్పదమో, లేదా ప్రతికూల దృక్పదమో లేదా ఈ రెంటికి మధ్యన ఊగిసలాడుతున్న మరో మనోవైఖరో కావచ్చు. కానీ మీ జీవితం మీద మీకే పూర్తి నియంత్రణను ఇచ్చి, మీలోని విశేష ప్రతిభను వెలికి తేవడంలో ఈ పుస్తకం మీకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న 12 పాఠ్యాంశాల్ని మీరు అభ్యసించి, ఆచరణలో పెట్టినట్లయింటే, మీరిక కొత్త విజయాల్ని చేజిక్కించుకుంటారు....మీలోని ప్రత్యేక ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు మీరు నడుంబిగిస్తారు.... ఇక మీరు అత్యద్బుతమైన ఫలితాల్ని చవిచూస్తారు. మీ మనో దృక్పధాన్ని ఎలా మార్చుకోవాలో, తద్వారా మీ జీవితానికి ఎలా మెరుగులు దిద్దుకోవాలో ఈ పుస్తకం మీకు నేర్పుతుంది."
© 2017,www.logili.com All Rights Reserved.