హైదరాబాద్ సాంస్కృతిక చిహ్నంగా 'చార్మినార్' నిలబడితే కథకుడు నెల్లూరి కేశవస్వామి కథల సంపుటి 'చార్మినార్' కూడా అలాగే నిలబడింది ఇందులో హైదరాబాద్ తెలుగు భాష ఒక మినార్, సంస్కృతి ఒక మినార్, రాజకీయ నేపథ్యమొక మినార్ అయితే సామాజికాంశాలు మరో మినార్. ఈ విధంగా నాలుగు మినార్లతో కూడిన నెల్లూరి కేశవ స్వామి కథా సర్వస్వం.
చార్మినార్- ఒక గొప్ప ఫ్యూడల్ రాచరికపు చిహ్నంగా తలెత్తుకు నిలబడింది. నిజమే కానీ కేశవస్వామి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా శ్లాఘించలేదు. అ వ్యవస్థలోని అవలక్షణాల్నిఈసడిస్తూనే మనుషులుగా హిందూ ముస్లింల స్నేహాన్ని ఆకాంక్షించారు. మానవీయ విలువలకు ప్రాణం పోశారు. ఓ చారిత్రక నేపథ్యాన్ని, ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని తన కథల్లో నిక్షిప్తం చేస్తూనే ఒక మహా రచయిత ఎదగాల్సిన స్థాయికి ఎదిగారు నెల్లూరి కేశవస్వామి. ఈ గ్రంథంలోని కథలను చదివితే ఆయన కథా కథన వైభవం పాఠకుడి మనసులో జీవితాంతం నిలిచిపోతుంది.
-దేవరాజు మహారాజు.
హైదరాబాద్ సాంస్కృతిక చిహ్నంగా 'చార్మినార్' నిలబడితే కథకుడు నెల్లూరి కేశవస్వామి కథల సంపుటి 'చార్మినార్' కూడా అలాగే నిలబడింది ఇందులో హైదరాబాద్ తెలుగు భాష ఒక మినార్, సంస్కృతి ఒక మినార్, రాజకీయ నేపథ్యమొక మినార్ అయితే సామాజికాంశాలు మరో మినార్. ఈ విధంగా నాలుగు మినార్లతో కూడిన నెల్లూరి కేశవ స్వామి కథా సర్వస్వం. చార్మినార్- ఒక గొప్ప ఫ్యూడల్ రాచరికపు చిహ్నంగా తలెత్తుకు నిలబడింది. నిజమే కానీ కేశవస్వామి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా శ్లాఘించలేదు. అ వ్యవస్థలోని అవలక్షణాల్నిఈసడిస్తూనే మనుషులుగా హిందూ ముస్లింల స్నేహాన్ని ఆకాంక్షించారు. మానవీయ విలువలకు ప్రాణం పోశారు. ఓ చారిత్రక నేపథ్యాన్ని, ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని తన కథల్లో నిక్షిప్తం చేస్తూనే ఒక మహా రచయిత ఎదగాల్సిన స్థాయికి ఎదిగారు నెల్లూరి కేశవస్వామి. ఈ గ్రంథంలోని కథలను చదివితే ఆయన కథా కథన వైభవం పాఠకుడి మనసులో జీవితాంతం నిలిచిపోతుంది. -దేవరాజు మహారాజు.
© 2017,www.logili.com All Rights Reserved.