వేదసారం నింపుకున్న వేదభూమి మన భారతభూమి. దైవం మానవరూపంలో నడయాడిన దివ్య భూమి. మానవులకు మార్గదర్శకత్వం చేసే దైవలీలలను తెలిపే పురాణాలు పుట్టిన పవిత్ర పుణ్యభూమి. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు మంచు కొండల్లో, సాగర తీరాల్లో, దట్టమైన అరణ్యాల్లో, ఎతైన పర్వతాల మీద ఇలా ఎక్కడైతే వేద రూపుడైన దైవం తాలూకు పాదముద్రలు పడిందని పురాణాలు పేర్కొన్న ప్రతిచోటా ఆ విషయాన్ని నమ్మిన అనేక రాజవంశాలకు చెందిన రాజులు, పాలకులు ఈ భారతావనియందు పవిత్ర ఆలయాలను నిర్మించారు. ఈ పవిత్ర వేదభూమిలో 36 లక్షల దేవాలయాలు ఉన్నట్లు పూర్వీకుల మాట. అందులో కనుమరుగై పోయినవి పోగా మిగిలిన కొన్ని అయినా ఈనాడు మనము చూడగలుగుచున్నాము. మానవ జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చూడవల్సిన పుణ్యక్షేత్రాలు, తీర్ధాలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి వున్నాయి. అటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించదలచుకున్న వారికి "భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు" అనే ఈ గ్రంథం ఎంతో ఉపయోగం. ఈ గ్రంథం తమ వద్ద ఉంటే! భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు, తీర్ధాలు, క్షేత్రాలు అన్ని మీ ఇంట్లోనే ఉన్నట్లు భావించవచ్చు.
ఈ గ్రంథం మీకు ఆధ్యాత్మిక ఆలయాలు, పవిత్ర క్షేత్రాల దర్శినిగా అనుకూలిస్తుంది. ఇందులో త్రిలింగములు, శక్తిత్రయం, అంబాత్రయం, అక్షిత్రయం, చార్ ధామ్, పంచకాశీపురములు, పంచగయా క్షేత్రములు, పంచద్వారకలు, పంచారామాలు, పంచపురములు, పంచభూతలింగములు, సప్తమోక్షపురములు, అష్టగణపతులు, నవనారసింహులు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పిఠాలు, 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు, తీర్ధాలు, క్షేత్రాలు, పవిత్రస్థలాలు, పుష్కరిణిలు, ఆలయాల విశిష్టతలు, క్షేత్రాల ప్రత్యేకతలు, పూజా విధానాలు, అభిషేక పద్ధతులు, ప్రసాద విశేషాలు, విచిత్ర ఆచారాలు, విచిత్ర విషయాలు, ఉత్సవాల ప్రత్యేకతలు ఇలా మరెన్నో ప్రాధాన్యతలు ఈ గ్రంధంలో ఉన్నాయి. భారతదేశం నందలి అతి పవిత్ర పుణ్యక్షేత్రములు పూర్తి వివరాలతో, ఆ క్షేత్రము, యొక్క తీర్ధము, స్థలము, పుష్కరిణి, స్వామివార్ల విశిష్టత మొదలగు అనేక విషయాలు ఈ గ్రంధంలో పొందుపరిచారు. ఈ పుణ్యక్షేత్రాల గ్రంథం మీ వద్ద ఉంటే ముక్కోటి దేవతలూ, వారి వారి క్షేత్రాలు, తీర్ధాలు, పవిత్ర స్థలాలు, నదులు, మొత్తం మీ ఇంట్లో ఉన్నట్టే! ఇక మీ ఇల్లే ఒక పవిత్ర దేవాలయం అవుతుంది. భారత, భాగవత, రామాయణ, భగవద్గీత గ్రంధాల వలెనే ఈ తీర్ధయాత్రా దర్శన గ్రంథంను కూడా మీ ఇంట్లో భద్రపరచుకుంటారని ఆశిస్తున్నాం.
- గాజుల సత్యనారాయణ
వేదసారం నింపుకున్న వేదభూమి మన భారతభూమి. దైవం మానవరూపంలో నడయాడిన దివ్య భూమి. మానవులకు మార్గదర్శకత్వం చేసే దైవలీలలను తెలిపే పురాణాలు పుట్టిన పవిత్ర పుణ్యభూమి. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు మంచు కొండల్లో, సాగర తీరాల్లో, దట్టమైన అరణ్యాల్లో, ఎతైన పర్వతాల మీద ఇలా ఎక్కడైతే వేద రూపుడైన దైవం తాలూకు పాదముద్రలు పడిందని పురాణాలు పేర్కొన్న ప్రతిచోటా ఆ విషయాన్ని నమ్మిన అనేక రాజవంశాలకు చెందిన రాజులు, పాలకులు ఈ భారతావనియందు పవిత్ర ఆలయాలను నిర్మించారు. ఈ పవిత్ర వేదభూమిలో 36 లక్షల దేవాలయాలు ఉన్నట్లు పూర్వీకుల మాట. అందులో కనుమరుగై పోయినవి పోగా మిగిలిన కొన్ని అయినా ఈనాడు మనము చూడగలుగుచున్నాము. మానవ జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చూడవల్సిన పుణ్యక్షేత్రాలు, తీర్ధాలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి వున్నాయి. అటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించదలచుకున్న వారికి "భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు" అనే ఈ గ్రంథం ఎంతో ఉపయోగం. ఈ గ్రంథం తమ వద్ద ఉంటే! భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు, తీర్ధాలు, క్షేత్రాలు అన్ని మీ ఇంట్లోనే ఉన్నట్లు భావించవచ్చు. ఈ గ్రంథం మీకు ఆధ్యాత్మిక ఆలయాలు, పవిత్ర క్షేత్రాల దర్శినిగా అనుకూలిస్తుంది. ఇందులో త్రిలింగములు, శక్తిత్రయం, అంబాత్రయం, అక్షిత్రయం, చార్ ధామ్, పంచకాశీపురములు, పంచగయా క్షేత్రములు, పంచద్వారకలు, పంచారామాలు, పంచపురములు, పంచభూతలింగములు, సప్తమోక్షపురములు, అష్టగణపతులు, నవనారసింహులు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పిఠాలు, 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు, తీర్ధాలు, క్షేత్రాలు, పవిత్రస్థలాలు, పుష్కరిణిలు, ఆలయాల విశిష్టతలు, క్షేత్రాల ప్రత్యేకతలు, పూజా విధానాలు, అభిషేక పద్ధతులు, ప్రసాద విశేషాలు, విచిత్ర ఆచారాలు, విచిత్ర విషయాలు, ఉత్సవాల ప్రత్యేకతలు ఇలా మరెన్నో ప్రాధాన్యతలు ఈ గ్రంధంలో ఉన్నాయి. భారతదేశం నందలి అతి పవిత్ర పుణ్యక్షేత్రములు పూర్తి వివరాలతో, ఆ క్షేత్రము, యొక్క తీర్ధము, స్థలము, పుష్కరిణి, స్వామివార్ల విశిష్టత మొదలగు అనేక విషయాలు ఈ గ్రంధంలో పొందుపరిచారు. ఈ పుణ్యక్షేత్రాల గ్రంథం మీ వద్ద ఉంటే ముక్కోటి దేవతలూ, వారి వారి క్షేత్రాలు, తీర్ధాలు, పవిత్ర స్థలాలు, నదులు, మొత్తం మీ ఇంట్లో ఉన్నట్టే! ఇక మీ ఇల్లే ఒక పవిత్ర దేవాలయం అవుతుంది. భారత, భాగవత, రామాయణ, భగవద్గీత గ్రంధాల వలెనే ఈ తీర్ధయాత్రా దర్శన గ్రంథంను కూడా మీ ఇంట్లో భద్రపరచుకుంటారని ఆశిస్తున్నాం. - గాజుల సత్యనారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.