గలివర్ చేసిన యాత్రలు నాలుగు. నాలుగూ నాలుగు రకాలు. గలివర్ ఒక పాత్ర మాత్రమే. రచయిత జోనాధన్ స్విఫ్ట్ ఆత్మ కధ కాదిది. గలివర్ మొదటి లిల్లీ పుట్ల దేశానికీ వెళతాడు. లిల్లీ పుట్ల ఐదారు అంగుళాల మనుషులు. కాని వారు ఒకరిపై ఒకరు కుట్రలు కుహకాలు పన్నుతూ ఉంటారు. మానసికంగా అక్కడ గలివర్ హింస అనుభవిస్తాడు.
తర్వాత అతడు మహాకాయుల దేశానికీ వెళతాడు. అక్కడ శారీరకంగా నరకం అనుభవిస్తాడు. అక్కడి రాజుతో తన దేశ పరిస్థితుల గురించి గలివర్ వర్ణిస్తాడు. ఇంగ్లండుని అపహాస్యం చేయడానికి ఆ సన్నివేశాన్ని స్విఫ్ట్ ఎంచుకున్నట్లు అనిపిస్తుంది. మూడో దేశం మేధావులది. అక్కడ మేధ ఉంది. నీతి లేదు. జ్ఞానం ఉంది. ఇంగితం లేదు.
నాలుగో దేశం గుర్రాలది. అక్కడ గుర్రాలు మయమర్మాలు లేని జీవితాలు గడుపుతాయి. వాటికీ నీతి నియమలుంటాయి. మానవ ప్రకృతిపైన ఎక్కుపెట్టిన వ్యంగ్య బాణం 'గలివర్ యాత్రలు'.
ఆబాలగోపాలం ఆనందించగలిగే క్లాసిక్ ఈ పుస్తకం.
© 2017,www.logili.com All Rights Reserved.