గాంధీజీ హత్యానంతరం సరిగ్గా ఆరువారాలకి సేవాగ్రాం ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు సమావేశమయ్యారు. రిక్తహృదయాలతో, సంక్షుభిత మనస్సులతో వాళ్లు పదేపదే మననం చేసిన మాట ఒక్కటే : ‘మనని సందేహాలు చుట్టుముట్టినప్పుడల్లా బాపూ వైపు చూసేవాళ్లం. ఇప్పుడాయన వెళ్లిపోయాడు. ఇప్పుడెవరికేసి చూడాలి? మనమేం చేయాలి?’ ఈ అంతర్మథనం ఐదురోజులపాటు సాగింది చాలా సూటిగా, అత్యంత ఆత్మవిమర్శనాత్మకంగా.
సమావేశంలో పాల్గొన్న రాజకీయ, రాజకీయేతర వారసులంతాకూడా తమతమ క్షేత్రాల్లో నిస్సందేహంగా సుప్రతిష్ఠులు. వారు వివిధ రకాల ప్రత్యామ్నాయాలు చర్చించారు. ఒక భావం, దానికి ఎదురుగా మరొక భావం, ఒక వాదన, దానికి జవాబుగా ప్రతివాదన, ఇలా నడిచింది సంభాషణ.
ఆ సంభాషణా సారాంశమే ఈ సంపుటం. ఈ భూమ్మీద మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధి ప్రారంభించిన ఉద్యమం మూడు బుల్లెట్లతో ఆగిపోయేదికాదని నమ్మేవాళ్లందరికీ దీన్ని అంకితం చేస్తున్నాం. చంద్రుడులేని రాత్రులే కావచ్చుకాక, మేఘాలు తారల్ని క్షణంపాటు కప్పేయవచ్చుకాక, కానీ ఈ ప్రయాణం కొనసాగ వలసిందే.
గాంధీజీ హత్యానంతరం సరిగ్గా ఆరువారాలకి సేవాగ్రాం ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు సమావేశమయ్యారు. రిక్తహృదయాలతో, సంక్షుభిత మనస్సులతో వాళ్లు పదేపదే మననం చేసిన మాట ఒక్కటే : ‘మనని సందేహాలు చుట్టుముట్టినప్పుడల్లా బాపూ వైపు చూసేవాళ్లం. ఇప్పుడాయన వెళ్లిపోయాడు. ఇప్పుడెవరికేసి చూడాలి? మనమేం చేయాలి?’ ఈ అంతర్మథనం ఐదురోజులపాటు సాగింది చాలా సూటిగా, అత్యంత ఆత్మవిమర్శనాత్మకంగా. సమావేశంలో పాల్గొన్న రాజకీయ, రాజకీయేతర వారసులంతాకూడా తమతమ క్షేత్రాల్లో నిస్సందేహంగా సుప్రతిష్ఠులు. వారు వివిధ రకాల ప్రత్యామ్నాయాలు చర్చించారు. ఒక భావం, దానికి ఎదురుగా మరొక భావం, ఒక వాదన, దానికి జవాబుగా ప్రతివాదన, ఇలా నడిచింది సంభాషణ. ఆ సంభాషణా సారాంశమే ఈ సంపుటం. ఈ భూమ్మీద మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధి ప్రారంభించిన ఉద్యమం మూడు బుల్లెట్లతో ఆగిపోయేదికాదని నమ్మేవాళ్లందరికీ దీన్ని అంకితం చేస్తున్నాం. చంద్రుడులేని రాత్రులే కావచ్చుకాక, మేఘాలు తారల్ని క్షణంపాటు కప్పేయవచ్చుకాక, కానీ ఈ ప్రయాణం కొనసాగ వలసిందే.© 2017,www.logili.com All Rights Reserved.