సినిమా నా ప్రాణం – సినిమా నా ఊపిరి అని చాలా మంది అనడం నేను విన్నాను. కానీ అలా అనకపోయినా నిజంగా సినిమాని నిజాయితీగా ప్రేమించే వ్యక్తులతో ‘లక్ష్మణరేఖ’ ఎన్ గోపాలకృష్ణ గారు ప్రథమ వరుసలో ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకు ఎంతసేపు సినిమా పరిశ్రమలో వచ్చే మార్పులను – చేర్పులను పదిమందికి తెలియపరచాలనే తపన చేత ఈ పుస్తకం రాసి ఉంటారు.
ఆ నేపథ్యంలోనే గతంలో ఆయన సినీ పరిశ్రమ మీద చాలా వ్యాసాలూ, పుస్తకాలు వ్రాయడం జరిగింది. అలాగే దేశ దేశాల్లో సినిమా పరిశ్రమ అంతా ఒక వసుధైక కుటుంబం అని చాటి చెప్పడం కోసం మూడు రంగుల జెండాను ‘గ్లోబల్ ఫిలిం ఫ్రెటర్నిటీ’ అనే పేరున రూపొంచించారు. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆ జెండాకు మంచి ప్రశంసలు లభించాయి. భూపాల్, అఖిల భారత భాషా సాహిత్య సమ్మోళనం వారు భారత్ భాషా భూషణ్ డాక్టరేట్ ఇచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ దానికి సరియైన గుర్తింపు తీసుకువచ్చి, దేశ దేశాల్లో ఆ జెండాను ఆచరణలోకి తీసుకువచ్చిన రోజు సంతోషించేవారిలో నేనోకర్ని – భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనతో ‘భారతీయ సినిమా – మహనీయులు’ పుస్తకం వ్రాయించింది ఆయనలోని సినీ పిపాస.
సినిమా నా ప్రాణం – సినిమా నా ఊపిరి అని చాలా మంది అనడం నేను విన్నాను. కానీ అలా అనకపోయినా నిజంగా సినిమాని నిజాయితీగా ప్రేమించే వ్యక్తులతో ‘లక్ష్మణరేఖ’ ఎన్ గోపాలకృష్ణ గారు ప్రథమ వరుసలో ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకు ఎంతసేపు సినిమా పరిశ్రమలో వచ్చే మార్పులను – చేర్పులను పదిమందికి తెలియపరచాలనే తపన చేత ఈ పుస్తకం రాసి ఉంటారు. ఆ నేపథ్యంలోనే గతంలో ఆయన సినీ పరిశ్రమ మీద చాలా వ్యాసాలూ, పుస్తకాలు వ్రాయడం జరిగింది. అలాగే దేశ దేశాల్లో సినిమా పరిశ్రమ అంతా ఒక వసుధైక కుటుంబం అని చాటి చెప్పడం కోసం మూడు రంగుల జెండాను ‘గ్లోబల్ ఫిలిం ఫ్రెటర్నిటీ’ అనే పేరున రూపొంచించారు. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆ జెండాకు మంచి ప్రశంసలు లభించాయి. భూపాల్, అఖిల భారత భాషా సాహిత్య సమ్మోళనం వారు భారత్ భాషా భూషణ్ డాక్టరేట్ ఇచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ దానికి సరియైన గుర్తింపు తీసుకువచ్చి, దేశ దేశాల్లో ఆ జెండాను ఆచరణలోకి తీసుకువచ్చిన రోజు సంతోషించేవారిలో నేనోకర్ని – భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనతో ‘భారతీయ సినిమా – మహనీయులు’ పుస్తకం వ్రాయించింది ఆయనలోని సినీ పిపాస.© 2017,www.logili.com All Rights Reserved.