కళ్ళులేని గురువింద తీగేకి
పట్టుకొమ్మ దొరికేందుకు
కస్తూరి పూలపరిమళం తోవచూపిందా?
తన పూలగర్భాల్లోకి దూరి
మకరందాన్ని తాగే తేటి రొమ్ముకొలత
తంగేటి చెట్టుకి ఎన్నడో తెలుసా?
నడి ఎండలో చేతులు జాచి
నాట్యం చేసే కొబ్బరిచెట్టుకి
తన ఎత్తునుంచి ఊడిపడే పాపని కాపాడడానికి
పీచుదిళ్ళ చొక్కాలల్లడం ఎవరు నేర్పారు?
గర్భంలోని శిశువులో
ఏ అవయవాలు ఎక్కడ ఏర్పడాలో
కన్నతల్లి కలగన్నదా?
వార్ధి గడ్డకట్టినా
మంచు బరువెక్కకుండా
తన జీవనంకోసం
సృష్టిజలసూత్రాన్నే మార్చింది
చాపేనా!
కళ్ళులేని గురువింద తీగేకి పట్టుకొమ్మ దొరికేందుకు కస్తూరి పూలపరిమళం తోవచూపిందా? తన పూలగర్భాల్లోకి దూరి మకరందాన్ని తాగే తేటి రొమ్ముకొలత తంగేటి చెట్టుకి ఎన్నడో తెలుసా? నడి ఎండలో చేతులు జాచి నాట్యం చేసే కొబ్బరిచెట్టుకి తన ఎత్తునుంచి ఊడిపడే పాపని కాపాడడానికి పీచుదిళ్ళ చొక్కాలల్లడం ఎవరు నేర్పారు? గర్భంలోని శిశువులో ఏ అవయవాలు ఎక్కడ ఏర్పడాలో కన్నతల్లి కలగన్నదా? వార్ధి గడ్డకట్టినా మంచు బరువెక్కకుండా తన జీవనంకోసం సృష్టిజలసూత్రాన్నే మార్చింది చాపేనా!
© 2017,www.logili.com All Rights Reserved.