ఈ కధల్లోది వేదంలా ప్రవహించే గోదావరి కాదు. ఊళ్ళు నాళ్ళు ఏకం చేసి, పంటపొలాలను ఇసుక మేటలుగా మార్చి, ఎన్నెన్నో నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుని శంకరాభరణ రాగాలాపకంటియై ఉరకలేస్తూ, ఉప్పొంగిపోతూ, తెప్పన ఎగిసి పడుతూ నిర్దాక్షిణ్యంగా సాగిపోయే గోదావరి ఈ కధల్లో కానవస్తుంది. దారి డొంకలులేని పల్లెటూళ్ళు దమ్మిడీకైనా పనికిరాని నాగారం, ఉట్నూరు ప్రాంతాలలోని గిరిజనావాసాలకు అక్షరాలా వర్తిస్తుంది. 'దారంటూ ఏది వుండదు. వృక్షాల మధ్య జీపు పట్టే స్థలముంటే అలా వెళ్ళడమే. ఫలానా దిశగా ఇంతకాలం ప్రయాణం చేస్తే ఫలానా గ్రామం చేరవచ్చునన్నదే లెక్క. కప్పులేగిరిపోయిన ఇళ్ళు, చిత్తడినేల, అంటురోగాల భీభత్సం, క్రూర మృగాల సంచారం, ఎన్ని హమిలిచ్చినా, ఎన్నెన్ని ఆశలు చూపినా గిరిజనులు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఒప్పుకోరు. "తరతరాలుగా ఈ అడవిమధ్యే నివసిస్తున్నాం. ఎలుగుబంట్లు, చిరుతలు, పాములు ఈరోజు కొత్తగా వచ్చినవేమి గావు. మమ్మల్ని ఈ భూమి నుంచి పెకలించి వేస్తె మేము మాత్రం బ్రతుకుతామా?" అంటారు. శ్రీ ఫణికుమార్ గారు కోలాముల పల్లెలు, గోండుల తండాలు పర్యటించి, కష్టనష్టాల్లో వాళ్ళకు బాసటగా నిలచి, వారి స్థితిగతులను విశదంగా గ్రహించి ఆయన ఈ జీవిత రేఖాచిత్రాలను మనముందుంచారు.
- ఫణి కుమార్
ఈ కధల్లోది వేదంలా ప్రవహించే గోదావరి కాదు. ఊళ్ళు నాళ్ళు ఏకం చేసి, పంటపొలాలను ఇసుక మేటలుగా మార్చి, ఎన్నెన్నో నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుని శంకరాభరణ రాగాలాపకంటియై ఉరకలేస్తూ, ఉప్పొంగిపోతూ, తెప్పన ఎగిసి పడుతూ నిర్దాక్షిణ్యంగా సాగిపోయే గోదావరి ఈ కధల్లో కానవస్తుంది. దారి డొంకలులేని పల్లెటూళ్ళు దమ్మిడీకైనా పనికిరాని నాగారం, ఉట్నూరు ప్రాంతాలలోని గిరిజనావాసాలకు అక్షరాలా వర్తిస్తుంది. 'దారంటూ ఏది వుండదు. వృక్షాల మధ్య జీపు పట్టే స్థలముంటే అలా వెళ్ళడమే. ఫలానా దిశగా ఇంతకాలం ప్రయాణం చేస్తే ఫలానా గ్రామం చేరవచ్చునన్నదే లెక్క. కప్పులేగిరిపోయిన ఇళ్ళు, చిత్తడినేల, అంటురోగాల భీభత్సం, క్రూర మృగాల సంచారం, ఎన్ని హమిలిచ్చినా, ఎన్నెన్ని ఆశలు చూపినా గిరిజనులు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఒప్పుకోరు. "తరతరాలుగా ఈ అడవిమధ్యే నివసిస్తున్నాం. ఎలుగుబంట్లు, చిరుతలు, పాములు ఈరోజు కొత్తగా వచ్చినవేమి గావు. మమ్మల్ని ఈ భూమి నుంచి పెకలించి వేస్తె మేము మాత్రం బ్రతుకుతామా?" అంటారు. శ్రీ ఫణికుమార్ గారు కోలాముల పల్లెలు, గోండుల తండాలు పర్యటించి, కష్టనష్టాల్లో వాళ్ళకు బాసటగా నిలచి, వారి స్థితిగతులను విశదంగా గ్రహించి ఆయన ఈ జీవిత రేఖాచిత్రాలను మనముందుంచారు. - ఫణి కుమార్© 2017,www.logili.com All Rights Reserved.