శ్రీ గుంటూరు లక్ష్మికాంతముగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప స్నేహశీలి. నిరాడంబర జీవి. పరోపకార నాయకుడు. స్వార్ధరహితుడు. భగవద్భక్తిపరుడు. కలకత్తాలో తెలుగు బాలబాలికల కోసం ప్రత్యేక పాఠశాలని నెలకొల్పి, కొద్దికాలంలోనే విద్యావేత్తగా గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించారు. శ్రీ వివేకానందస్వామి రచనలను చదివి ప్రభావితులయ్యారు.
శ్రీ నాగపూర్ బాబా, శ్రీ రమణమహర్షిగార్ల అనుగ్రహాన్ని పొందారు. శ్రీ రమణమహర్షి శిష్యులైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారితో వీరికి పరిచయ భాగ్యం కలిగింది. వారి అముద్రిత రచన లేన్నింటినో ప్రచురించిన ఘనత శ్రీ లక్ష్మీకాంతముగారికి దక్కింది. వారి జీవిత చరిత్రను "నాయన" అనే శీర్షికతో రచించి, ముద్రించారు
ఎవరెటువంటి కష్టాల్లో ఉన్నా, వారిని ఆదుకునే స్వభావం శ్రీ లక్ష్మికాంతముగారిది. అచంచల కార్యదీక్ష, ప్రజాసేవ ఆయన ఉచ్చ్వాస నిశ్వాసాలు. అటువంటి వ్యక్తీ "నభూతో నభవిష్యతి"
- గుంటూరు లక్ష్మికాంతము
శ్రీ గుంటూరు లక్ష్మికాంతముగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప స్నేహశీలి. నిరాడంబర జీవి. పరోపకార నాయకుడు. స్వార్ధరహితుడు. భగవద్భక్తిపరుడు. కలకత్తాలో తెలుగు బాలబాలికల కోసం ప్రత్యేక పాఠశాలని నెలకొల్పి, కొద్దికాలంలోనే విద్యావేత్తగా గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించారు. శ్రీ వివేకానందస్వామి రచనలను చదివి ప్రభావితులయ్యారు. శ్రీ నాగపూర్ బాబా, శ్రీ రమణమహర్షిగార్ల అనుగ్రహాన్ని పొందారు. శ్రీ రమణమహర్షి శిష్యులైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారితో వీరికి పరిచయ భాగ్యం కలిగింది. వారి అముద్రిత రచన లేన్నింటినో ప్రచురించిన ఘనత శ్రీ లక్ష్మీకాంతముగారికి దక్కింది. వారి జీవిత చరిత్రను "నాయన" అనే శీర్షికతో రచించి, ముద్రించారు ఎవరెటువంటి కష్టాల్లో ఉన్నా, వారిని ఆదుకునే స్వభావం శ్రీ లక్ష్మికాంతముగారిది. అచంచల కార్యదీక్ష, ప్రజాసేవ ఆయన ఉచ్చ్వాస నిశ్వాసాలు. అటువంటి వ్యక్తీ "నభూతో నభవిష్యతి" - గుంటూరు లక్ష్మికాంతము© 2017,www.logili.com All Rights Reserved.