డా. స్కూస్లర్ చే కనుగొనబడిన ఈ ద్వాదశ లవణములు కూడా హోమియోపతి మందులే. ఇంతకు పూర్వం హోమియో మందులతో పాటు వీటిని కూడా వ్యాధి నివారణకు ఉపయోగించారు. వీటిని కూడా హోమియోపధ్ధతిలోనే తయారు చేస్తారు.
నివారణకు వీలైన రోగములన్నియు ఈ లవణములతో నివారించబడి, నివారణకుదరని వ్యాధులు ఉపశమింపబడతాయనడంలో సందేహం లేదు. ప్రముఖ పాశ్చాత్య హోమియో వైద్యులయిన డా.మల్లర్, డా.బొరిక్, ఎం.డి., డా.ఎల్లెన్, ఎం.డి, డా. లిలియెన్ ధాల్, ఎం.డి. డా. బి.ఎన్. మిత్ర మొదలగు వైద్యులు ఈ లవణముల చికిత్సతో ఎన్నో కేసులు నివారించడం జరిగింది. అటువంటి చాలా కేసులు వివరాలు ఈ గ్రంధంలో ఆయా వ్యాధుల చికిత్సనంతరం ఇవ్వబడినవి.
ప్రతియింటా నిత్యజీవితంలో కలుగు వ్యాధులన్నిటికి, ద్వాదశ లవణములతోను, మిశ్రమ లవణములతోను పూర్తి చికిత్స ఈ గ్రంధములో ఇవ్వబడినది. ఇంతేగాక అంటువ్యాధుల నిరోధక విధానము కూడా ఇవ్వబడినది. ఇది ప్రతియింటా ఉండవలసిన మంచి గ్రంథం. ఏ యితర వైద్యం చేస్తున్నప్పటికీ, ఎట్టి అభ్యంతరం లేకుండా ఈ చికిత్స చేసి త్వరగా వ్యాధి నివారణ చేయవచ్చు.
తెలుగు తెలిసిన ప్రతిగృహిణి, గృహస్తుడు, దీనినాధారం చేసుకొని, వారి కుటుంబంలోని పిల్లలకు, పెద్దలకు, ఎట్టి చెడుఫలితాలు లేకుండా చికిత్స చేయవచ్చు. మానసికంగా, శారీరకంగా వెనుకబడిన పిల్లలకు ఈ చికిత్స చేసిన వారు ఆరోగ్యంగా ఎదగడమే గాక, తెలివితేటలు అభివృద్ధి చెంది మంచి పౌరులుగా, గౌరవ, విద్యార్హతలు సంపాదించగలరు.
డా. స్కూస్లర్ చే కనుగొనబడిన ఈ ద్వాదశ లవణములు కూడా హోమియోపతి మందులే. ఇంతకు పూర్వం హోమియో మందులతో పాటు వీటిని కూడా వ్యాధి నివారణకు ఉపయోగించారు. వీటిని కూడా హోమియోపధ్ధతిలోనే తయారు చేస్తారు. నివారణకు వీలైన రోగములన్నియు ఈ లవణములతో నివారించబడి, నివారణకుదరని వ్యాధులు ఉపశమింపబడతాయనడంలో సందేహం లేదు. ప్రముఖ పాశ్చాత్య హోమియో వైద్యులయిన డా.మల్లర్, డా.బొరిక్, ఎం.డి., డా.ఎల్లెన్, ఎం.డి, డా. లిలియెన్ ధాల్, ఎం.డి. డా. బి.ఎన్. మిత్ర మొదలగు వైద్యులు ఈ లవణముల చికిత్సతో ఎన్నో కేసులు నివారించడం జరిగింది. అటువంటి చాలా కేసులు వివరాలు ఈ గ్రంధంలో ఆయా వ్యాధుల చికిత్సనంతరం ఇవ్వబడినవి. ప్రతియింటా నిత్యజీవితంలో కలుగు వ్యాధులన్నిటికి, ద్వాదశ లవణములతోను, మిశ్రమ లవణములతోను పూర్తి చికిత్స ఈ గ్రంధములో ఇవ్వబడినది. ఇంతేగాక అంటువ్యాధుల నిరోధక విధానము కూడా ఇవ్వబడినది. ఇది ప్రతియింటా ఉండవలసిన మంచి గ్రంథం. ఏ యితర వైద్యం చేస్తున్నప్పటికీ, ఎట్టి అభ్యంతరం లేకుండా ఈ చికిత్స చేసి త్వరగా వ్యాధి నివారణ చేయవచ్చు. తెలుగు తెలిసిన ప్రతిగృహిణి, గృహస్తుడు, దీనినాధారం చేసుకొని, వారి కుటుంబంలోని పిల్లలకు, పెద్దలకు, ఎట్టి చెడుఫలితాలు లేకుండా చికిత్స చేయవచ్చు. మానసికంగా, శారీరకంగా వెనుకబడిన పిల్లలకు ఈ చికిత్స చేసిన వారు ఆరోగ్యంగా ఎదగడమే గాక, తెలివితేటలు అభివృద్ధి చెంది మంచి పౌరులుగా, గౌరవ, విద్యార్హతలు సంపాదించగలరు.© 2017,www.logili.com All Rights Reserved.