ఈ 'గాధలు' స్వీయచారిత్రాత్మకాలు. ప్రధానంగా సాహిత్య సందర్భాలూ, తన మానసిక స్థితిగతులను తెలియజేస్తాయి. సహజంగా ఆయన కధారచయిత కనుక ఆకర్షవంతమైన కధనశైలి వీటి ప్రత్యేకత. శ్రీ హనుమచ్చాస్త్రి తెలుగు ఆధునిక సాహిత్యంలో రెండవ తరానికి చెందిన ప్రముఖ రచయిత. పద్యం, గేయం, కధ, నాటకం, విమర్శ ప్రక్రియల్లో రచనలు చేసి పాఠకాభిమానం పొందారు. ఏ మనిషయినా తన కాలం జ్ఞాపకాలు అనుభవాలు, చెప్పడం ప్రారంభిస్తే అది చరిత్ర అవుతుంది. ఒక సమాజానికి అద్దం అవుతుంది. అదే - ఒక రచయిత, కళాశీలి చెపితే అదీ చరిత్ర అవుతుంది ఒకనాటి సంస్కృతీ వికాసానికి సాక్ష్యం పలుకుతుంది. "గౌతమీగాధలు" ఒక రచయిత ఉద్రేకాలు, ఉద్యమ గాధలు. ఒక తరం రచయితల చైతన్య యాత్రకు చెరిగిపోనీ గుర్తులు.
నాకు ఆత్మకథలు వ్రాసుకోదగినంత అవసరం గాని, ఆధిక్యం గాని లేవని స్పష్టంగా తెలుసు. కాని - ఈ రచనలో నాకొక లక్ష్యం ఉంది. సుమారు ఏభై ఏళ్ల కిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు ఎట్లా ఉండేవి? ఎట్లా నడిచాయి? వాటి వెనక రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేశాయి? ఆనాటి శైష్యోపాధ్యాయిక తీరు ఎట్లా ఉండేది? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఏ దిశగా నడిచారు? ఎలా ఆలోచించేవారు? అనే బొమ్మ ఈ తరం వారికి చూపడమే నా ముఖ్యోద్దేశం. వట్టి అనుభవాలు, జ్ఞాపకాలు, రికార్డు చెయ్యడం కాకుండా - దానిని చమత్కారం, చలోక్తులు జోడించి కథనాన్ని రుచిమంతంగా చెయ్యడానికి ప్రయత్నించాను. అలవోకగా ప్రారంభించిన దీనికి, నేననుకున్నదానికంటే ఇబ్బడిగా ముబ్బడిగా యువతరం ప్రతిస్పందించి అభిమానం వర్షించడం, ఆసక్తితో చేరువకావడం, ఆశ్చర్యం ఆనందం కలిగించాయి!. అప్పట్లో ఆంధ్రజ్యోతి వార పత్రికకు సంపాదకుడు అయిన శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మా నాన్నగారు ఆపివేసిన ఈ పనిని కొనసాగింపజేయాలని - గట్టిగా పట్టు పట్టి "గౌతమి గాథలు" పేరిట ఆ 'వారపత్రిక' లో ధారావాహికంగా ప్రారంభించారు.
- ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి
ఈ 'గాధలు' స్వీయచారిత్రాత్మకాలు. ప్రధానంగా సాహిత్య సందర్భాలూ, తన మానసిక స్థితిగతులను తెలియజేస్తాయి. సహజంగా ఆయన కధారచయిత కనుక ఆకర్షవంతమైన కధనశైలి వీటి ప్రత్యేకత. శ్రీ హనుమచ్చాస్త్రి తెలుగు ఆధునిక సాహిత్యంలో రెండవ తరానికి చెందిన ప్రముఖ రచయిత. పద్యం, గేయం, కధ, నాటకం, విమర్శ ప్రక్రియల్లో రచనలు చేసి పాఠకాభిమానం పొందారు. ఏ మనిషయినా తన కాలం జ్ఞాపకాలు అనుభవాలు, చెప్పడం ప్రారంభిస్తే అది చరిత్ర అవుతుంది. ఒక సమాజానికి అద్దం అవుతుంది. అదే - ఒక రచయిత, కళాశీలి చెపితే అదీ చరిత్ర అవుతుంది ఒకనాటి సంస్కృతీ వికాసానికి సాక్ష్యం పలుకుతుంది. "గౌతమీగాధలు" ఒక రచయిత ఉద్రేకాలు, ఉద్యమ గాధలు. ఒక తరం రచయితల చైతన్య యాత్రకు చెరిగిపోనీ గుర్తులు. నాకు ఆత్మకథలు వ్రాసుకోదగినంత అవసరం గాని, ఆధిక్యం గాని లేవని స్పష్టంగా తెలుసు. కాని - ఈ రచనలో నాకొక లక్ష్యం ఉంది. సుమారు ఏభై ఏళ్ల కిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు ఎట్లా ఉండేవి? ఎట్లా నడిచాయి? వాటి వెనక రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేశాయి? ఆనాటి శైష్యోపాధ్యాయిక తీరు ఎట్లా ఉండేది? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఏ దిశగా నడిచారు? ఎలా ఆలోచించేవారు? అనే బొమ్మ ఈ తరం వారికి చూపడమే నా ముఖ్యోద్దేశం. వట్టి అనుభవాలు, జ్ఞాపకాలు, రికార్డు చెయ్యడం కాకుండా - దానిని చమత్కారం, చలోక్తులు జోడించి కథనాన్ని రుచిమంతంగా చెయ్యడానికి ప్రయత్నించాను. అలవోకగా ప్రారంభించిన దీనికి, నేననుకున్నదానికంటే ఇబ్బడిగా ముబ్బడిగా యువతరం ప్రతిస్పందించి అభిమానం వర్షించడం, ఆసక్తితో చేరువకావడం, ఆశ్చర్యం ఆనందం కలిగించాయి!. అప్పట్లో ఆంధ్రజ్యోతి వార పత్రికకు సంపాదకుడు అయిన శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మా నాన్నగారు ఆపివేసిన ఈ పనిని కొనసాగింపజేయాలని - గట్టిగా పట్టు పట్టి "గౌతమి గాథలు" పేరిట ఆ 'వారపత్రిక' లో ధారావాహికంగా ప్రారంభించారు. - ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి
© 2017,www.logili.com All Rights Reserved.