అనగనగా...
భారతీయ సంప్రదాయ పరిరక్షణకి
కంకణం కట్టుకున్న ఒక విద్యాపీఠం -
“నీ మనస్సు, మాట, వేషం
ఇందుకు అంకితం కావాలి”
-ప్రధానాచార్యుడి ఆదేశం-ఉపదేశం!
“ఇక్కడ మాటకు వేడి లేదు; మనస్సుకి
వికాసం లేదు. వేషానికి భాష్యం వేరు”
- ఇద్దరు విద్యార్థుల ఆక్రోశం-ఆవేశం!
“నాగరకతకి మరో పేరు తత్కాలీన జీవితం,
నీ లోపలి సంస్కారం జాగ్రత్త”
-ఒక గురువు తొక్కిన మధ్యేమార్గం!
మీరింతవరకు చూడని మరో ప్రపంచపు చిరునవ్వులూ,
కన్నీళ్లూ, ప్రణయాలూ, ప్రళయాలూ పరిచి చూపించే
వింత రంగుల కెలడోస్కోప్...
ఈ
తూర్పున వాలిన సూర్యుడు
© 2017,www.logili.com All Rights Reserved.