కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితంలోని అన్ని భాగాలకూ విస్తరించి కాగితపు వాసనను, అక్షరాల రుచిని మస్తిష్కానికి దూరం చేసే స్థాయికి చేరుతున్న రోజులివి. ఇలాంటి సమయాల్లో చదువుకి, ఉద్యోగానికి వ్యక్తిత్వ వికాసానికి అక్కరకొచ్చే పుస్తకాలను తప్పించి, మంచి పుస్తకాలను ఎవరు కొంటారు? చదివేది ఎందరు? అనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మంచి పుస్తకాలనేవి కాలాతీతమైనవనీ, వాటికీ ఆదరణ ఎప్పటికీ చెక్కుచెదరదనీ లెక్కకు మిక్కిలి నిదర్శనాలు నొక్కిచెప్తున్నాయి.
తెలుగు నాట ప్రచురణ సంస్థలకు కానీ అవి ఏటా వెలువరించే పుస్తకాలకు కానీ కొదవేం లేదు. మరి అలాంటప్పుడు కొత్తగా మేము అదే పుస్తక ప్రచురణను ఎందుకు చేపడుతున్నట్టు? అని మీరు అడగవచ్చు. దానికి మా సమాధానం ఎన్ని పుస్తకాలు వచ్చినా పది కాలాలు నిలిచి వెలిగే దీపాలు మాత్రం కొన్నే.
- శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి