గురజాడా
ఎంతని చెప్పను
తీగ లాగితే డొంకంతా కదుల్తోంది
"కన్యాశుల్కం" లో
నీవు సృష్టించిన పాత్రలు
నిజంగానేనీవు పెట్టిన హద్దుల్లో లేవు !
కొన్ని పాత్రలు పత్తాకూడా లేదు.
..... శివ సాగర్
పదపదమంటూ పదాల పడవల మీద
పోరాటానికి బయలుదేరిన సాహసికుడితడు
ఈ బల్ రైఫిల్ పదాల స్వరాలలోంచి
గుండెలను అమాంతం పేల్చగలడు
అన్నింటినీ నిట్టనిలువునా పట్టపగలే కూల్చగలడు
అతనొక ఆకాశనీలిమ, అరుణిమలతో అవేదనలని, అశ్రువులను, ఆసాంతం హరించేందుకు
శివమెత్తిన సాగరం
ఆయన కవిత్వం విప్లవ విముక్త రూపక సముద్రం
ఆయన పదం ఆధిక్య, అణచివేతలపై ఎక్కుపెట్టి ధిక్కార స్వరం
© 2017,www.logili.com All Rights Reserved.