ఎంతోమంది వాస్తుదోషాల వలన బాధలు పడుతుంటారు. కాని వారు పడే బాధలకు, కష్టనష్టాలకు కారణం 'ఫలానా' వాస్తుదోషం అని వారికి తెలియదు. అటువంటి ఎంతోమందికి 'వాస్తుపరిజ్ఞానం' అందించే ప్రయత్నమే ఈ పుస్తక ముఖ్యోద్దేశం. ఇంటికి ఎన్ని వాస్తు మార్పులు చేసుకుంటున్నా మంచి ఫలితాలు కనిపించకపోతే నాలుగు గోడల నడుమ వాస్తు గురించే కాదు, నేల అడుగున వున్న శల్యాల గురించి, పరిసరాల వేధల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందన్నమాట!
ఏ శాస్త్రమైనా అనంతమైనది. ఏ శాస్త్రజ్ఞుడైనా తన జిజ్ఞాసను బట్టి తెలుసుకోగలిగింది అణువంతే. ఈ రోజుకు మాకున్న పరిజ్ఞానాన్ని మేము నేర్చుకున్న దాన్నిబట్టి మా అభిప్రాయాలను మీ ముందు ఉంచుతున్నాము. పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారని, ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.
- దంతూరి పండరీనాథ్
ఎంతోమంది వాస్తుదోషాల వలన బాధలు పడుతుంటారు. కాని వారు పడే బాధలకు, కష్టనష్టాలకు కారణం 'ఫలానా' వాస్తుదోషం అని వారికి తెలియదు. అటువంటి ఎంతోమందికి 'వాస్తుపరిజ్ఞానం' అందించే ప్రయత్నమే ఈ పుస్తక ముఖ్యోద్దేశం. ఇంటికి ఎన్ని వాస్తు మార్పులు చేసుకుంటున్నా మంచి ఫలితాలు కనిపించకపోతే నాలుగు గోడల నడుమ వాస్తు గురించే కాదు, నేల అడుగున వున్న శల్యాల గురించి, పరిసరాల వేధల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందన్నమాట! ఏ శాస్త్రమైనా అనంతమైనది. ఏ శాస్త్రజ్ఞుడైనా తన జిజ్ఞాసను బట్టి తెలుసుకోగలిగింది అణువంతే. ఈ రోజుకు మాకున్న పరిజ్ఞానాన్ని మేము నేర్చుకున్న దాన్నిబట్టి మా అభిప్రాయాలను మీ ముందు ఉంచుతున్నాము. పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారని, ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. - దంతూరి పండరీనాథ్© 2017,www.logili.com All Rights Reserved.