జమీల్య
జమీల్య ఓ అపురూపమైన ప్రేమకధ. తరచూ దీన్ని ‘ ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకధగా’ అభివర్ణించినా..... అంతకు మించిన బలీయమైన సామజిక సందర్భం , సంస్కృతుల సంఘర్షణ,సమకాలీనజీవన సంక్లిష్టతలను ప్రతిఫలించడం దీని గాడతను మరింత పెంచింది. అందుకే ఇప్పటికీ ఐత్ మాతోవ్ రచనలన్నింటి లోకి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన నవలగా, నిలబడుతోంది.దీన్ని ఆయన ౧౯౫౮ లో కిర్గిజ్, రష్యన్ భాషలు రెంటిలోనూ రాసారు. ౫౯ లో లూయీ ఆరగాన్ చేసిన ఫ్రెంచ్ అనువాదంలో జమీల్యా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. తర్వాత ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. తొలినాళ్ళలో ఈ నవల కిర్గ్ స్తాన్ లో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. ఈ సాంప్రదాయ సమాజానికి ప్రతినిధి జమీల్యా భర్త. స్త్రీ గా ఆమె పట్ల ప్రేమ చూపడం కంటే కూడా ... ఆమెను తన అస్తిలా, సొత్తులా భావిస్తాడాయన. అందుకే ధనియార్ దగ్గర తనకు కావల్సినా ప్రేమ దొరికినప్పుడు ఆమె వెనుదిరిగి చూడదు. దనియార్ నుంచి ఆమెకు ప్రత్యేకమైన భరోసా ఏది అవసరం ఉండదు. అంతిమంగా వారిద్దరి పయనం... సాంప్రదాయిక బంధనాల నుంచి స్వేచ్చనే కాదు. సరికొత్త సోవియట్ జాతి, సోవియట్ జీవిత నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుంది. పెను మార్పు కోసం ఆలపిస్తున్న సాముహ గీతంతో శ్రుతి కలుపుతుంది.
చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా అవిర్బవించిన పరిణామా క్రమానికి అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు.
జమీల్య జమీల్య ఓ అపురూపమైన ప్రేమకధ. తరచూ దీన్ని ‘ ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకధగా’ అభివర్ణించినా..... అంతకు మించిన బలీయమైన సామజిక సందర్భం , సంస్కృతుల సంఘర్షణ,సమకాలీనజీవన సంక్లిష్టతలను ప్రతిఫలించడం దీని గాడతను మరింత పెంచింది. అందుకే ఇప్పటికీ ఐత్ మాతోవ్ రచనలన్నింటి లోకి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన నవలగా, నిలబడుతోంది.దీన్ని ఆయన ౧౯౫౮ లో కిర్గిజ్, రష్యన్ భాషలు రెంటిలోనూ రాసారు. ౫౯ లో లూయీ ఆరగాన్ చేసిన ఫ్రెంచ్ అనువాదంలో జమీల్యా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. తర్వాత ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. తొలినాళ్ళలో ఈ నవల కిర్గ్ స్తాన్ లో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. ఈ సాంప్రదాయ సమాజానికి ప్రతినిధి జమీల్యా భర్త. స్త్రీ గా ఆమె పట్ల ప్రేమ చూపడం కంటే కూడా ... ఆమెను తన అస్తిలా, సొత్తులా భావిస్తాడాయన. అందుకే ధనియార్ దగ్గర తనకు కావల్సినా ప్రేమ దొరికినప్పుడు ఆమె వెనుదిరిగి చూడదు. దనియార్ నుంచి ఆమెకు ప్రత్యేకమైన భరోసా ఏది అవసరం ఉండదు. అంతిమంగా వారిద్దరి పయనం... సాంప్రదాయిక బంధనాల నుంచి స్వేచ్చనే కాదు. సరికొత్త సోవియట్ జాతి, సోవియట్ జీవిత నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుంది. పెను మార్పు కోసం ఆలపిస్తున్న సాముహ గీతంతో శ్రుతి కలుపుతుంది. చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా అవిర్బవించిన పరిణామా క్రమానికి అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు.© 2017,www.logili.com All Rights Reserved.