తోలి ఉపాధ్యాయుడు
మారుమూల కిర్గిజ్ గ్రామంలో తొట్ట తోలి పాటశాలను స్థాపించి ... నవ సమాజ నిర్మాణం కోసం ఒక యువ ఉపాధ్యాయుడు పడిన తపనను, ఆ క్రమంలో సామాజికంగా అతనికి ఎదురైన పెను సవాళ్ళను హృద్యంగా చర్చిస్తుందీ నవల.దుషన్ పేరుతో ఐత్ మాతోవ్ ౧౯౬౨ లో రాసిన ఈ నవలకు ఆంగ్ల అనువాదమైన ‘ఫస్ట్ టీచర్’ ప్రపంచ వ్యాప్తం గా ఎంతో ప్రాచుర్యం పొందింది. సోవియట్ సమాజ నిర్మాణం కోసం.... తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ విలువలకు దూరం జరగాల్సి వచ్చినప్పుడు తొలినాళ్ళలో ఆయా జాతులు అనుభవించిన సంఘర్షణను, ఆ వ్యధను.... ఆ క్రమంలో ఓ తొలితరం ఉపాధ్యాయుడు సాధించిన విజయాలను అధ్బుతంగా వివరిస్తుందీ నవల. బాహ్య ప్రపంచపు విజ్ఞానాన్ని, విద్యనూ తన కుగ్రామంలోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన దూషన్ అనుభవాలు ... నేడు మనదేశంలో ఇటువంటి కృషి చేస్తున్న ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయి.
చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా అవిర్బవించిన పరిణామా క్రమానికి అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు.
తోలి ఉపాధ్యాయుడు మారుమూల కిర్గిజ్ గ్రామంలో తొట్ట తోలి పాటశాలను స్థాపించి ... నవ సమాజ నిర్మాణం కోసం ఒక యువ ఉపాధ్యాయుడు పడిన తపనను, ఆ క్రమంలో సామాజికంగా అతనికి ఎదురైన పెను సవాళ్ళను హృద్యంగా చర్చిస్తుందీ నవల.దుషన్ పేరుతో ఐత్ మాతోవ్ ౧౯౬౨ లో రాసిన ఈ నవలకు ఆంగ్ల అనువాదమైన ‘ఫస్ట్ టీచర్’ ప్రపంచ వ్యాప్తం గా ఎంతో ప్రాచుర్యం పొందింది. సోవియట్ సమాజ నిర్మాణం కోసం.... తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ విలువలకు దూరం జరగాల్సి వచ్చినప్పుడు తొలినాళ్ళలో ఆయా జాతులు అనుభవించిన సంఘర్షణను, ఆ వ్యధను.... ఆ క్రమంలో ఓ తొలితరం ఉపాధ్యాయుడు సాధించిన విజయాలను అధ్బుతంగా వివరిస్తుందీ నవల. బాహ్య ప్రపంచపు విజ్ఞానాన్ని, విద్యనూ తన కుగ్రామంలోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన దూషన్ అనుభవాలు ... నేడు మనదేశంలో ఇటువంటి కృషి చేస్తున్న ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయి. చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా అవిర్బవించిన పరిణామా క్రమానికి అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు.© 2017,www.logili.com All Rights Reserved.