తల్లి భూదేవి
- చింగీజ్ ఐత్ మాతోవ్
యుద్ధం లేకుండా మనిషి మనలేడా అని హృదయాలను కదిలించేలా ప్రశ్నించే ఓ వృద్ధ మహిళ యుద్ధ వ్యధ. ‘తల్లి భూ దేవి’ లో వ్యవసాయక కుటుంబానికి చెందిన వృద్ద మహిళ తోల్గొనాయ్..... తన ముందే ఎంతోమంది తమ అస్తిత్వం కోల్పోవటాన్ని, ఆ వరస విషాదాలను మర్చిపోలేదు. యుద్దంలో భర్తనూ,ముగ్గురు కొడుకులనూ పోగొట్టుకున్న ఆమెకు మిగిలింది ఒకే ఒక వ్యక్తి... గర్భంతో ఉన్న కోడలు ! ఆమె కూడా కాన్పు కష్టమై మరణించడంతో కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన బిడ్డకు జీవితాన్ని, ఈ లోకాన్ని పరిచయం చేసే భాద్యత తోల్గొనాయ్ మీదే పడుతుంది. దాన్ని ఆమె స్వీకరించిన తీరు,నిర్వహించిన వైనం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా అవిర్బవించిన పరిణామా క్రమానికి అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు
తల్లి భూదేవి - చింగీజ్ ఐత్ మాతోవ్ యుద్ధం లేకుండా మనిషి మనలేడా అని హృదయాలను కదిలించేలా ప్రశ్నించే ఓ వృద్ధ మహిళ యుద్ధ వ్యధ. ‘తల్లి భూ దేవి’ లో వ్యవసాయక కుటుంబానికి చెందిన వృద్ద మహిళ తోల్గొనాయ్..... తన ముందే ఎంతోమంది తమ అస్తిత్వం కోల్పోవటాన్ని, ఆ వరస విషాదాలను మర్చిపోలేదు. యుద్దంలో భర్తనూ,ముగ్గురు కొడుకులనూ పోగొట్టుకున్న ఆమెకు మిగిలింది ఒకే ఒక వ్యక్తి... గర్భంతో ఉన్న కోడలు ! ఆమె కూడా కాన్పు కష్టమై మరణించడంతో కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన బిడ్డకు జీవితాన్ని, ఈ లోకాన్ని పరిచయం చేసే భాద్యత తోల్గొనాయ్ మీదే పడుతుంది. దాన్ని ఆమె స్వీకరించిన తీరు,నిర్వహించిన వైనం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా అవిర్బవించిన పరిణామా క్రమానికి అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు© 2017,www.logili.com All Rights Reserved.