ఆ పేరు వినగానే అందరిలో ఓ రకమైన ఉద్విగ్నత పేరుకుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కేట్ ఇన్వెస్టర్లు ఆ పేరు వినగానే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు.
ప్రపంచంలోనే రెండవ సంపన్న స్థానంలో వున్న ఆయన కేవలం స్టాక్ మార్కేట్ ద్వారానే అన్ని బిలియన్ల డాలర్లు సంపాదించారంటే అది ఆషామాషీ విషయమం కాదు. ఒక రకంగా చెప్పాలంటే 'స్టాక్ మార్కేట్' అంటే విముఖత అపనమ్మకం, పెదవి విరుపులు నెలకొని వున్న సందర్భంలో ఆయన స్టాక్ మార్కేట్ లో సైతం కుబేరులై పోవచ్చన్న నిజం నిరూపించారు. అడ్డు అదుపులేని స్పెక్యులేషన్ తో, బడా బ్రోకర్ల ఆకృత్యాలతో నిండివున్న స్టాక్ మార్కేట్ లో ఇన్వెస్టర్లు మోసగించకుండా, ఆర్ధిక సూత్రాలను పాటిస్తూ ఆపరకుబేరులు కావడం సంభవమేనంటూ చేసి చూపించారు వారన్ బఫెట్.
కలలు కనడం వేరు! కలలు నిజం చేసుకోవడం వేరు! చాలా మంది 'స్టాక్ మార్కేట్' లో కోట్లు సంపాదించినట్లుగా కలలు కంటారు. కాని అందుకు తగిన పరిశ్రమ చేయరు. అలాంటిది వారెన్ బఫెట్ తనదైన శైలితో, సామర్ధ్యంతో స్టాక్ మార్కేట్ ని లొంగదిసుకొని వేల కోట్లు సంపాదించి ప్రపంచ ఐశ్వర్య వంతుల లిస్ట్ లో రెండవస్థానాన్ని అధిస్టించారు.
అలాంటి వారెన్ బఫెట్ చరిత్ర ఏమిటి? - అసలు ఆయన స్టాక్ మార్కేట్ లో అనుసరించిన వ్యూహాలు ఏమిటి? అసలు ఆయన ఎలాంటి షేర్లను ఎన్నుకోనేవాడు? లాంటి ప్రశ్నలు చాలా మంది మదిని తొలుస్తున్నాయి. ఆ వ్యూహాలు, టెక్నిక్ లు గురించి ఈ పుస్తకంలో వీలైనంత వరకూ వివరించాం.
వారెన్ బఫెట్ కీ స్టాక్ మార్కేట్ లో గురువు బెంజిమన్ గ్రాహం. ఈ బెంజిమన్ గ్రాహం రాసిన 'సెక్యూరిటీ అనాలసిస్' మరియు 'ది ఇంటలిజెన్స్' అన్న గ్రంధాలు షేర్ వ్యాపారం చేసే వారికి భగవద్గీత లాంటివి. ఈ నేపధ్యంలో వారెన్ బఫెట్ - ఈ పుస్తకాల్లోని సిద్ధాంతాలు మరియు తన స్వంత సిద్ధాంతాలు కలిపి షేర్ వ్యాపారం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించాడు.
అందుకే ఈ పుస్తకంలో ముందుగా బెంజిమన్ గ్రాహం ప్రతిపాదించిన స్టాక్ మార్కేట్ సిద్ధాంతాలు, ఆ తర్వాత వారెన్ బఫెట్ సిద్ధాంతాలు వివరించాము. నిజానికి బెంజిమన్ గ్రాహం, వారెన్ బఫెట్ సూత్రాలు ఇంచుమించుగా ఒక్కటిగానే వుంటాయి.
పాశ్చాత్య స్టాక్ మార్కేట్ కు, మన మార్కేట్ లకు, కొద్దిపాటి వైవిధ్యమున్నప్పటికీ వారెన్ బఫెట్ సూత్రాలు విశ్వజననియంగా పాటించదగ్గవే! కాబట్టి వారెన్ బఫెట్ సూత్రాలు చాలా వరకూ ఇన్వెస్టర్లకు మేలు చేసేవిగా వుంటాయి.
- డా. కె. కిరణ్ కుమార్
ఆ పేరు వినగానే అందరిలో ఓ రకమైన ఉద్విగ్నత పేరుకుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కేట్ ఇన్వెస్టర్లు ఆ పేరు వినగానే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రపంచంలోనే రెండవ సంపన్న స్థానంలో వున్న ఆయన కేవలం స్టాక్ మార్కేట్ ద్వారానే అన్ని బిలియన్ల డాలర్లు సంపాదించారంటే అది ఆషామాషీ విషయమం కాదు. ఒక రకంగా చెప్పాలంటే 'స్టాక్ మార్కేట్' అంటే విముఖత అపనమ్మకం, పెదవి విరుపులు నెలకొని వున్న సందర్భంలో ఆయన స్టాక్ మార్కేట్ లో సైతం కుబేరులై పోవచ్చన్న నిజం నిరూపించారు. అడ్డు అదుపులేని స్పెక్యులేషన్ తో, బడా బ్రోకర్ల ఆకృత్యాలతో నిండివున్న స్టాక్ మార్కేట్ లో ఇన్వెస్టర్లు మోసగించకుండా, ఆర్ధిక సూత్రాలను పాటిస్తూ ఆపరకుబేరులు కావడం సంభవమేనంటూ చేసి చూపించారు వారన్ బఫెట్. కలలు కనడం వేరు! కలలు నిజం చేసుకోవడం వేరు! చాలా మంది 'స్టాక్ మార్కేట్' లో కోట్లు సంపాదించినట్లుగా కలలు కంటారు. కాని అందుకు తగిన పరిశ్రమ చేయరు. అలాంటిది వారెన్ బఫెట్ తనదైన శైలితో, సామర్ధ్యంతో స్టాక్ మార్కేట్ ని లొంగదిసుకొని వేల కోట్లు సంపాదించి ప్రపంచ ఐశ్వర్య వంతుల లిస్ట్ లో రెండవస్థానాన్ని అధిస్టించారు. అలాంటి వారెన్ బఫెట్ చరిత్ర ఏమిటి? - అసలు ఆయన స్టాక్ మార్కేట్ లో అనుసరించిన వ్యూహాలు ఏమిటి? అసలు ఆయన ఎలాంటి షేర్లను ఎన్నుకోనేవాడు? లాంటి ప్రశ్నలు చాలా మంది మదిని తొలుస్తున్నాయి. ఆ వ్యూహాలు, టెక్నిక్ లు గురించి ఈ పుస్తకంలో వీలైనంత వరకూ వివరించాం. వారెన్ బఫెట్ కీ స్టాక్ మార్కేట్ లో గురువు బెంజిమన్ గ్రాహం. ఈ బెంజిమన్ గ్రాహం రాసిన 'సెక్యూరిటీ అనాలసిస్' మరియు 'ది ఇంటలిజెన్స్' అన్న గ్రంధాలు షేర్ వ్యాపారం చేసే వారికి భగవద్గీత లాంటివి. ఈ నేపధ్యంలో వారెన్ బఫెట్ - ఈ పుస్తకాల్లోని సిద్ధాంతాలు మరియు తన స్వంత సిద్ధాంతాలు కలిపి షేర్ వ్యాపారం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అందుకే ఈ పుస్తకంలో ముందుగా బెంజిమన్ గ్రాహం ప్రతిపాదించిన స్టాక్ మార్కేట్ సిద్ధాంతాలు, ఆ తర్వాత వారెన్ బఫెట్ సిద్ధాంతాలు వివరించాము. నిజానికి బెంజిమన్ గ్రాహం, వారెన్ బఫెట్ సూత్రాలు ఇంచుమించుగా ఒక్కటిగానే వుంటాయి. పాశ్చాత్య స్టాక్ మార్కేట్ కు, మన మార్కేట్ లకు, కొద్దిపాటి వైవిధ్యమున్నప్పటికీ వారెన్ బఫెట్ సూత్రాలు విశ్వజననియంగా పాటించదగ్గవే! కాబట్టి వారెన్ బఫెట్ సూత్రాలు చాలా వరకూ ఇన్వెస్టర్లకు మేలు చేసేవిగా వుంటాయి. - డా. కె. కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.