స్వామి వివేకానంద ధైర్యానికి మారుపేరు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటునప్పుడు అసహాయ శూరుడుగా ముందుకు దూసుకుపోయారే తప్ప, సమస్యలకు భయపడి వెనుకకు తిరగటమనే సంఘటన ఆయన జీవితంలో ఎన్నడూ జరగలేదు. సవాలు చేస్తున్న ధోరణిలో, "ప్రతికూల పరిస్థితులు ఎంత విషమిస్తుంటే నాలో అంత అధికశక్తి వ్యక్తమవుతుంది" అని ఆయన పలికే ధైర్య వచనాలు తమ లక్ష్యాన్ని సాధించాలని ఆశించే వారికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భారతదేశ పునరుద్దరణకు నడుము కట్టిన స్వామి వివేకానంద తన ప్రయత్నంలో ఎదుర్కొన్న క్లిష్ట సమస్యలు కోకొల్లలు. భారతదేశ బీద ప్రజల ఆర్ధిక పరిస్థితిని చక్కబరచి, వాళ్ళు తమ కాళ్ళపై నిలబడేందుకు మార్గాన్ని అన్వేషించాలనే ఆశయంతో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. పాశ్చాత్యులకు ఆధ్యాత్మిక బోధనలతో జాగృతిపరచి తద్వారా భారత దేశానికి ఆర్ధిక సహాయాన్ని తీసుకు వచ్చారు.
ఆధునిక యుగానికి స్వామి వివేకానంద సందేశాన్ని సృజనాత్మకంగా అందిస్తున్న ఈ పుస్తకం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, పారిశ్రామిక వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు తమ లక్ష్యాన్ని సాధించడంలో చాలా స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తూ....
- స్వామి జ్ఞానదానంద
స్వామి వివేకానంద ధైర్యానికి మారుపేరు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటునప్పుడు అసహాయ శూరుడుగా ముందుకు దూసుకుపోయారే తప్ప, సమస్యలకు భయపడి వెనుకకు తిరగటమనే సంఘటన ఆయన జీవితంలో ఎన్నడూ జరగలేదు. సవాలు చేస్తున్న ధోరణిలో, "ప్రతికూల పరిస్థితులు ఎంత విషమిస్తుంటే నాలో అంత అధికశక్తి వ్యక్తమవుతుంది" అని ఆయన పలికే ధైర్య వచనాలు తమ లక్ష్యాన్ని సాధించాలని ఆశించే వారికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భారతదేశ పునరుద్దరణకు నడుము కట్టిన స్వామి వివేకానంద తన ప్రయత్నంలో ఎదుర్కొన్న క్లిష్ట సమస్యలు కోకొల్లలు. భారతదేశ బీద ప్రజల ఆర్ధిక పరిస్థితిని చక్కబరచి, వాళ్ళు తమ కాళ్ళపై నిలబడేందుకు మార్గాన్ని అన్వేషించాలనే ఆశయంతో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. పాశ్చాత్యులకు ఆధ్యాత్మిక బోధనలతో జాగృతిపరచి తద్వారా భారత దేశానికి ఆర్ధిక సహాయాన్ని తీసుకు వచ్చారు. ఆధునిక యుగానికి స్వామి వివేకానంద సందేశాన్ని సృజనాత్మకంగా అందిస్తున్న ఈ పుస్తకం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, పారిశ్రామిక వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు తమ లక్ష్యాన్ని సాధించడంలో చాలా స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తూ.... - స్వామి జ్ఞానదానంద© 2017,www.logili.com All Rights Reserved.