మనిషి లక్ష్యం ఏమిటి? ఇందుకు ఎవరెన్ని రకాలుగా సమాధానం చెప్పినా, అసలు నిజం - మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించడమే. మనిషి బ్రతకడానికి కనీస అవసరాలయిన 'తిండి, బట్ట, నీడ' లతో పాటు మరెన్నో అవసరాలు తీరాలి. అందుకు మనిషికీ డబ్బు అవసరం. చాలీ చాలని డబ్బు వల్ల మనిషి మెరుగైన జీవన ప్రమాణాలతో జివించలేడు. ఆధునిక యుగంలో డబ్బు సంపాదించడానికి మార్గాలెన్నో ఉన్నాయి. చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం తేలికేమీ కాదు. అలాగని జూదంలో డబ్బులు వస్తాయనుకోవడం కూడా పొరపాటే! ఒక వ్యక్తీ స్వశక్తితో కళ్ళమీద నిలబడి సంపాదించాలంటే విద్యనో, చేతివృత్తినో నేర్చుకోవాలి.
'షేర్లు' లేదా స్టాక్ మార్కెట్లకు సంబంధించి కూడా అంతే! అవేమిటో వాటి ఉపయోగం ఏమిటో, వాటినెలా ఉపయోగించాలో తెలియక చాలా మంది పెదవి విరిచేస్తారు. కొందరు దానినో 'జూదం' గా భావిస్తే, మరికొందరు అదో అర్ధం కాని పద్మవ్యుహ్యంగా కొట్టిపారేస్తారు. నిజానికి స్టాక్ మార్కెట్ ని పెట్టుబడి వృద్ది చేసే సాధనంగా చేసుకోవచ్చునే సూత్రం వారు విస్మరిస్తున్నారు.
అయితే స్టాక్ మార్కెట్ ఒక ఊబి. అందులో ఒక సారి దిగిన తర్వాత బయటకు రావడం కష్టం. అందులో డబ్బులు పోగొట్టుకొని కట్టుబట్టలతో రోడ్డుమీదపడ్డవారు చాలా మంది వున్నారు. లక్షలు సంపాదించి సురక్షితంగా బయటపడ్డవారు కొద్ది మందే వున్నారు. అందుకు కారణం ఇన్వెస్టర్ల అత్యాశ ఒక కారణం కాగా, ఓపిక లేమితనం మరో కారణం.
నిజానికి ఒక ప్రణాళిక ప్రకారం మంచి షేర్లు ఎన్నిక చేసుకొని, తొందరపడకుండా నిదానంగా ఓపిక పట్టి అమ్మేవారికి నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక పద్దతి ప్రకారం ఇన్వెస్ట్ చేసి, తాము అనుకున్న ధర (రెట్టింపు లేదా కనీసం 50శాతం) పెరగగానే అమ్ముకునే వారు తప్పక విజయం సాధించగలరు. నిజానికి ఒక సంవత్సర కాలంలో మీ డబ్బు రెట్టింపు కావడం (లేదా పోవడం) అనేది ఒక్క స్టాక్ మార్కేట్ లోనే (కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో స్థలాలు మినహాయిస్తే) సంభవం.
స్టాక్ మార్కేట్ లో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న ఈ రచయిత తన జీవన పదంలో ఎన్నో అనుభవాలు గడించాడు. అయితే నాణానికి రెండోవైపు ఆలోచిస్తే - తమ దగ్గర వున్న మిగులు డబ్బుని స్టాక్ మార్కేట్ లో ఫండమెంటల్స్ ఆధారంగా పెట్టి తన ఉద్యోగం, బిజినెస్ తాము చేసుకుంటూనే లక్షలు సంపాదించినవారిని చూశాడు. మొత్తం మీద ఓపికతో, కామన్ సెన్స్ తో వ్యవహరించిన వారు స్టాక్ ఎక్సేంజ్ విజేతలు అవడం సులభమే!
కాబట్టి స్టాక్ మార్కేట్ లో అడుగుపెట్టడానికి ముందు మీకున్న గుణగుణాలు బేరీజు వేసుకోండి. మీరు రిస్క్ తీసుకునే లక్షణం వుందా? అదనంగా వున్న డబ్బునే మీరు వ్యాపారంలో పెడుతున్నారా? లేదా స్పెక్యులేషన్ కొస, వస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు పొందాకే అడుగుపెట్టడం ఉత్తమం.
ఈ పుస్తకంలోమేము - ప్రస్తుతం ఏ పరిశ్రమలు బూమ్ లో ఉన్నాయో, ఆయా పరిశ్రమలలో కొనదగిన షేర్లేమిటో ఇచ్చాం. అంతేకాక మార్కేట్ లో వినవచ్చే రకరకాల గాసిప్ లు, పుకార్లు, మట్టిలో మాణిక్యాల్లాంటి షేర్లు ఇచ్చాం. ఈ పుస్తకం మీకు -
- స్టాక్ ఎక్సేంజ్ లో వ్యవహారాలు ఎలా జరుగుతాయి?
- షేర్ అంటే, షేర్ల లక్షణాలు, బుక్ క్లోజర్, షేర్ బ్రోకర్ ని ఎలా ఎన్నుకోవాలి?
- షేర్లు ఎప్పుడు కొనాలి? ఎలా కొనాలి? ఏ ధరకు కొనాలి?
- షేర్ మార్కేట్ లో అనుసరించాల్సిన టిప్ లు, వ్యూహాలు గురించి సమగ్ర అవగాహన అందజేస్తుంది.
- కె. కిరణ్ కుమార్
మనిషి లక్ష్యం ఏమిటి? ఇందుకు ఎవరెన్ని రకాలుగా సమాధానం చెప్పినా, అసలు నిజం - మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించడమే. మనిషి బ్రతకడానికి కనీస అవసరాలయిన 'తిండి, బట్ట, నీడ' లతో పాటు మరెన్నో అవసరాలు తీరాలి. అందుకు మనిషికీ డబ్బు అవసరం. చాలీ చాలని డబ్బు వల్ల మనిషి మెరుగైన జీవన ప్రమాణాలతో జివించలేడు. ఆధునిక యుగంలో డబ్బు సంపాదించడానికి మార్గాలెన్నో ఉన్నాయి. చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం తేలికేమీ కాదు. అలాగని జూదంలో డబ్బులు వస్తాయనుకోవడం కూడా పొరపాటే! ఒక వ్యక్తీ స్వశక్తితో కళ్ళమీద నిలబడి సంపాదించాలంటే విద్యనో, చేతివృత్తినో నేర్చుకోవాలి. 'షేర్లు' లేదా స్టాక్ మార్కెట్లకు సంబంధించి కూడా అంతే! అవేమిటో వాటి ఉపయోగం ఏమిటో, వాటినెలా ఉపయోగించాలో తెలియక చాలా మంది పెదవి విరిచేస్తారు. కొందరు దానినో 'జూదం' గా భావిస్తే, మరికొందరు అదో అర్ధం కాని పద్మవ్యుహ్యంగా కొట్టిపారేస్తారు. నిజానికి స్టాక్ మార్కెట్ ని పెట్టుబడి వృద్ది చేసే సాధనంగా చేసుకోవచ్చునే సూత్రం వారు విస్మరిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ ఒక ఊబి. అందులో ఒక సారి దిగిన తర్వాత బయటకు రావడం కష్టం. అందులో డబ్బులు పోగొట్టుకొని కట్టుబట్టలతో రోడ్డుమీదపడ్డవారు చాలా మంది వున్నారు. లక్షలు సంపాదించి సురక్షితంగా బయటపడ్డవారు కొద్ది మందే వున్నారు. అందుకు కారణం ఇన్వెస్టర్ల అత్యాశ ఒక కారణం కాగా, ఓపిక లేమితనం మరో కారణం. నిజానికి ఒక ప్రణాళిక ప్రకారం మంచి షేర్లు ఎన్నిక చేసుకొని, తొందరపడకుండా నిదానంగా ఓపిక పట్టి అమ్మేవారికి నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక పద్దతి ప్రకారం ఇన్వెస్ట్ చేసి, తాము అనుకున్న ధర (రెట్టింపు లేదా కనీసం 50శాతం) పెరగగానే అమ్ముకునే వారు తప్పక విజయం సాధించగలరు. నిజానికి ఒక సంవత్సర కాలంలో మీ డబ్బు రెట్టింపు కావడం (లేదా పోవడం) అనేది ఒక్క స్టాక్ మార్కేట్ లోనే (కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో స్థలాలు మినహాయిస్తే) సంభవం. స్టాక్ మార్కేట్ లో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న ఈ రచయిత తన జీవన పదంలో ఎన్నో అనుభవాలు గడించాడు. అయితే నాణానికి రెండోవైపు ఆలోచిస్తే - తమ దగ్గర వున్న మిగులు డబ్బుని స్టాక్ మార్కేట్ లో ఫండమెంటల్స్ ఆధారంగా పెట్టి తన ఉద్యోగం, బిజినెస్ తాము చేసుకుంటూనే లక్షలు సంపాదించినవారిని చూశాడు. మొత్తం మీద ఓపికతో, కామన్ సెన్స్ తో వ్యవహరించిన వారు స్టాక్ ఎక్సేంజ్ విజేతలు అవడం సులభమే! కాబట్టి స్టాక్ మార్కేట్ లో అడుగుపెట్టడానికి ముందు మీకున్న గుణగుణాలు బేరీజు వేసుకోండి. మీరు రిస్క్ తీసుకునే లక్షణం వుందా? అదనంగా వున్న డబ్బునే మీరు వ్యాపారంలో పెడుతున్నారా? లేదా స్పెక్యులేషన్ కొస, వస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు పొందాకే అడుగుపెట్టడం ఉత్తమం. ఈ పుస్తకంలోమేము - ప్రస్తుతం ఏ పరిశ్రమలు బూమ్ లో ఉన్నాయో, ఆయా పరిశ్రమలలో కొనదగిన షేర్లేమిటో ఇచ్చాం. అంతేకాక మార్కేట్ లో వినవచ్చే రకరకాల గాసిప్ లు, పుకార్లు, మట్టిలో మాణిక్యాల్లాంటి షేర్లు ఇచ్చాం. ఈ పుస్తకం మీకు - - స్టాక్ ఎక్సేంజ్ లో వ్యవహారాలు ఎలా జరుగుతాయి? - షేర్ అంటే, షేర్ల లక్షణాలు, బుక్ క్లోజర్, షేర్ బ్రోకర్ ని ఎలా ఎన్నుకోవాలి? - షేర్లు ఎప్పుడు కొనాలి? ఎలా కొనాలి? ఏ ధరకు కొనాలి? - షేర్ మార్కేట్ లో అనుసరించాల్సిన టిప్ లు, వ్యూహాలు గురించి సమగ్ర అవగాహన అందజేస్తుంది. - కె. కిరణ్ కుమార్this book provide primary information about stock market,this is very usefull for new commers kiran kumar is the best writter , i purchased nearly 15 books about stock market mutual funds incometax and money related books writted by kiran kumar I give 95 percent rating to kiran kumar books. Why iam not giving 100 perbent rating, because some book contain priwmting errors and out of date
© 2017,www.logili.com All Rights Reserved.