యోగశాస్త్రము ఆది కాలంలో మానవుడు ఆరోగ్యమును కాపాడుకొనుటకు, దీర్ఘకాలము జీవించుటకు ఉపయోగపడుతుందని తెలుసుకొని దానిని సాధన చేసి తమ జీవితములో వచ్చు సర్వరోగములను నివారించుకొనెడివారు.
శ్రీ సోమనాధ మహర్షిగారి మనోయోగం ప్రచారమగుట చూడడం జరిగింది. వారి దగ్గరకు వెళ్లి నా ఆరోగ్యపరిస్థితి వివరించగా అందుకు వారు నీ వ్యాధులు అన్ని నయమగును రమ్మని చెప్పిరి. అచటికి పోయి మూడు నెలలు మనోయోగం అభ్యసించినాను. వ్యాధులు క్రమక్రమంగా తగ్గు ముఖం పట్టుచుండెను. ఇంకా ప్రాణాయామం, యోగాసనాలు నేర్చుకున్నాను. శ్రీ సుధాకర గురూజీ(భిష్మజి) వద్ద సిద్ధ సమాధి యోగ, కళ్యాణదుర్గం శ్రీ నాగరాజు గురూజీ వద్ద ముఖ్యమైన ప్రాణాయామములు ఆసనములు అభ్యసించితిని మరియు హంపికి తుంగభద్రనది అవతల వున్న ఋశ్యమూక పర్వతము ఉన్నది. అచట క్రియాయోగం (బ్రహ్మ విద్య) నేర్చుకున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యము కుదుటపడింది. ఇంగ్లీషులో ఒక సామెత వున్నది "Practice before you preach" అంటే బోధించడానికి ముందు ఆచరించాలి.
కాబట్టి యోగము చాలా గొప్పది. యోగము వలన సంపూర్ణమైన జీవితము లభించును. జీవితం క్రమ శిక్షణా బద్ద మగును.
ఈనాటి ఆధునికకాలంలో వారి వారి వృత్తులలో ప్రతి వాడు సతమతమగు చున్నాడు. సమయం చాలక ఇబ్బందులు పడుచున్నారు. ఇటువంటి వారు కనీసం రోజుకు ఒక గంట కాలమైన తమ ఆరోగ్యంకొరకు సమయం కేటాయించాలి. దీని వలన వృత్తివికాసం, సంసార బాధ్యతలతో ఆనందము, దాంపత్య సౌఖ్యము లభించును. సుఖ జీవనాన్ని గడిపే అవకాశం వస్తుంది. దేహారోగ్యము లేనిదే ఏకార్యము చేయలేము. ఆరోగ్యమే మహాభాగ్యము.
ముఖ్యముగా నేటి విద్యార్ధినీ, విద్యార్ధులకు ఈ యోగ విద్య వల్ల చాలా ఉపయోగం ఉంది. క్రమ శిక్షణ కల్గును. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి పరిక్షలలో బాగుగా వ్రాయగలరు. వారికి రోగనిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యవంతులుగా, శక్తి వంతులుగా నుండగలరు.
ఈ యోగ విద్యను ఏ మతము వారైనా, ఏకులము వారైనా, ఏ వయస్సు వారైనా పురుషులైనా, స్త్రీలైనా, బలహినులైనా, రోగగ్రస్తులైనా, బద్దకించ కుండా యోగాభ్యాసము చేస్తే ఆరోగ్యవంతులగుటమే గాక, సిద్ధి కూడా కల్గుతుంది. ఈ యోగము వల్ల దీర్ఘ వ్యాధులైనా షుగరు, బి.పి. ఆస్మా, క్షయ మొదలగు దీర్ఘ వ్యాధులు అదుపులోకీ వచ్చును.
- కంచం పుల్లారెడ్డి
యోగశాస్త్రము ఆది కాలంలో మానవుడు ఆరోగ్యమును కాపాడుకొనుటకు, దీర్ఘకాలము జీవించుటకు ఉపయోగపడుతుందని తెలుసుకొని దానిని సాధన చేసి తమ జీవితములో వచ్చు సర్వరోగములను నివారించుకొనెడివారు. శ్రీ సోమనాధ మహర్షిగారి మనోయోగం ప్రచారమగుట చూడడం జరిగింది. వారి దగ్గరకు వెళ్లి నా ఆరోగ్యపరిస్థితి వివరించగా అందుకు వారు నీ వ్యాధులు అన్ని నయమగును రమ్మని చెప్పిరి. అచటికి పోయి మూడు నెలలు మనోయోగం అభ్యసించినాను. వ్యాధులు క్రమక్రమంగా తగ్గు ముఖం పట్టుచుండెను. ఇంకా ప్రాణాయామం, యోగాసనాలు నేర్చుకున్నాను. శ్రీ సుధాకర గురూజీ(భిష్మజి) వద్ద సిద్ధ సమాధి యోగ, కళ్యాణదుర్గం శ్రీ నాగరాజు గురూజీ వద్ద ముఖ్యమైన ప్రాణాయామములు ఆసనములు అభ్యసించితిని మరియు హంపికి తుంగభద్రనది అవతల వున్న ఋశ్యమూక పర్వతము ఉన్నది. అచట క్రియాయోగం (బ్రహ్మ విద్య) నేర్చుకున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యము కుదుటపడింది. ఇంగ్లీషులో ఒక సామెత వున్నది "Practice before you preach" అంటే బోధించడానికి ముందు ఆచరించాలి. కాబట్టి యోగము చాలా గొప్పది. యోగము వలన సంపూర్ణమైన జీవితము లభించును. జీవితం క్రమ శిక్షణా బద్ద మగును. ఈనాటి ఆధునికకాలంలో వారి వారి వృత్తులలో ప్రతి వాడు సతమతమగు చున్నాడు. సమయం చాలక ఇబ్బందులు పడుచున్నారు. ఇటువంటి వారు కనీసం రోజుకు ఒక గంట కాలమైన తమ ఆరోగ్యంకొరకు సమయం కేటాయించాలి. దీని వలన వృత్తివికాసం, సంసార బాధ్యతలతో ఆనందము, దాంపత్య సౌఖ్యము లభించును. సుఖ జీవనాన్ని గడిపే అవకాశం వస్తుంది. దేహారోగ్యము లేనిదే ఏకార్యము చేయలేము. ఆరోగ్యమే మహాభాగ్యము. ముఖ్యముగా నేటి విద్యార్ధినీ, విద్యార్ధులకు ఈ యోగ విద్య వల్ల చాలా ఉపయోగం ఉంది. క్రమ శిక్షణ కల్గును. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి పరిక్షలలో బాగుగా వ్రాయగలరు. వారికి రోగనిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యవంతులుగా, శక్తి వంతులుగా నుండగలరు. ఈ యోగ విద్యను ఏ మతము వారైనా, ఏకులము వారైనా, ఏ వయస్సు వారైనా పురుషులైనా, స్త్రీలైనా, బలహినులైనా, రోగగ్రస్తులైనా, బద్దకించ కుండా యోగాభ్యాసము చేస్తే ఆరోగ్యవంతులగుటమే గాక, సిద్ధి కూడా కల్గుతుంది. ఈ యోగము వల్ల దీర్ఘ వ్యాధులైనా షుగరు, బి.పి. ఆస్మా, క్షయ మొదలగు దీర్ఘ వ్యాధులు అదుపులోకీ వచ్చును. - కంచం పుల్లారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.