ప్రజా వినోద సాధనాలైన తోలుబొమ్మలాట, బుర్రకధ, యక్షగానాలు, ఒగ్గు కధలు, చారిత్రక, పౌరాణిక నాటకాల యుగం 1940 వరకు తెలుగు నాట నడిచింది. ఆ తర్వాత చలనచిత్ర రంగం అంతా తానెయై విజ్రుంభించింది. తదితర జానపద కళారూపాలు మరుగునపడ్డాయి. ఆర్ధిక లాభం కోసం నటీనటులు, మేధావులు, కవులూ, పండితులూ సినిమా బాట పట్టారు. ముందు కళాత్మకరంగంగా ఉన్న సినిమా క్రమంగా వ్యాపార రంగంగా, భారీ పరిశ్రమగా మారింది. ఈ పరిణామ క్రమంలో కొందరు బాగుపడినా ఎందరో నలిగిపోయారు. ఆ విధంగా ఒక రచయిత సినీ పరిశ్రమలోకి చేరితే ఎదురైన సమస్యలేమిటి? వాటి పరిణామాలేమిటి? నిర్మోగమాటంగా నగ్నంగా, ఉద్విగ్నంగా చెప్పిన నవల "వంశధార"
మర్యాదకోసం ఇందులో పేర్లు మార్చినా ఇదంతా యదార్ధ వ్యదార్ధ కధనమే. తెరమీద మెరుపుల కధ వెనుక ఉన్న కధ చప్పట్లు - దుప్పట్లు సన్మానాల వెనుక దాగిన కఠొర కళా వాస్తవాలు మన రచయితల భయంకర జీవితాలు - ఇదే వంశధార నవల.
చదవండి - చదివించండి!
ఇది చారిత్రక నవలా చక్రవర్తి 73వ సంవత్సరం
ఇది వారి 83 వ రచన.
ప్రజా వినోద సాధనాలైన తోలుబొమ్మలాట, బుర్రకధ, యక్షగానాలు, ఒగ్గు కధలు, చారిత్రక, పౌరాణిక నాటకాల యుగం 1940 వరకు తెలుగు నాట నడిచింది. ఆ తర్వాత చలనచిత్ర రంగం అంతా తానెయై విజ్రుంభించింది. తదితర జానపద కళారూపాలు మరుగునపడ్డాయి. ఆర్ధిక లాభం కోసం నటీనటులు, మేధావులు, కవులూ, పండితులూ సినిమా బాట పట్టారు. ముందు కళాత్మకరంగంగా ఉన్న సినిమా క్రమంగా వ్యాపార రంగంగా, భారీ పరిశ్రమగా మారింది. ఈ పరిణామ క్రమంలో కొందరు బాగుపడినా ఎందరో నలిగిపోయారు. ఆ విధంగా ఒక రచయిత సినీ పరిశ్రమలోకి చేరితే ఎదురైన సమస్యలేమిటి? వాటి పరిణామాలేమిటి? నిర్మోగమాటంగా నగ్నంగా, ఉద్విగ్నంగా చెప్పిన నవల "వంశధార" మర్యాదకోసం ఇందులో పేర్లు మార్చినా ఇదంతా యదార్ధ వ్యదార్ధ కధనమే. తెరమీద మెరుపుల కధ వెనుక ఉన్న కధ చప్పట్లు - దుప్పట్లు సన్మానాల వెనుక దాగిన కఠొర కళా వాస్తవాలు మన రచయితల భయంకర జీవితాలు - ఇదే వంశధార నవల. చదవండి - చదివించండి! ఇది చారిత్రక నవలా చక్రవర్తి 73వ సంవత్సరం ఇది వారి 83 వ రచన.© 2017,www.logili.com All Rights Reserved.