"ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?" అని ప్రశ్నించింది. శ్రీలేఖ.
"ఏమే సీతలా, సావిత్రిలా ధర్మోపదేశాలు చేస్తున్నావు?"
"అనవసరంగా పౌరాణికపు పోలికలు వద్దు. నేను సీతనైతే, నీవు రావుణుడివి కావలసివస్తుంది."
"ఓరోరి! ధాన్యకటకపు వన్నెల చిలక కూనిరాగాలు పాడుతుందిరా! దీనిని కట్టేసి మనం జరపబోయే సింహక్రీడలో ఆహారంగా పడేయండి"
"రసవత్తరమైన ఇటువంటి సంభాషణలతో నిండిన ఈ చారిత్రక నవల క్రీ.పూ.200సంవత్సరాలకు పూర్వం నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి (ధాన్యకటకము) రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గాధ.
- ముదిగొండ శివప్రసాద్
"ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?" అని ప్రశ్నించింది. శ్రీలేఖ. "ఏమే సీతలా, సావిత్రిలా ధర్మోపదేశాలు చేస్తున్నావు?" "అనవసరంగా పౌరాణికపు పోలికలు వద్దు. నేను సీతనైతే, నీవు రావుణుడివి కావలసివస్తుంది." "ఓరోరి! ధాన్యకటకపు వన్నెల చిలక కూనిరాగాలు పాడుతుందిరా! దీనిని కట్టేసి మనం జరపబోయే సింహక్రీడలో ఆహారంగా పడేయండి" "రసవత్తరమైన ఇటువంటి సంభాషణలతో నిండిన ఈ చారిత్రక నవల క్రీ.పూ.200సంవత్సరాలకు పూర్వం నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి (ధాన్యకటకము) రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గాధ. - ముదిగొండ శివప్రసాద్
© 2017,www.logili.com All Rights Reserved.