'పూలచెట్లు' అనే ఈ పుస్తకం సామాన్యపాఠకులను ఉద్దేశించి వ్రాసిన వారు డా.ఎమ్.ఎస్. రంధావా. భారతదేశంలో సామాన్యంగా కనిపించే పూలచెట్లను గూర్చిన వర్ణన మాత్రమే కాక, ఇంటివద్ద, నగరాలలో ప్రకృతి పరిసరాలకు అనుగుణంగా ఎలా మలచుకోవాలో కూడా ఈ పుస్తకంలో వివరింపబడినాయి. ఇందుకు సంబంధించిన భావాలు ఆయన చాల సంవత్సరాల పరిశీలన వల్ల తేలినవి. చండిగడ్ లో ప్రయోగించిచూచినవి. అక్కడ ఈ గ్రంధకర్త 'లాండ్స్కేప్ కమిటీ చైర్మన్' గాను, 'చీఫ్ కమీషనర్' గాను ఉండేవారు. దేశాన్ని సుందరతరం చేసే ఆశయంతో చెట్లను, పుట్టలను పెంచేందుకు ఈ పధకం అవసరమైంది. భారతీయ వ్యవసాయాభివృద్ధికీ వీరెంతో తోడ్పడ్డారు.
డా. రంధావా(రచయిత) :
డా.రంధావా ఇంగ్లిషు, హిందీ, పంజాబీ, భాషల్లో సైన్స్, కళలు, సంస్కృతీ, పహరీ మినియేచర్ పెయింటింగ్స్ మొదలైన వాటి గురించి దాదాపు 30పుస్తకాలు రాశారు. ఈయన శాస్త్రీయ విజ్ఞానాన్ని కళాభిరుచితో సమ్మిళితం చేసిన అసాధారణ వ్యక్తీ. భారత, సాంస్కృతిక సంప్రదాయం, సౌందర్య పిపాస వీరికి లలిత కళలపై, సంస్కృతీపై ఆసక్తి కలిగించింది. పంటల మీద, పండ్ల చెట్లమీద ఎన్నో పుస్తకాలు, కరపత్రాలు వ్రాసారాయన. ఈ పూలచెట్ల పై పుస్తకం వారి వృక్ష పరిజ్ఞాన ఆధిక్యాన్ని, ప్రకృతి ప్రేమను వేనోళ్ళ చాటుతుంది.
- ఎమ్.ఎస్. రంధావా
'పూలచెట్లు' అనే ఈ పుస్తకం సామాన్యపాఠకులను ఉద్దేశించి వ్రాసిన వారు డా.ఎమ్.ఎస్. రంధావా. భారతదేశంలో సామాన్యంగా కనిపించే పూలచెట్లను గూర్చిన వర్ణన మాత్రమే కాక, ఇంటివద్ద, నగరాలలో ప్రకృతి పరిసరాలకు అనుగుణంగా ఎలా మలచుకోవాలో కూడా ఈ పుస్తకంలో వివరింపబడినాయి. ఇందుకు సంబంధించిన భావాలు ఆయన చాల సంవత్సరాల పరిశీలన వల్ల తేలినవి. చండిగడ్ లో ప్రయోగించిచూచినవి. అక్కడ ఈ గ్రంధకర్త 'లాండ్స్కేప్ కమిటీ చైర్మన్' గాను, 'చీఫ్ కమీషనర్' గాను ఉండేవారు. దేశాన్ని సుందరతరం చేసే ఆశయంతో చెట్లను, పుట్టలను పెంచేందుకు ఈ పధకం అవసరమైంది. భారతీయ వ్యవసాయాభివృద్ధికీ వీరెంతో తోడ్పడ్డారు. డా. రంధావా(రచయిత) : డా.రంధావా ఇంగ్లిషు, హిందీ, పంజాబీ, భాషల్లో సైన్స్, కళలు, సంస్కృతీ, పహరీ మినియేచర్ పెయింటింగ్స్ మొదలైన వాటి గురించి దాదాపు 30పుస్తకాలు రాశారు. ఈయన శాస్త్రీయ విజ్ఞానాన్ని కళాభిరుచితో సమ్మిళితం చేసిన అసాధారణ వ్యక్తీ. భారత, సాంస్కృతిక సంప్రదాయం, సౌందర్య పిపాస వీరికి లలిత కళలపై, సంస్కృతీపై ఆసక్తి కలిగించింది. పంటల మీద, పండ్ల చెట్లమీద ఎన్నో పుస్తకాలు, కరపత్రాలు వ్రాసారాయన. ఈ పూలచెట్ల పై పుస్తకం వారి వృక్ష పరిజ్ఞాన ఆధిక్యాన్ని, ప్రకృతి ప్రేమను వేనోళ్ళ చాటుతుంది. - ఎమ్.ఎస్. రంధావా
© 2017,www.logili.com All Rights Reserved.