కవిత్వం ఎందుకు.. ఎలా పుడుతుందో పూర్తిగా ఎవ్వరూ నిర్వచించలేరు. నేను కవి కావాలనుకుని ప్రయత్నించలేదు. దాని స్వరూప స్వభావాలు కూడా తెలిసీ తెలియని పాఠశాల వయసులో ఏవేవో భావాలు అల్లుకున్నాను. లోగడ చాలాసార్లు చెప్పినట్లు నేను పెరిగిన బాపట్ల, అక్కడి సాహితీకారులు, మా నాన్నగారు, నా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు, మా ఇంటి వాతావరణం, నేను చదివిన మా ఇంటి గ్రంథాలయం ఇవన్నీ నా చేత కలం పట్టించాయి.
కవిత్వం నా అభిరుచి మాత్రమే కాదు... ఆక్సిజన్, రక్తప్రసరణ కూడా! వైయక్తిక దశనుండి సామాజికత వైపు ప్రయాణించే క్రమంలో ఏ కవి అయినా ప్రతిక్షణం దగ్ధమవుతూనే ఉంటాడు. మనచుట్టూ ఉన్న సమాజమే కవిత్వ మవుతుంది. కవిత్వంలో కవి గుండె కొట్టుకుంటుంది. అలా రాసే నిజాయితీవల్లే కవి సామాజిక బాధ్యత నిరూపితమౌతుందని నేను నమ్ముతాను. తెలుగులో అనేక ప్రక్రియలైన కవిత్వం, కథ, వ్యాసం, నాటకం, నాటిక, రూపకం, గేయం, నవల, బాలసాహిత్యం , నియో సాహిత్యం , అనువాదాలు, జీవితచరిత్రలు వస్తున్నానా జీవితం వెలుగుతున్నది కవిత్వం ప్రాణవాయువుతోనే! తపన, ఆరాటం, ధ్యాసతో అక్షరాలలో జ్వలిస్తున్నాను. నేను జీవిస్తున్నాననే స్పృహ ఉన్నంతకాలం రాస్తూనే ఉంటాను.
కవిత్వం ఎందుకు.. ఎలా పుడుతుందో పూర్తిగా ఎవ్వరూ నిర్వచించలేరు. నేను కవి కావాలనుకుని ప్రయత్నించలేదు. దాని స్వరూప స్వభావాలు కూడా తెలిసీ తెలియని పాఠశాల వయసులో ఏవేవో భావాలు అల్లుకున్నాను. లోగడ చాలాసార్లు చెప్పినట్లు నేను పెరిగిన బాపట్ల, అక్కడి సాహితీకారులు, మా నాన్నగారు, నా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు, మా ఇంటి వాతావరణం, నేను చదివిన మా ఇంటి గ్రంథాలయం ఇవన్నీ నా చేత కలం పట్టించాయి. కవిత్వం నా అభిరుచి మాత్రమే కాదు... ఆక్సిజన్, రక్తప్రసరణ కూడా! వైయక్తిక దశనుండి సామాజికత వైపు ప్రయాణించే క్రమంలో ఏ కవి అయినా ప్రతిక్షణం దగ్ధమవుతూనే ఉంటాడు. మనచుట్టూ ఉన్న సమాజమే కవిత్వ మవుతుంది. కవిత్వంలో కవి గుండె కొట్టుకుంటుంది. అలా రాసే నిజాయితీవల్లే కవి సామాజిక బాధ్యత నిరూపితమౌతుందని నేను నమ్ముతాను. తెలుగులో అనేక ప్రక్రియలైన కవిత్వం, కథ, వ్యాసం, నాటకం, నాటిక, రూపకం, గేయం, నవల, బాలసాహిత్యం , నియో సాహిత్యం , అనువాదాలు, జీవితచరిత్రలు వస్తున్నానా జీవితం వెలుగుతున్నది కవిత్వం ప్రాణవాయువుతోనే! తపన, ఆరాటం, ధ్యాసతో అక్షరాలలో జ్వలిస్తున్నాను. నేను జీవిస్తున్నాననే స్పృహ ఉన్నంతకాలం రాస్తూనే ఉంటాను.© 2017,www.logili.com All Rights Reserved.