వ్యాధి హేతువులను లక్షణములను వివరించుభాగమును నిదానశబ్ధముచే వ్యవహరించి, అట్టికష్టములు తొలగించుటకై మాధవకరు డను విద్వద్వైద్య వరుడు ఆయాతంత్రముల యందు గల రోగనిదానముల నన్నింటిని సంగ్రహించి యనేక గ్రంధముల జదువు ప్రయాసము లేక ఒక గ్రంధము చేతనే నిదానముల నన్నింటిని సులభముగ తెలిసికొన వలనుపడునట్లు ఒక్కెడజేర్చి, యాగ్రంధము తనపేర వెలయునట్లు మాధవనిదాన మను గ్రంధమును రచించెను.
ఈ గ్రంధమున సధ్యాయములకు బదులుగ నాయారోగముల పేరిట జ్వరనిదానము, అతిసారనిదానము మున్నగు సాంకేతికపదముల చేతనే ఆయాప్రకరణములు విభజింపబడినవి. అందు మొదటి ప్రకరణము పంచనిదానలక్షణము, ఇందు నిదానపదవాచ్యములగు నిదాన - పూర్వరూప - రూప - ఉపశయ - సంప్రాప్తు లైదిటికిని వేరు వేరు లక్షణములు వివరింపబడినవి. ఈ నిదానాదిపంచకమును జ్వరాదిరోగము లన్నిటి యందు రోగముల గుర్తింప సాధనములై సామాన్యముగ నుండును కావున వ్యాపకమైనది. కావుననే వాగ్భటాచార్యులు "అధాత స్సర్వరోగనిదానం వ్యాఖ్యాస్యాము" అని యుపక్రమించి తొలుత పంచనిదానలక్షణముల వివరించెను. చరకాదులును రోగసామాన్యముగ నుండు నిదానాదిపంచకమును తొలుత వివరించి తక్కిన రోగముల వరుసగా వివరించిరి.
వ్యాధి హేతువులను లక్షణములను వివరించుభాగమును నిదానశబ్ధముచే వ్యవహరించి, అట్టికష్టములు తొలగించుటకై మాధవకరు డను విద్వద్వైద్య వరుడు ఆయాతంత్రముల యందు గల రోగనిదానముల నన్నింటిని సంగ్రహించి యనేక గ్రంధముల జదువు ప్రయాసము లేక ఒక గ్రంధము చేతనే నిదానముల నన్నింటిని సులభముగ తెలిసికొన వలనుపడునట్లు ఒక్కెడజేర్చి, యాగ్రంధము తనపేర వెలయునట్లు మాధవనిదాన మను గ్రంధమును రచించెను. ఈ గ్రంధమున సధ్యాయములకు బదులుగ నాయారోగముల పేరిట జ్వరనిదానము, అతిసారనిదానము మున్నగు సాంకేతికపదముల చేతనే ఆయాప్రకరణములు విభజింపబడినవి. అందు మొదటి ప్రకరణము పంచనిదానలక్షణము, ఇందు నిదానపదవాచ్యములగు నిదాన - పూర్వరూప - రూప - ఉపశయ - సంప్రాప్తు లైదిటికిని వేరు వేరు లక్షణములు వివరింపబడినవి. ఈ నిదానాదిపంచకమును జ్వరాదిరోగము లన్నిటి యందు రోగముల గుర్తింప సాధనములై సామాన్యముగ నుండును కావున వ్యాపకమైనది. కావుననే వాగ్భటాచార్యులు "అధాత స్సర్వరోగనిదానం వ్యాఖ్యాస్యాము" అని యుపక్రమించి తొలుత పంచనిదానలక్షణముల వివరించెను. చరకాదులును రోగసామాన్యముగ నుండు నిదానాదిపంచకమును తొలుత వివరించి తక్కిన రోగముల వరుసగా వివరించిరి.© 2017,www.logili.com All Rights Reserved.