"ఒరేయ్ శివుడూ...."
ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు శివుడు.
అతని వయసువాళ్ళే ఆరుగురు బాలకులు నిలబడి వున్నారు
ఒక చెట్టు క్రింద. నోటిలోని దంతాలన్నీ బయటకి కనిపించేటట్లు నవ్వుకుంటున్నారు.
"ఎందుకు పిలిచారు నన్ను?" ఆ నవ్వుల్ని తాను గమనించనట్లు అమాయకంగా అడిగాడు శివుడు
"మీ నాన్న పేరేమిటిరా?" అడిగాడు అతన్ని పిలిచిన బాలుడు.
చెంపమీద లాగిపెట్టి కొట్టినట్టు అయింది శివుడికి, అతనికి తెలియకుండానే బిగుసుకున్నాయి పిడికిళ్ళు. ఎరుపురంగుకు తిరిగాయి కళ్ళు.
"అబ్బో... శివుడికి కోపం వచ్చేస్తోందిరా... తల్లిపేరు కూడా అడిగితే మూడోకన్ను తెరచి మనందర్నీ భస్మం చేసేస్తాడు. ఏం చేద్దాం? అడుగుదామా వద్దా?" నవ్వుతూనే పక్కకు తిరిగి తోటి బాలుర్ని అడిగాడు ఆ బాలుడు.
"అడుగు... అడుగు..." ఆనందంగా ప్రోత్సహించారు వాళ్ళు.
"మీ తల్లిగారి పేరేమిటిరా?" అడగనే అడిగాడు ఆ బాలుడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి శివుడు నవల. నవ్య వీక్లీలో ధారావాహిక వెలువడిన శివుడు ఇప్పుడు నవల రూపంలో మీ ముందుకు వచ్చింది.
- మధుబాబు
"ఒరేయ్ శివుడూ...." ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు శివుడు. అతని వయసువాళ్ళే ఆరుగురు బాలకులు నిలబడి వున్నారు ఒక చెట్టు క్రింద. నోటిలోని దంతాలన్నీ బయటకి కనిపించేటట్లు నవ్వుకుంటున్నారు. "ఎందుకు పిలిచారు నన్ను?" ఆ నవ్వుల్ని తాను గమనించనట్లు అమాయకంగా అడిగాడు శివుడు "మీ నాన్న పేరేమిటిరా?" అడిగాడు అతన్ని పిలిచిన బాలుడు. చెంపమీద లాగిపెట్టి కొట్టినట్టు అయింది శివుడికి, అతనికి తెలియకుండానే బిగుసుకున్నాయి పిడికిళ్ళు. ఎరుపురంగుకు తిరిగాయి కళ్ళు. "అబ్బో... శివుడికి కోపం వచ్చేస్తోందిరా... తల్లిపేరు కూడా అడిగితే మూడోకన్ను తెరచి మనందర్నీ భస్మం చేసేస్తాడు. ఏం చేద్దాం? అడుగుదామా వద్దా?" నవ్వుతూనే పక్కకు తిరిగి తోటి బాలుర్ని అడిగాడు ఆ బాలుడు. "అడుగు... అడుగు..." ఆనందంగా ప్రోత్సహించారు వాళ్ళు. "మీ తల్లిగారి పేరేమిటిరా?" అడగనే అడిగాడు ఆ బాలుడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి శివుడు నవల. నవ్య వీక్లీలో ధారావాహిక వెలువడిన శివుడు ఇప్పుడు నవల రూపంలో మీ ముందుకు వచ్చింది. - మధుబాబు© 2017,www.logili.com All Rights Reserved.