గతం, వర్తమానం, భవిష్యత్తుల అనుసంధానమే మనిషి జీవనయానం. దాటిపోయిన గతాన్ని గుర్తుంచుకుంటూ, వర్తమానంలో జరిగేవాటిని దృష్టిలో ఉంచుకుంటూ, భవిష్యత్తులోకి సాలోచన చేయగలగటానికి అసలైన కీలకం, అద్భుతమైన శక్తి 'జ్ఞాపకం'. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలకు కూడా జ్ఞాపకమే మూలం. అసలే విషయమూ గుర్తురాని పరిస్థితిని ఊహించుకోండి. అమ్మో, అంతా అస్తవ్యస్తం, గందరగోళం, చిన్న చిన్న విషయాలనుంచి, పెద్ద పెద్ద విషయాల వరకు జ్ఞాపకంతోనే ముడిపడి ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో మరుపు ఒక 'వరం' అని కూడా అనుకుంటాం. అది ఎలాంటప్పుడు అంటే ఆ విషయాలు మనకు బాధను, కష్టాన్ని నష్టాన్ని కలిగించేవి అయినప్పుడు మాత్రమే.
జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, చదివినప్పుడు బాగానే ఉంటుంది. పరీక్ష హల్లో మాత్రం గుర్తు రావు, మొహం చుస్తే ఎప్పుడో చూసినట్లే వుంది. కానీ పేరేమిటో ఎంతకూ గుర్తురాదు, తాళ్ళం చెవి గుర్తుగానే పెట్టా - కానీ గుర్తురావడంలేదు. వంటి స్వగతాలు ఎన్నో సందర్భాల్లో అందరికీ అనుభవంలోకి వచ్చేవే. అయితే అసలీ జ్ఞాపకశక్తి అంటే ఏమిటి? శాస్త్రీయంగా అది పనిచేసే తీరు తెన్ను తెలసుకోవటం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాదు, అన్నిటా పోటి పెరిగిన నేటి కాలంలో ఈ విషయాల పట్ల అవగాహన ఎంతో అవసరం కూడా. ఇటువంటి పలు ఆసక్తికరమైన విషయాలు గురించి, జ్ఞాపకశక్తి మెమరి పవర్ పెంచుకునే పద్ధతులు, మార్గాలు గురించి తెలియజేయడం జరిగింది.
- మధురా శివపుత్ర
గతం, వర్తమానం, భవిష్యత్తుల అనుసంధానమే మనిషి జీవనయానం. దాటిపోయిన గతాన్ని గుర్తుంచుకుంటూ, వర్తమానంలో జరిగేవాటిని దృష్టిలో ఉంచుకుంటూ, భవిష్యత్తులోకి సాలోచన చేయగలగటానికి అసలైన కీలకం, అద్భుతమైన శక్తి 'జ్ఞాపకం'. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలకు కూడా జ్ఞాపకమే మూలం. అసలే విషయమూ గుర్తురాని పరిస్థితిని ఊహించుకోండి. అమ్మో, అంతా అస్తవ్యస్తం, గందరగోళం, చిన్న చిన్న విషయాలనుంచి, పెద్ద పెద్ద విషయాల వరకు జ్ఞాపకంతోనే ముడిపడి ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో మరుపు ఒక 'వరం' అని కూడా అనుకుంటాం. అది ఎలాంటప్పుడు అంటే ఆ విషయాలు మనకు బాధను, కష్టాన్ని నష్టాన్ని కలిగించేవి అయినప్పుడు మాత్రమే. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, చదివినప్పుడు బాగానే ఉంటుంది. పరీక్ష హల్లో మాత్రం గుర్తు రావు, మొహం చుస్తే ఎప్పుడో చూసినట్లే వుంది. కానీ పేరేమిటో ఎంతకూ గుర్తురాదు, తాళ్ళం చెవి గుర్తుగానే పెట్టా - కానీ గుర్తురావడంలేదు. వంటి స్వగతాలు ఎన్నో సందర్భాల్లో అందరికీ అనుభవంలోకి వచ్చేవే. అయితే అసలీ జ్ఞాపకశక్తి అంటే ఏమిటి? శాస్త్రీయంగా అది పనిచేసే తీరు తెన్ను తెలసుకోవటం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాదు, అన్నిటా పోటి పెరిగిన నేటి కాలంలో ఈ విషయాల పట్ల అవగాహన ఎంతో అవసరం కూడా. ఇటువంటి పలు ఆసక్తికరమైన విషయాలు గురించి, జ్ఞాపకశక్తి మెమరి పవర్ పెంచుకునే పద్ధతులు, మార్గాలు గురించి తెలియజేయడం జరిగింది. - మధురా శివపుత్ర
© 2017,www.logili.com All Rights Reserved.