మన మెదడులో ఉండే జ్ఞాపకాల పొరల్ని ఒక పెద్ద పుస్తకాల అల్మారాతో పోల్చవచ్చు. ఆ పుస్తకాల్ని మనం ఉపయోగించకపోతే అంటే చదవకపోతే ఆ అల్మారాలో ఏ సమాచారం ఏ జ్ఞానం ఉందో మనకు తెలియదు. ఎన్నాళ్ళకు అసలు ఉపయోగించకపోతే ఆ అల్మారా ఓ జ్ఞాన పేటికలా కాక ఓ గోడలా ఓ బల్లలా మిగిలిపోతుంది. ఆ పుస్తకాలు నిరుపయోగమైపోతాయి. పుస్తకాల అట్టలు చిరిగిపోవటం లేక చెదలు పట్టటం లాంటిది జరిగితే, అసలు అల్మారాలో ఏ తరహా జ్ఞానం ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మన మెదడులోని జ్ఞాపకాల విషయం కూడా అంతే! వాటిని అప్పుడప్పుడూ ఉపయోగించకపోతే కాలక్రమాన ఆ జ్ఞానం లేక సమాచారం నిర్జీవమైపోయి మనకు మిగలకుండా పోతుంది! జ్ఞాపకశక్తి గురించి తెలుసుకోబోయే ముందు మీ జ్ఞాపకశక్తి ఏ తీరున ఉందో దానిని ఎంతవరకూ నమ్మవచ్చునో తెలుసుకోవటం మంచిది. ఈ పుస్తకంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పటం ద్వారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.
మన మెదడులో ఉండే జ్ఞాపకాల పొరల్ని ఒక పెద్ద పుస్తకాల అల్మారాతో పోల్చవచ్చు. ఆ పుస్తకాల్ని మనం ఉపయోగించకపోతే అంటే చదవకపోతే ఆ అల్మారాలో ఏ సమాచారం ఏ జ్ఞానం ఉందో మనకు తెలియదు. ఎన్నాళ్ళకు అసలు ఉపయోగించకపోతే ఆ అల్మారా ఓ జ్ఞాన పేటికలా కాక ఓ గోడలా ఓ బల్లలా మిగిలిపోతుంది. ఆ పుస్తకాలు నిరుపయోగమైపోతాయి. పుస్తకాల అట్టలు చిరిగిపోవటం లేక చెదలు పట్టటం లాంటిది జరిగితే, అసలు అల్మారాలో ఏ తరహా జ్ఞానం ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మన మెదడులోని జ్ఞాపకాల విషయం కూడా అంతే! వాటిని అప్పుడప్పుడూ ఉపయోగించకపోతే కాలక్రమాన ఆ జ్ఞానం లేక సమాచారం నిర్జీవమైపోయి మనకు మిగలకుండా పోతుంది! జ్ఞాపకశక్తి గురించి తెలుసుకోబోయే ముందు మీ జ్ఞాపకశక్తి ఏ తీరున ఉందో దానిని ఎంతవరకూ నమ్మవచ్చునో తెలుసుకోవటం మంచిది. ఈ పుస్తకంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పటం ద్వారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.© 2017,www.logili.com All Rights Reserved.