కులవ్యవస్థ సమాజ అభివృద్ధికి ఆటంకంగా పరిణమించింది. శ్రామికులకు చదువు నిషేధం సోమరులకు మాత్రమే చదువుకొనే అవకాశముండటం వలన శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం వెనుకపడ్డది. ప్రపంచవ్యాప్తంగా శ్రమ విభజనే ప్రధానంగా వుంటే, భారతసమాజంలో మాత్రం కులవ్యవస్థ ఫలితంగా శ్రమ విభజనే కాకుండా శ్రామికుల మధ్య విభజన జరిగింది. అది శ్రామిక వర్గ ఐక్యతకు విఘాతంగా మారింది. కులవ్యవస్థ దోపిడి వర్గాలకు పెట్టిన కోటవలె వుంది. కులం అగ్రకుల దోపిడి వర్గాలకు ఒకపరంగా వుంటే పీడిత, అణగారిన కులాలకొక శాపంగా పరిణమించింది. ఇలాంటి వాస్తవాలెన్నో సి వి రచనలు చదివితే మనకు బోధపడుతాయి.
భారతీయ సమాజాన్ని కేవలం ఆర్ధికకోణం నుండో, రాజకీయకోణం నుండో చెప్పడం జరిగింది. కాని సామాజికకోణం నుండి రాసిన ఈ "మధ్య యుగాల్లో కులవ్యవస్థ" పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దీనిని కూడ చదివితేనే చరిత్ర అధ్యయనానికొక పరిపూర్ణత వస్తుందని నేను భావిస్తున్నాను. చరిత్రను అధ్యయనం చేయదలచుకున్న వారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
కులవ్యవస్థ సమాజ అభివృద్ధికి ఆటంకంగా పరిణమించింది. శ్రామికులకు చదువు నిషేధం సోమరులకు మాత్రమే చదువుకొనే అవకాశముండటం వలన శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం వెనుకపడ్డది. ప్రపంచవ్యాప్తంగా శ్రమ విభజనే ప్రధానంగా వుంటే, భారతసమాజంలో మాత్రం కులవ్యవస్థ ఫలితంగా శ్రమ విభజనే కాకుండా శ్రామికుల మధ్య విభజన జరిగింది. అది శ్రామిక వర్గ ఐక్యతకు విఘాతంగా మారింది. కులవ్యవస్థ దోపిడి వర్గాలకు పెట్టిన కోటవలె వుంది. కులం అగ్రకుల దోపిడి వర్గాలకు ఒకపరంగా వుంటే పీడిత, అణగారిన కులాలకొక శాపంగా పరిణమించింది. ఇలాంటి వాస్తవాలెన్నో సి వి రచనలు చదివితే మనకు బోధపడుతాయి. భారతీయ సమాజాన్ని కేవలం ఆర్ధికకోణం నుండో, రాజకీయకోణం నుండో చెప్పడం జరిగింది. కాని సామాజికకోణం నుండి రాసిన ఈ "మధ్య యుగాల్లో కులవ్యవస్థ" పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దీనిని కూడ చదివితేనే చరిత్ర అధ్యయనానికొక పరిపూర్ణత వస్తుందని నేను భావిస్తున్నాను. చరిత్రను అధ్యయనం చేయదలచుకున్న వారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.