భగవంతుడ్ని చేరడానికి భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యాన మార్గాలున్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. వీటిలో భక్తి మార్గం నిస్సందేహంగా సగటు మానవుడికి మంచి మార్గం అవుతుంది. భగవంతుడ్ని ప్రేమించే ఒకే గుణం ఇందుకు చాలు.
మనం పుట్టడానికి హేతువు తీర్చాల్సిన కర్మలే. ఆ కర్మల భారం తగ్గే కొద్దీ మన ప్రయాణం దైవం వైపు చురుగ్గా సాగుతుంది. ఎన్నడూ రైలెక్కాల్సిన అవసరం లేనివాడి చేతిలోని రైల్వే టైం టేబుల్ లా కాక, ఈ పుస్తకాన్ని మొత్తం చదివిన ఏ ఒక్క పాఠకుడిలోనైనా ఏ ఒక్క సద్గుణం కలిగినా - అది భక్తి కావచ్చు,దానగుణం కావచ్చు, లేదా ద్వేష రాహిత్యం, దైవ ధ్యానం, ఆధ్యాత్మిక జీవితంలో క్రమ శిక్షణ, నిష్కామ సేవ ఇలా ఆధ్యాత్మిక ప్రగతికి సంబందించిన ఇంకేదైనా విశిష్టగుణం కావచ్చు - అదే జరిగితే ఈ పుస్తకానికి నాకు తగిన మూల్యం లభించినట్లే. అది జరగకపోతే ఈ రచయిత సరిగ్గా చెప్పలేక పోవడమే లేదా చెప్పడంలో చిత్తశుద్ధి లేకపోవడమో కారణమై ఉండవచ్చు.
ఒకే విషయాన్ని వివిధ కోణాల్లోంచి పదే పదే చెప్పడానికి కారణం ఇలాంటివి చదివినంతసేపు అర్ధమైనట్ట్లుగా వుంటాయి. పుస్తకం ముసేసాక ఆచరణకి అవి గుర్తురావు. ఆధ్యాత్మిక అంటే ఆచరణ, ఆచరణ, ఆచరణే. కాబ్బట్టి అవి పాఠకుల మనసుల్లో ఇంకాలని పదే పదే చెప్పడం జరిగింది.
ఈ పుస్తకంలోని వ్యాసాల్లోని విషయాలు దైవం వైపు వేగంగా ప్రయాణించేలా పాఠకులకి ఉపయోగిస్తాయని, అందుకు ఆ పరమాత్మ కృప మనందరికీ తోడవుతుందని ఆశిస్తాను.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
భగవంతుడ్ని చేరడానికి భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యాన మార్గాలున్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. వీటిలో భక్తి మార్గం నిస్సందేహంగా సగటు మానవుడికి మంచి మార్గం అవుతుంది. భగవంతుడ్ని ప్రేమించే ఒకే గుణం ఇందుకు చాలు. మనం పుట్టడానికి హేతువు తీర్చాల్సిన కర్మలే. ఆ కర్మల భారం తగ్గే కొద్దీ మన ప్రయాణం దైవం వైపు చురుగ్గా సాగుతుంది. ఎన్నడూ రైలెక్కాల్సిన అవసరం లేనివాడి చేతిలోని రైల్వే టైం టేబుల్ లా కాక, ఈ పుస్తకాన్ని మొత్తం చదివిన ఏ ఒక్క పాఠకుడిలోనైనా ఏ ఒక్క సద్గుణం కలిగినా - అది భక్తి కావచ్చు,దానగుణం కావచ్చు, లేదా ద్వేష రాహిత్యం, దైవ ధ్యానం, ఆధ్యాత్మిక జీవితంలో క్రమ శిక్షణ, నిష్కామ సేవ ఇలా ఆధ్యాత్మిక ప్రగతికి సంబందించిన ఇంకేదైనా విశిష్టగుణం కావచ్చు - అదే జరిగితే ఈ పుస్తకానికి నాకు తగిన మూల్యం లభించినట్లే. అది జరగకపోతే ఈ రచయిత సరిగ్గా చెప్పలేక పోవడమే లేదా చెప్పడంలో చిత్తశుద్ధి లేకపోవడమో కారణమై ఉండవచ్చు. ఒకే విషయాన్ని వివిధ కోణాల్లోంచి పదే పదే చెప్పడానికి కారణం ఇలాంటివి చదివినంతసేపు అర్ధమైనట్ట్లుగా వుంటాయి. పుస్తకం ముసేసాక ఆచరణకి అవి గుర్తురావు. ఆధ్యాత్మిక అంటే ఆచరణ, ఆచరణ, ఆచరణే. కాబ్బట్టి అవి పాఠకుల మనసుల్లో ఇంకాలని పదే పదే చెప్పడం జరిగింది. ఈ పుస్తకంలోని వ్యాసాల్లోని విషయాలు దైవం వైపు వేగంగా ప్రయాణించేలా పాఠకులకి ఉపయోగిస్తాయని, అందుకు ఆ పరమాత్మ కృప మనందరికీ తోడవుతుందని ఆశిస్తాను. - మల్లాది వెంకట కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.