ప్రపంచాన్ని కుదిపేసిన డిజిటల్ విప్లవం యానిమేషన్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. యానిమేషన్ 3Dగా రూపు మార్చుకుంది. ఎన్నో 3D యానిమేషన్ సాప్ట్ వేర్ లు రుపొందింపబడ్డాయి.
మాయా అనేది కంప్యూటర్ తో 3D యానిమేషన్లను రూపొందించే సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం. మార్కెట్లో ఎన్నో 3D యానిమేషన్ సాఫ్ట్ వేర్ లున్నా, అన్నింటిలోకి అగ్రగణ్యమైనది మాయా! స్క్రిప్టు తో ప్రవేశించి, తిరిగి పూర్తి నిడివి సినిమాతో బయటకు వచ్చే ముడిపదార్ధం నుండీ రీళ్లవరకు (raw to reel) ఉండే హంగులతో అలరారే ఒక అధునాతన స్టూడియో వంటిది మాయా అంటే అతిశయోక్తి కాదు! మోడలింగ్, టేక్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కంపోజిటింగ్, రెండరింగ్ - మొదలైన పనులన్నింటినీ చేసే, ఇంత సర్వసమగ్రమైన 3D యానిమేషన్ సాఫ్ట్ వేర్ మరొకటి లేదు. అందువల్లనే, ఎన్నో స్టూడియోలు మాయాను 3D యానిమేషన్ చిత్రాలను రూపొందించడానికి ఉపయోగిస్తున్నారు.
వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా మాయాను నేర్చుకోవచ్చు. తమ ఊహా పటిమకు, సృజనాత్మక భావనలకు మాయాతో రూపం కల్పించి ప్రాణం పోయవచ్చు. అయితే ఇటువంటి అద్భుతమైన 3D యానిమేషన్ సాఫ్ట్ వేర్ ను పరిచయం చేస్తూ, అందరూ సులభంగా మాయాను నేర్చుకునే విధంగా తెలుగులో ఇంతవరకు పుస్తకం రాలేదు. ఆసక్తి గల తెలుగు ప్రజలందరూ, మాయాను నేర్చుకునేందుకు వీలుగా, ప్రప్రధమంగా తెలుగులో తీర్చిదిద్దిన మాయీ ప్రయత్నాన్ని, మీరు మనస్పూర్తిగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం.
మాయా రూపకర్తలు మాయాను ఉపయోగించే సౌలభ్యం కోసం మాయాను - Animation, Polygons, Surfaces, Dynamics, Rendering, nCloth వంటి విభాగాలుగా విభజించారు. ఈ విభాగాలలోని విషయాలను చక్కగా, తేటతెల్లంగా తెలుగులో - ఇంటర్ ఫేస్, మోడలింగ్, ఫైల్ మేనేజ్ మెంట్, టేక్చరింగ్, లైటింగ్, కెమరా, పెయింట్ ఎఫెక్ట్స్, డైనమిక్స్, రిగ్గింగ్, యానిమేషన్, రెండరింగ్ - వంటి అధ్యాయాలలో వివరించాం. ఈ పుస్తకం మొదటి భాగంలో మాయా గురించి సమగ్రమైన ప్రాధమిక సమాచారం ఇచ్చారు. ఇక రెండవ భాగంలో మాయాతో చేసే రకరకాల ప్రాజెక్టులను ఇచ్చారు. వాటిని ప్రాక్టీసు చేస్తూ నేర్చుకుంటే మీరు మాయాలో నిష్టాతులు అవుతారు.
- కె. కిరణ్ కుమార్
ప్రపంచాన్ని కుదిపేసిన డిజిటల్ విప్లవం యానిమేషన్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. యానిమేషన్ 3Dగా రూపు మార్చుకుంది. ఎన్నో 3D యానిమేషన్ సాప్ట్ వేర్ లు రుపొందింపబడ్డాయి. మాయా అనేది కంప్యూటర్ తో 3D యానిమేషన్లను రూపొందించే సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం. మార్కెట్లో ఎన్నో 3D యానిమేషన్ సాఫ్ట్ వేర్ లున్నా, అన్నింటిలోకి అగ్రగణ్యమైనది మాయా! స్క్రిప్టు తో ప్రవేశించి, తిరిగి పూర్తి నిడివి సినిమాతో బయటకు వచ్చే ముడిపదార్ధం నుండీ రీళ్లవరకు (raw to reel) ఉండే హంగులతో అలరారే ఒక అధునాతన స్టూడియో వంటిది మాయా అంటే అతిశయోక్తి కాదు! మోడలింగ్, టేక్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కంపోజిటింగ్, రెండరింగ్ - మొదలైన పనులన్నింటినీ చేసే, ఇంత సర్వసమగ్రమైన 3D యానిమేషన్ సాఫ్ట్ వేర్ మరొకటి లేదు. అందువల్లనే, ఎన్నో స్టూడియోలు మాయాను 3D యానిమేషన్ చిత్రాలను రూపొందించడానికి ఉపయోగిస్తున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా మాయాను నేర్చుకోవచ్చు. తమ ఊహా పటిమకు, సృజనాత్మక భావనలకు మాయాతో రూపం కల్పించి ప్రాణం పోయవచ్చు. అయితే ఇటువంటి అద్భుతమైన 3D యానిమేషన్ సాఫ్ట్ వేర్ ను పరిచయం చేస్తూ, అందరూ సులభంగా మాయాను నేర్చుకునే విధంగా తెలుగులో ఇంతవరకు పుస్తకం రాలేదు. ఆసక్తి గల తెలుగు ప్రజలందరూ, మాయాను నేర్చుకునేందుకు వీలుగా, ప్రప్రధమంగా తెలుగులో తీర్చిదిద్దిన మాయీ ప్రయత్నాన్ని, మీరు మనస్పూర్తిగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం. మాయా రూపకర్తలు మాయాను ఉపయోగించే సౌలభ్యం కోసం మాయాను - Animation, Polygons, Surfaces, Dynamics, Rendering, nCloth వంటి విభాగాలుగా విభజించారు. ఈ విభాగాలలోని విషయాలను చక్కగా, తేటతెల్లంగా తెలుగులో - ఇంటర్ ఫేస్, మోడలింగ్, ఫైల్ మేనేజ్ మెంట్, టేక్చరింగ్, లైటింగ్, కెమరా, పెయింట్ ఎఫెక్ట్స్, డైనమిక్స్, రిగ్గింగ్, యానిమేషన్, రెండరింగ్ - వంటి అధ్యాయాలలో వివరించాం. ఈ పుస్తకం మొదటి భాగంలో మాయా గురించి సమగ్రమైన ప్రాధమిక సమాచారం ఇచ్చారు. ఇక రెండవ భాగంలో మాయాతో చేసే రకరకాల ప్రాజెక్టులను ఇచ్చారు. వాటిని ప్రాక్టీసు చేస్తూ నేర్చుకుంటే మీరు మాయాలో నిష్టాతులు అవుతారు. - కె. కిరణ్ కుమార్
this is a good book for very very beginners. thanq you kiran kumar sir.
© 2017,www.logili.com All Rights Reserved.