సాంబాలోయ చుట్టూ ఉన్న కొండకొనల్లోని తండాల్లో సాంబా గిరిజనులు నిద్రపోతున్న వేళ.. చిమ్మచీకటిలో నక్షత్రాలు నిశికాంత కట్టిన నల్లని చీరకు పొదిగిన వజ్ర వైడుర్యాల్లా మెరుస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. చెట్లమీది గూళ్ళలో పక్షులు, నేలమీది పొదల్లో జంతువులు నిద్రిస్తున్న సమయం. క్షణాలు భారంగా కాలచక్రంలో కరిగిపోతున్నాయి. క్రమంగా అర్థరాత్రి ఘడియలు సమీపిస్తున్నాయి. లోయ మధ్యలో శాఖోపశాఖలుగా విస్తరించి ఎత్తుగా పెరిగిన ఒక మద్ది వృక్షం ఉంది. ఆ చెట్టు మాను కనిపించనంత ఎత్తుగా చెట్టును చుట్టుకొని ఉంది పెద్ద వల్మీకం. ఆ పుట్ట భయంకర విషనాగుల ఆవాసం. ఆ పుట్ట ఏర్పడక పూర్వం, వృక్షపాదంలో ఉగ్రరూపుడైన ఓ మనిషి శిల ఉండేదని గిరిజనులు చెప్పుకునేవారు. ఆ శిలను వల్మీకం పూర్తిగా కప్పేసిందట. ఆ శిల ఎవరిదో, ఏ కాలానిదో తెలిసినవాళ్ళెవరూ లేరిప్పుడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
సాంబాలోయ చుట్టూ ఉన్న కొండకొనల్లోని తండాల్లో సాంబా గిరిజనులు నిద్రపోతున్న వేళ.. చిమ్మచీకటిలో నక్షత్రాలు నిశికాంత కట్టిన నల్లని చీరకు పొదిగిన వజ్ర వైడుర్యాల్లా మెరుస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. చెట్లమీది గూళ్ళలో పక్షులు, నేలమీది పొదల్లో జంతువులు నిద్రిస్తున్న సమయం. క్షణాలు భారంగా కాలచక్రంలో కరిగిపోతున్నాయి. క్రమంగా అర్థరాత్రి ఘడియలు సమీపిస్తున్నాయి. లోయ మధ్యలో శాఖోపశాఖలుగా విస్తరించి ఎత్తుగా పెరిగిన ఒక మద్ది వృక్షం ఉంది. ఆ చెట్టు మాను కనిపించనంత ఎత్తుగా చెట్టును చుట్టుకొని ఉంది పెద్ద వల్మీకం. ఆ పుట్ట భయంకర విషనాగుల ఆవాసం. ఆ పుట్ట ఏర్పడక పూర్వం, వృక్షపాదంలో ఉగ్రరూపుడైన ఓ మనిషి శిల ఉండేదని గిరిజనులు చెప్పుకునేవారు. ఆ శిలను వల్మీకం పూర్తిగా కప్పేసిందట. ఆ శిల ఎవరిదో, ఏ కాలానిదో తెలిసినవాళ్ళెవరూ లేరిప్పుడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.