సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు, సాధారణ పాఠకులు కూడా సంస్కృత కావ్యాలను చదువుకొని, ఆస్వాదించి ఆనందించాలన్న సదాశయంతో సంస్కృత మహాకావ్యాల ప్రచురణను ప్రారంభించాం.
ప్రసిద్ధులైన సంస్కృతాంధ్ర పండితులు రచించిన సరళ వ్యాఖ్యానాలు సంస్కృత మహాకవుల కవితామృత ధారను గ్రోలడానికి పాఠకులకు ఉపకరిస్తాయి.
ఈ సంస్కృత సాహితి తొలికుసుమంగా ఇంతకు పూర్వమే భారవి మహాకవి కృత కిరాతార్జునీయ మహాకావ్యాన్ని తెలుగు పాఠకలోకానికి అందించాం.
ఇప్పుడు ద్వితీయకుసుమంగా మహాకవి కాళిదాస విరచిత మేఘసందేశ కావ్యాన్ని మీ ముందుంచుతున్నాం. ఉపమా ప్రధానమైన కాళిదాస కావ్య సౌరభాన్ని ఆస్వాదించవలసిందిగా సహృదయ పాఠకలోకాన్ని ఆహ్వానిస్తున్నాం.