ఈ గ్రంథంలో సాహిత్యం, నాటకం, ఫోటోగ్రఫీ, సినిమా, సంగీతం, దాతృత్వం, విద్య, జాతీయోద్యమం, వ్యాపారం, ఉద్యోగాలు ఒక్కటేమిటి స్పృశించని రంగమంటూ లేదు. అయితే గ్రంథం నిండా సామాన్యులు కనిపిస్తారు. అందరూ చిన్న చిన్న ఉద్యోగులు, సంసారులు, చేతిపనులవారు, పేదలు, తొలితరం విద్యావంతులు. ఈ వ్యాసాలన్నీ శకలాలుగా, దేనికవిగా కనిపించవచ్చు. కానీ వీటన్నిటి మధ్య అనుస్యూతమైన సూత్రం ఉంది. ఇదంతా ఒక నిర్విరామ, నిరాటంక, మానవ ప్రస్థానక్రమం.
మనిషి తనకు తానుగా వ్యక్తీకరించుకొనే అకుంఠిత ప్రయత్నం. ఒక ఉమ్మడి జీవనసంస్కారం. దీనంతటికీ మనిషి కేంద్రం. సగటు మనిషి కేంద్రం. ఎప్పుడో ఏడేళ్ళనాడు సాక్షి పత్రికలో ధారావాహికగా వచ్చిన ‘పెన్నముచ్చట్లి’వి. అంతకుముందు ఎంతకాలం నుంచి రచయిత వద్ద మౌనంగా ఉండిపోయాయో తెలియదు. ఇప్పటికిలా గ్రంథరూపంలోకి వచ్చి మన గుండె తలుపుల్ని తడుతున్నాయి.
ఈ గ్రంథంలో సాహిత్యం, నాటకం, ఫోటోగ్రఫీ, సినిమా, సంగీతం, దాతృత్వం, విద్య, జాతీయోద్యమం, వ్యాపారం, ఉద్యోగాలు ఒక్కటేమిటి స్పృశించని రంగమంటూ లేదు. అయితే గ్రంథం నిండా సామాన్యులు కనిపిస్తారు. అందరూ చిన్న చిన్న ఉద్యోగులు, సంసారులు, చేతిపనులవారు, పేదలు, తొలితరం విద్యావంతులు. ఈ వ్యాసాలన్నీ శకలాలుగా, దేనికవిగా కనిపించవచ్చు. కానీ వీటన్నిటి మధ్య అనుస్యూతమైన సూత్రం ఉంది. ఇదంతా ఒక నిర్విరామ, నిరాటంక, మానవ ప్రస్థానక్రమం. మనిషి తనకు తానుగా వ్యక్తీకరించుకొనే అకుంఠిత ప్రయత్నం. ఒక ఉమ్మడి జీవనసంస్కారం. దీనంతటికీ మనిషి కేంద్రం. సగటు మనిషి కేంద్రం. ఎప్పుడో ఏడేళ్ళనాడు సాక్షి పత్రికలో ధారావాహికగా వచ్చిన ‘పెన్నముచ్చట్లి’వి. అంతకుముందు ఎంతకాలం నుంచి రచయిత వద్ద మౌనంగా ఉండిపోయాయో తెలియదు. ఇప్పటికిలా గ్రంథరూపంలోకి వచ్చి మన గుండె తలుపుల్ని తడుతున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.