"...లోతైన పరిశోధనాగ్రంధం యిది. ఈ గ్రంథప్రాచుర్యాన్ని రెండు పార్శ్వాల్లో చూడాలి. ఒకటి, యిది సాహిత్యపరిశోధనా ప్రక్రియకే పరిమితం కాకపోవడం. రెండవ అంశం, వెంకటగిరి సంస్థానచరిత్ర నేపథ్యంగా, రాజకీయ పరిణామాలకే పరిమితం కాకుండా, సమాజంలో సమాంతరంగా చోటుచేసుకొంటున్న మార్పులతో మేళవించి, సాహిత్యసృష్టిని పరికించడం యిందులోని ప్రత్యేకత."
- వకుళాభరణం రామకృష్ణ
"ఇలాంటి పరిశోధనకు పూనుకోవాలంటే పరిశోధకునికి కేవలం సాహిత్య పాండిత్యం మాత్రమే సరిపోదు. చరిత్రతో గూడ గాఢమైన పరిచయం ఉండాలి... కాళిదాసు పురుషోత్తంగారు సాహిత్యంలోను, చరిత్రలోను మంచి పరినిష్టితి కలవారు...సంస్కృతాంద్ర సాహిత్యచరిత్రలో చేర్చదగిన ఎన్నో కొత్తవిషయాలను తెలియజేసే అమూల్యమైన సిద్ధాంతగ్రంధం ఇది."
- ఆచార్య రవ్వా శ్రీహరి
కాళిదాసు పురుషోత్తం (రచయిత గురించి) :
కాళిదాసు పురుషోత్తం నెల్లూరు సర్వోదయ కళాశాలలో పనిచేశారు. 'కవిత్రయ కవితా వైజయంతి', 'కావ్యపంచమి', 'శివారెడ్డి పద్యాలూ', 'అలనాటి సాహిత్యసేవ', గురజాడ లభ్యరచనల సమగ్ర సంకలనం 'గురుజాడలు' కు సంపాదకులు. ఇంగ్లిషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య" గ్రంథాన్ని రచించారు. పొణకా కనకమ్మ స్వీయచరిత్ర 'కనకపుష్యరాగం'ని వెలుగులోకి తెచ్చారు. ఆధునిక సాహిత్యం, చరిత్ర, సినిమా అభిమాన విషయాలు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపకసభ్యులు.
"...లోతైన పరిశోధనాగ్రంధం యిది. ఈ గ్రంథప్రాచుర్యాన్ని రెండు పార్శ్వాల్లో చూడాలి. ఒకటి, యిది సాహిత్యపరిశోధనా ప్రక్రియకే పరిమితం కాకపోవడం. రెండవ అంశం, వెంకటగిరి సంస్థానచరిత్ర నేపథ్యంగా, రాజకీయ పరిణామాలకే పరిమితం కాకుండా, సమాజంలో సమాంతరంగా చోటుచేసుకొంటున్న మార్పులతో మేళవించి, సాహిత్యసృష్టిని పరికించడం యిందులోని ప్రత్యేకత." - వకుళాభరణం రామకృష్ణ "ఇలాంటి పరిశోధనకు పూనుకోవాలంటే పరిశోధకునికి కేవలం సాహిత్య పాండిత్యం మాత్రమే సరిపోదు. చరిత్రతో గూడ గాఢమైన పరిచయం ఉండాలి... కాళిదాసు పురుషోత్తంగారు సాహిత్యంలోను, చరిత్రలోను మంచి పరినిష్టితి కలవారు...సంస్కృతాంద్ర సాహిత్యచరిత్రలో చేర్చదగిన ఎన్నో కొత్తవిషయాలను తెలియజేసే అమూల్యమైన సిద్ధాంతగ్రంధం ఇది." - ఆచార్య రవ్వా శ్రీహరి కాళిదాసు పురుషోత్తం (రచయిత గురించి) : కాళిదాసు పురుషోత్తం నెల్లూరు సర్వోదయ కళాశాలలో పనిచేశారు. 'కవిత్రయ కవితా వైజయంతి', 'కావ్యపంచమి', 'శివారెడ్డి పద్యాలూ', 'అలనాటి సాహిత్యసేవ', గురజాడ లభ్యరచనల సమగ్ర సంకలనం 'గురుజాడలు' కు సంపాదకులు. ఇంగ్లిషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య" గ్రంథాన్ని రచించారు. పొణకా కనకమ్మ స్వీయచరిత్ర 'కనకపుష్యరాగం'ని వెలుగులోకి తెచ్చారు. ఆధునిక సాహిత్యం, చరిత్ర, సినిమా అభిమాన విషయాలు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపకసభ్యులు.
© 2017,www.logili.com All Rights Reserved.