కురోసవా, మపాసా, చెహోవ్, ధామస్ వూల్ఫ్, వర్ణినియా వూల్ఫ్, పిరాండేల్లో, గోర్కీ, టాల్ స్టాయ్, పో, ఫాక్నర్, వైల్డ్, సారోయన్, యుడోరా వెల్టీ, ఫ్లానేరీ ఓ కానర్, ఐజాక్ బషేవిస్ సింగర్ వగైరా మహానుభావుల సృజనానుభవాలు, అభిప్రాయాలు.
జాక్ లండన్, డ్యూమా, డికెన్స్, వెల్స్, మార్క్ట్ ట్వేన్, జోసెఫ్ కొన్రాడ్, అప్టన్ సింక్లేర్, చింగిత్ ఐత్ మాతొవ్, హెరాల్డ్ పింటర్, సల్మాన్ రష్టి, బైరన్, నెరుడా, అర్ధర్, హెలీ, బార్బరా కార్ట్ లాండ్, వగైరాల రేఖాయాత్ర పరిచయాలున్నాయి.
రచయితలకు, సాహితీ ప్రియులకు యివి ఏ మేరకు వుపయోగపడినా పుస్తక ప్రయోజనం నెరవేరినట్టే.
మన అనుభవంలోని ఏ విషయాన్నైనా నవలగా మలచవచ్చు. చిన్న పిల్లలు చెట్లకొమ్మలు పోగుచేసి అరణ్యాల్ని, గులకరాళ్లు కుప్పగా పోసి పర్వతాల్ని సృష్టించగలరు. వయసు పెరిగినకొద్దీ మనలో ఈ ఊహశక్తి తగ్గిపోతుంది కాబోలు. ఏ వస్తువునైనా ఉన్నదున్నట్లుగా గాక మరింత పెద్దదిగానో, మరో వస్తువుగానో ఆ వస్తువు తన జీవితంలో అత్యంత ప్రధానంగా మారిన మరొక వ్యక్తీ చూసినట్టుగా ఊహిస్తే అదే కధ అంటూ రచయితలూ తమ తమ అభిప్రాయాలను మనతో పంచుకున్నారు.
- ముక్తవరం పార్ధసారధి
కురోసవా, మపాసా, చెహోవ్, ధామస్ వూల్ఫ్, వర్ణినియా వూల్ఫ్, పిరాండేల్లో, గోర్కీ, టాల్ స్టాయ్, పో, ఫాక్నర్, వైల్డ్, సారోయన్, యుడోరా వెల్టీ, ఫ్లానేరీ ఓ కానర్, ఐజాక్ బషేవిస్ సింగర్ వగైరా మహానుభావుల సృజనానుభవాలు, అభిప్రాయాలు. జాక్ లండన్, డ్యూమా, డికెన్స్, వెల్స్, మార్క్ట్ ట్వేన్, జోసెఫ్ కొన్రాడ్, అప్టన్ సింక్లేర్, చింగిత్ ఐత్ మాతొవ్, హెరాల్డ్ పింటర్, సల్మాన్ రష్టి, బైరన్, నెరుడా, అర్ధర్, హెలీ, బార్బరా కార్ట్ లాండ్, వగైరాల రేఖాయాత్ర పరిచయాలున్నాయి. రచయితలకు, సాహితీ ప్రియులకు యివి ఏ మేరకు వుపయోగపడినా పుస్తక ప్రయోజనం నెరవేరినట్టే. మన అనుభవంలోని ఏ విషయాన్నైనా నవలగా మలచవచ్చు. చిన్న పిల్లలు చెట్లకొమ్మలు పోగుచేసి అరణ్యాల్ని, గులకరాళ్లు కుప్పగా పోసి పర్వతాల్ని సృష్టించగలరు. వయసు పెరిగినకొద్దీ మనలో ఈ ఊహశక్తి తగ్గిపోతుంది కాబోలు. ఏ వస్తువునైనా ఉన్నదున్నట్లుగా గాక మరింత పెద్దదిగానో, మరో వస్తువుగానో ఆ వస్తువు తన జీవితంలో అత్యంత ప్రధానంగా మారిన మరొక వ్యక్తీ చూసినట్టుగా ఊహిస్తే అదే కధ అంటూ రచయితలూ తమ తమ అభిప్రాయాలను మనతో పంచుకున్నారు. - ముక్తవరం పార్ధసారధి
© 2017,www.logili.com All Rights Reserved.