'అసలు సమస్య కళను నేటి బహుళ జనసమూహం మనో క్షితిజ రేఖకు పరిమితం చేయటం కాక, ఆ క్షితిజ పరిధిని మరింత పెంచటం' ఆర్నాల్డ్ హాపర్. ఆ ధ్యేయంతోనే సాధారంగా వాడుకలో లేని, అవగాహనా పరిధిలోనికి రాని పారిభాషిక పదాలు వాటి అర్ధ విచారణ ఇచ్చారు. 'టిటూమి షాట్' అంటే? ప్రపంచంలో ఒకే ఒక టియంటి TMT డైరక్టర్ ఉన్నారు. అతడెవరు? ఎలా 10 నిమిషాల్ టేక్ తీయగలిగాడు? 'బెన్షీ' అంటే ఎవరు? 'చేహువ్ గన్' లక్షణం ఏమిటి. మనదేశంలో దిగ్విజయంగా ప్రదర్శించబడిన 9 గంటల నాటకం ఏది? 3 లక్షల మందితో ఓ సన్నివేశం 'రీటేక్' చేయబడింది. ఏ చిత్రం కోసం? భారత దేశంలో తొలి కామోద్రేక సన్నివేశం ఉన్న సినిమా తీసింది పితామహుడు ఫాల్కే? అదెలా సంభవం? 'ఆటో రెన్ ఫిల్మ్' 'ఆటియర్' అనగా ఏమి? 'మైజాసెన్' అని దేనిని పిలుస్తాం? 'బ్రాడ్ మన్స్ లా' అంటే ఏమిటి? దానిని సమర్ధవంతంగా అనుసరించిన దిగ్దర్శకులు ఎవరు? 'ఆడియన్స్' 'స్పేక్టేటర్' పదాల మధ్య గల తేడా ఏమిటి. 'స్కోఫోఫిలియా' వ్యాధి లక్షణం ఏమిటి? మన చీరను గురించి చిలీ విప్లవకవి పాబ్లో నెరూడా ఏమన్నారు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు బదులు పలుకుతుంది సినిమా గా సినిమా.
కొన్ని నమ్మలేని నిజాలు మన ముందు ఉంచారు. నందగోపాల్. 'కవిత తర్వాత వచనం పుట్టింది' 'మన శాస్త్రీయం సంగీతంలో శ్రావ్యత ఉన్నా, పాశ్చాత్య సంగీతంలా, సినిమాకు సాంకేతికంగా అంతగా ఒదగదు' మన షూటింగ్ కు వాడిన ముడిఫిల్మ్, సినిమా తుది తూపంలో అవసరం అయ్యే ఫిల్మ్ ల నిడివి నిష్పత్తి, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 4:1. కాని కెవిరెడ్డి నిష్పత్తి అందులో సగం 2: 1. సినిమా ముమ్మాటికీ పరిశోధనా గ్రంధమే.
ఇన్నాళ్ళకు నందగోపాల్ కలం కదిలింది. ఆయన మాటల్లోనే 'నా చిరస్వప్నం రూపుదాల్చింది. సినిమా గా సినిమా అవతరించింది'. పుస్తకం 37 అధ్యాయాలూ, అనుబంధం, కవర్ టు కవర్ ఏకబిగిని చదివా! చదివించింది ఉల్లాసంగా. నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఐమాక్స్ లో ఎవరెస్ట్ చూసిన, చేరుకున్న అనుభూతి. 'సర్కారమా'లో ఓ మాగ్నమ్ ఓపన్ వీక్షిస్తున్న ఆనందం, వివేకం, వికాసం మరల మామూలు సినీ గోయర్ లా భక్తీతో చదివా, నాకు అర్ధం కాని, నా తల దాటిపోయిన జటిల సాంకేతిక అంశాలు ఏవీ, ఎక్కడా కనపడలా, అద్భుతమైన రచన. అంతకు మించి గొప్ప పరిశోధన. అన్నిటికన్న మిన్న అందాల తెలుగు. ముందుమాట ఏకైక కోసం సినిమా గా సినిమా చదివిన తొలి పాఠకుడు కావటం నా భాగ్యం.
సినిమాకు సంబంధించి కళ, సాంకేతికత, సౌందర్య విలువలు (Aesthetic Values), శైలీ బేధాలు, సృజన వీటి విభిన్న పార్శ్వలు, భిన్న కోణాల నుండి పరిశోధనా దృష్టితో వీక్షించి, చరిత్రను సమీక్షించి తులలేని అధ్యయనంగా రూపుదిద్దుకున్న తొలి తెలుగు గ్రంథం 'సినిమా గా సినిమా'. తెలుగు జాతి గర్వించతగిన ఏకైక నవ్య సినీ వేత్త నందగోపాల్.
- డాక్టర్ జయదేవ్
'ఆనాడు చిత్ర నిర్మాణానికి వలసిన కళాత్మక, సాంకేతిక విలువలు, శాస్త్రీయ అవగాహన - అనుభవం నాలో కోరవడినా, ధైర్యమూ, సాహసమూ నాలో లోపించినా - సినిమా పరిశ్రమ ఎట్టి పరిస్థితులలోనూ 1912లో భారతదేశంలో నెలకొని ఉండేది కాదు'.
- దాదా సాహెబ్ ఫాల్కే
సినిమా తల్లి పేగు తెంచుకుని పుట్టి, ఆ తల్లి ఆదరణలో పెరిగి పెద్దవాడినయిన నేను దశాబ్దాల మన సినిమా చరిత్రనూ, గత వైభవాన్నీ చూసి గర్వపడుతున్నాను. ఉజ్వల వారసత్వం నేటి యువత చేతుల్లో ఉంది. ఆధునిక టెక్నాలజీ అద్భుత సాంకేతిక పరికరాలను అందుబాటులో తెచ్చింది. పాతకొత్తల మేలుకలయికతో, విలువలతో రాజీ పడకుండా మనం అందించే సిసలయిన చిత్రాలే తల్లి సినిమాకు నిత్య నీరాజనాలు.
- ఎల్ వి ప్రసాద్
'దశాబ్దాల నాటి మన తెలుగు చిత్రాలు నేటికి నిత్య నూతనంగా విలసిల్లుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు ఆ చిత్రాలను బ్రతికించే విశిష్ట లక్షణాలు ఏవేవో ఆ సినిమాలలో చోటు చేసుకొని ఉంటాయి. విశ్వజనీనమైన మమతానురాగాలు, మానవత ఆ చిత్రాల ఇతివృత్తాలకు ఆలంబనగా వుండి ఉంటాయి.
- బి. నాగిరెడ్డి
జీవితం దర్శకుని ఉచ్చ్వాస కావాలి
సినిమా దర్శకుని నిశ్వాస కావాలి
- మేరీ సెటన్
'స్క్రీన్ ప్లే పేకమేడ వంటిది. అందులో ఏ కార్డు కదిలినా మేడ మొత్తం కూలిపోతుంది'.
- శామ్యూల్ గోల్ద్విన్
ఇందులో సినిమా లోని ప్రతి విభాగం గురించి చక్కగా వివరించారు. సినిమా గురించి తెలుసుకోవాలనుకునే వారి చక్కగా ఉపయోగపడే గ్రంధం ఇది.
'అసలు సమస్య కళను నేటి బహుళ జనసమూహం మనో క్షితిజ రేఖకు పరిమితం చేయటం కాక, ఆ క్షితిజ పరిధిని మరింత పెంచటం' ఆర్నాల్డ్ హాపర్. ఆ ధ్యేయంతోనే సాధారంగా వాడుకలో లేని, అవగాహనా పరిధిలోనికి రాని పారిభాషిక పదాలు వాటి అర్ధ విచారణ ఇచ్చారు. 'టిటూమి షాట్' అంటే? ప్రపంచంలో ఒకే ఒక టియంటి TMT డైరక్టర్ ఉన్నారు. అతడెవరు? ఎలా 10 నిమిషాల్ టేక్ తీయగలిగాడు? 'బెన్షీ' అంటే ఎవరు? 'చేహువ్ గన్' లక్షణం ఏమిటి. మనదేశంలో దిగ్విజయంగా ప్రదర్శించబడిన 9 గంటల నాటకం ఏది? 3 లక్షల మందితో ఓ సన్నివేశం 'రీటేక్' చేయబడింది. ఏ చిత్రం కోసం? భారత దేశంలో తొలి కామోద్రేక సన్నివేశం ఉన్న సినిమా తీసింది పితామహుడు ఫాల్కే? అదెలా సంభవం? 'ఆటో రెన్ ఫిల్మ్' 'ఆటియర్' అనగా ఏమి? 'మైజాసెన్' అని దేనిని పిలుస్తాం? 'బ్రాడ్ మన్స్ లా' అంటే ఏమిటి? దానిని సమర్ధవంతంగా అనుసరించిన దిగ్దర్శకులు ఎవరు? 'ఆడియన్స్' 'స్పేక్టేటర్' పదాల మధ్య గల తేడా ఏమిటి. 'స్కోఫోఫిలియా' వ్యాధి లక్షణం ఏమిటి? మన చీరను గురించి చిలీ విప్లవకవి పాబ్లో నెరూడా ఏమన్నారు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు బదులు పలుకుతుంది సినిమా గా సినిమా. కొన్ని నమ్మలేని నిజాలు మన ముందు ఉంచారు. నందగోపాల్. 'కవిత తర్వాత వచనం పుట్టింది' 'మన శాస్త్రీయం సంగీతంలో శ్రావ్యత ఉన్నా, పాశ్చాత్య సంగీతంలా, సినిమాకు సాంకేతికంగా అంతగా ఒదగదు' మన షూటింగ్ కు వాడిన ముడిఫిల్మ్, సినిమా తుది తూపంలో అవసరం అయ్యే ఫిల్మ్ ల నిడివి నిష్పత్తి, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 4:1. కాని కెవిరెడ్డి నిష్పత్తి అందులో సగం 2: 1. సినిమా ముమ్మాటికీ పరిశోధనా గ్రంధమే. ఇన్నాళ్ళకు నందగోపాల్ కలం కదిలింది. ఆయన మాటల్లోనే 'నా చిరస్వప్నం రూపుదాల్చింది. సినిమా గా సినిమా అవతరించింది'. పుస్తకం 37 అధ్యాయాలూ, అనుబంధం, కవర్ టు కవర్ ఏకబిగిని చదివా! చదివించింది ఉల్లాసంగా. నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఐమాక్స్ లో ఎవరెస్ట్ చూసిన, చేరుకున్న అనుభూతి. 'సర్కారమా'లో ఓ మాగ్నమ్ ఓపన్ వీక్షిస్తున్న ఆనందం, వివేకం, వికాసం మరల మామూలు సినీ గోయర్ లా భక్తీతో చదివా, నాకు అర్ధం కాని, నా తల దాటిపోయిన జటిల సాంకేతిక అంశాలు ఏవీ, ఎక్కడా కనపడలా, అద్భుతమైన రచన. అంతకు మించి గొప్ప పరిశోధన. అన్నిటికన్న మిన్న అందాల తెలుగు. ముందుమాట ఏకైక కోసం సినిమా గా సినిమా చదివిన తొలి పాఠకుడు కావటం నా భాగ్యం. సినిమాకు సంబంధించి కళ, సాంకేతికత, సౌందర్య విలువలు (Aesthetic Values), శైలీ బేధాలు, సృజన వీటి విభిన్న పార్శ్వలు, భిన్న కోణాల నుండి పరిశోధనా దృష్టితో వీక్షించి, చరిత్రను సమీక్షించి తులలేని అధ్యయనంగా రూపుదిద్దుకున్న తొలి తెలుగు గ్రంథం 'సినిమా గా సినిమా'. తెలుగు జాతి గర్వించతగిన ఏకైక నవ్య సినీ వేత్త నందగోపాల్. - డాక్టర్ జయదేవ్ 'ఆనాడు చిత్ర నిర్మాణానికి వలసిన కళాత్మక, సాంకేతిక విలువలు, శాస్త్రీయ అవగాహన - అనుభవం నాలో కోరవడినా, ధైర్యమూ, సాహసమూ నాలో లోపించినా - సినిమా పరిశ్రమ ఎట్టి పరిస్థితులలోనూ 1912లో భారతదేశంలో నెలకొని ఉండేది కాదు'. - దాదా సాహెబ్ ఫాల్కే సినిమా తల్లి పేగు తెంచుకుని పుట్టి, ఆ తల్లి ఆదరణలో పెరిగి పెద్దవాడినయిన నేను దశాబ్దాల మన సినిమా చరిత్రనూ, గత వైభవాన్నీ చూసి గర్వపడుతున్నాను. ఉజ్వల వారసత్వం నేటి యువత చేతుల్లో ఉంది. ఆధునిక టెక్నాలజీ అద్భుత సాంకేతిక పరికరాలను అందుబాటులో తెచ్చింది. పాతకొత్తల మేలుకలయికతో, విలువలతో రాజీ పడకుండా మనం అందించే సిసలయిన చిత్రాలే తల్లి సినిమాకు నిత్య నీరాజనాలు. - ఎల్ వి ప్రసాద్ 'దశాబ్దాల నాటి మన తెలుగు చిత్రాలు నేటికి నిత్య నూతనంగా విలసిల్లుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు ఆ చిత్రాలను బ్రతికించే విశిష్ట లక్షణాలు ఏవేవో ఆ సినిమాలలో చోటు చేసుకొని ఉంటాయి. విశ్వజనీనమైన మమతానురాగాలు, మానవత ఆ చిత్రాల ఇతివృత్తాలకు ఆలంబనగా వుండి ఉంటాయి. - బి. నాగిరెడ్డి జీవితం దర్శకుని ఉచ్చ్వాస కావాలి సినిమా దర్శకుని నిశ్వాస కావాలి - మేరీ సెటన్ 'స్క్రీన్ ప్లే పేకమేడ వంటిది. అందులో ఏ కార్డు కదిలినా మేడ మొత్తం కూలిపోతుంది'. - శామ్యూల్ గోల్ద్విన్ ఇందులో సినిమా లోని ప్రతి విభాగం గురించి చక్కగా వివరించారు. సినిమా గురించి తెలుసుకోవాలనుకునే వారి చక్కగా ఉపయోగపడే గ్రంధం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.