చికిత్స చేసే వైద్యునికి ఆయా వ్యాధుల గురించి పరిపూర్ణ జ్ఞానం వుండకపొతే ఎంత ప్రమాదమో, డయబెటిస్ లాంటి దీర్ఘకళ వ్యాధుల్లో రోగికి ఆ వ్యాధి పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడం కూడా అంతే ప్రమాదం!
శరీరంలోని ప్రతి అవయవం మీద తన ప్రభావం చూపిస్తుంది డయబెటిస్. అలాంటి వ్యాధి నివారణకు, ప్రాధమిక దశలో చికిత్సకూ వ్యాధిగ్రస్తులు తగిననంత అవగాహన, ఆరోగ్య శిక్షణ పొందటం చాలా ముఖ్యం. సరైన చికిత్స పొందుతూ, రాబోయే చిక్కులను నివారించుకోవడానికి డయబెటిస్ గురించి ప్రతి రోగి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
మధుమేహ వ్యాధి అన్ని దేశాల్లోలాగే, మన దేశంలో కూడా ఉధృతంగా పెరుగుతున్నది. ఇటీవల అంచనాల ప్రకారం మన దేశంలో 62 మిలియన్ల (6.2 కోట్లు) మందికి ఈ వ్యాధి ఉన్నది. 2030 నాటికీ అన్నిదేశాలకంటె ఎక్కువగా మన భారతదేశంలో సుమారు 80 మిలియన్ల (8 కోట్లు) మందికి మధుమేహం ఉండబోతున్నది.
వ్యాధి అదుపులో లేకుంటే వచ్చే రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, డయబెటిక్ కోమా, గాంగ్రీన్ మొదలైన సమస్యలను వివరిస్తూ అలాంటి వాటి నుండి రక్షణ పొందేందుకు తగిన సూచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
వ్యాధిగ్రస్తులు వ్యాధి గురించి అవగాహన పెంచుకుని, తగు శ్రద్ధతో చికిత్స పొందతూ, ఆహార నియమాలను పాటిస్తూ వ్యాధిని అదుపులో వుంచుకుని, సంపూర్ణ ఆరోగ్య వంతునిలా ఉల్లాసంగా గడపటానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి.
ప్రముఖ వైద్య నిపుణులైన డా.పి. దక్షిణామూర్తిగారు విశిష్ట రచనా నైపుణ్యంతో, సులభ శైలిలో, డయబెటిస్ గురించి రచించిన వైజ్ఞానిక గ్రంథం 'డయబెటిస్ గైడ్'.
చికిత్స చేసే వైద్యునికి ఆయా వ్యాధుల గురించి పరిపూర్ణ జ్ఞానం వుండకపొతే ఎంత ప్రమాదమో, డయబెటిస్ లాంటి దీర్ఘకళ వ్యాధుల్లో రోగికి ఆ వ్యాధి పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడం కూడా అంతే ప్రమాదం! శరీరంలోని ప్రతి అవయవం మీద తన ప్రభావం చూపిస్తుంది డయబెటిస్. అలాంటి వ్యాధి నివారణకు, ప్రాధమిక దశలో చికిత్సకూ వ్యాధిగ్రస్తులు తగిననంత అవగాహన, ఆరోగ్య శిక్షణ పొందటం చాలా ముఖ్యం. సరైన చికిత్స పొందుతూ, రాబోయే చిక్కులను నివారించుకోవడానికి డయబెటిస్ గురించి ప్రతి రోగి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. మధుమేహ వ్యాధి అన్ని దేశాల్లోలాగే, మన దేశంలో కూడా ఉధృతంగా పెరుగుతున్నది. ఇటీవల అంచనాల ప్రకారం మన దేశంలో 62 మిలియన్ల (6.2 కోట్లు) మందికి ఈ వ్యాధి ఉన్నది. 2030 నాటికీ అన్నిదేశాలకంటె ఎక్కువగా మన భారతదేశంలో సుమారు 80 మిలియన్ల (8 కోట్లు) మందికి మధుమేహం ఉండబోతున్నది. వ్యాధి అదుపులో లేకుంటే వచ్చే రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, డయబెటిక్ కోమా, గాంగ్రీన్ మొదలైన సమస్యలను వివరిస్తూ అలాంటి వాటి నుండి రక్షణ పొందేందుకు తగిన సూచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వ్యాధిగ్రస్తులు వ్యాధి గురించి అవగాహన పెంచుకుని, తగు శ్రద్ధతో చికిత్స పొందతూ, ఆహార నియమాలను పాటిస్తూ వ్యాధిని అదుపులో వుంచుకుని, సంపూర్ణ ఆరోగ్య వంతునిలా ఉల్లాసంగా గడపటానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి. ప్రముఖ వైద్య నిపుణులైన డా.పి. దక్షిణామూర్తిగారు విశిష్ట రచనా నైపుణ్యంతో, సులభ శైలిలో, డయబెటిస్ గురించి రచించిన వైజ్ఞానిక గ్రంథం 'డయబెటిస్ గైడ్'.© 2017,www.logili.com All Rights Reserved.